గదులు లేక చెట్ల కింద కూర్చున్న విద్యార్థులు
సాక్షి,డీ.హీరేహాళ్: కార్పొరేట్ పాఠశాల్లో చదువు చెప్పించే స్థోమత లేని చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో కనీస వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
అన్నీ సమస్యలే
మండలంలోని పూలకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 6 నుండి 10 వతరగతి వరకు 228 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. వీరికి ఒక్కో తరగతికి ఒక్కో తరగతి గది ఉండాలి కానీ కేవలం మూడు గదులు మాత్రమే ఉండడంతో చెట్ల కింద, వరండాలో చదువులు చెప్పిస్తున్నారు. 8 గదులకు గాను 3 గదులు ఉండడంతో వారి చదువులు చెట్ల కిందనే కొనసాగుతున్నాయి. విద్యార్థులకు అనుగుణంగా పది మంది ఉపాద్యాయులు ఉండాల్సిన చోట ఆరుమంది మాత్రమే ఉన్నారు. పాఠశాల మైదానం కూడా గుంతలమయం కావడంతో ఆటలు ఆడుకోవాడానికి ఇబ్బంది పడుతున్నారు.
అలాగే పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంటగది లేకపోవడంతో పాఠశాల పక్కనే తడికేలతో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్డులోనే వంట చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు పొగ బాధ తప్పడం లేదు. విద్యుత్ ఉన్నప్పుడే నీరు అరకోరగానే వస్తాయి. విద్యుత్ లేకపోతే విద్యార్థులు నీటి కోసం పొలాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. మరుగు దొడ్లులు కూడా మూడు యూనిట్లు ఉండాల్సి ఉన్నా ఒకే మరుగు దోడ్డి ఉండడంతో బాలికలు, మహిళా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. గదుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి కాలవ శ్రీనివాసులుకు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినా నేటికీ గదుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment