Lack of sleep
-
టైం 12 దాటినా నిద్రపట్టడం లేదా?.. అయితే ఇవి మానేయండి
మారిన జీవన విధానాలు, చుట్టుముడుతున్న ఆర్థిక, కుటుంబ సమస్యల నడుమ మధ్య వయస్కులు, వృద్ధుల్లో కంటి నిండా నిద్ర కరవు అవుతోంది. ముఖ్యంగా మధ్య వయస్కులు పగలంతా కష్టం చేసి రాత్రి అయ్యాక కంటి నిండా నిద్రపోవడం ఒక కలగా మారుతోంది. ఏజ్‌వెల్ ఫౌండేషన్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 40 నుంచి 64 ఏళ్లు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇలా రెండు వర్గాలుగా మే నెలలో దేశవ్యాప్తంగా 5 వేల మంది నుంచి ఫౌండేషన్ వివరాలుసేకరించింది. వీరిలో 40 నుంచి 64 ఏళ్ల వారు 2245 (పురుషులు 1102, మహిళలు 143)మంది, 65 ఏళ్లు పైబడిన వారు 2,755 (పురుషులు 1,336, మహిళలు 1,419) మంది ఉన్నారు. ఆరు గంటలు కూడా నిద్రపోలేకున్నాం 70 శాతం మంది రోజులో కనీసం ఆరు గంటలు కూడా కంటి నిండా నిద్ర పోలేకపోతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 24 శాతం మంది మాత్రం 7 నుంచి 8 గంటలు, 6 శాతం మంది 8 గంటలకు పైగా నిద్రపోతున్నట్టు తెలిపారు. మధ్య వయసుల్లో 60 శాతం ఆరు గంటలలోపు, 31 శాతం 7 నుంచి 8 గంటలు, 9 శాతం మంది 8 గంటలకుపైగా నిద్రపోతున్నామన్నారు. అదే వృద్ధుల్లో 78 శాతం మంది ఆరు గంటల్లోపు, 19 శాతం మంది 7 నుంచి 8 గంటలు, 3 శాతం మంది 8 గంటలకుపైగా నిద్ర పోతున్నట్టు వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందులు ప్రధాన కారణం నిద్ర లేమికి ప్రధాన కారణం ఆర్థిక పరమైన అంశాలేనని సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య లేకపోవడం, ఇతర కలహాలు కారణమని పేర్కొంది. యాంత్రిక జీవనం, మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు, మద్యం సేవించడం, ఇతర సమస్యలతో సరైన నిద్ర ఉండటంలేదని కూడా ఫౌండేషన్ తెలిపింది. వయోభారం రీత్యా చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు, ఒంటరి జీవనం నిద్రలేమికి కారణంగా వృద్ధులు పేర్కొన్నారు. పురుషులే అధికం నిద్రలేమితో సతమతం అవుతున్న వారిలో పురుషులే అధికం. పురుషుల్లో 81 శాతం మంది కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని వెల్లడించారు. అదే మహిళల విషయానికి వస్తే 60 శాతం మంది ఆరు గంటలలోపు నిద్రపోతున్నామని చెప్పారు. మరో 15 శాతం మంది పురుషులు, 32 శాతం మంది మహిళలు 7 నుంచి 8 గంటలు, 4 శాతం పురుషులు, 8 శాతం మహిళలు 8 గంటలకు పైగా నిద్రపోతున్నట్టు తెలిపారు. సర్వేలో పాల్గొన్న మొత్తం వ్యక్తుల్లో 55.08 శాతం మంది ప్రస్తుతం నిద్ర విధానంతో అసంతృప్తిగా ఉన్నామని తెలిపారు. ఇలా చేయండి.. నిద్ర పడుతుంది సర్వేలో భాగంగా నిద్ర లేమి సమస్య నివారణకు పలు సలహాలు, సూచనలు కూడా ఫౌండేషన్ తెలియజేసింది. అవి.. ♦ నిద్రకు ఉపక్రమించే 4 గంటల ముందు నుంచి కాఫీ, టీలు తాగకూడదు. ధూమపానం, మద్యపానం చేయకూడదు. వేడి పాలను తాగాలి ♦ ఆందోళన, ఒత్తిడి, నిరాశ నిద్రకు పెద్ద అవరోధం. వాటిని అధిగమించడానికి చర్యలు తీసుకోవాలి ♦ పగటిపూట నిద్ర మానుకోవాలి ♦టీవీ, సెల్‌ఫోన్ చూడకూడదు ♦ పడక గదిలో స్లీప్ ఫ్రెండ్లీ వాతావరణం ఉండేలా చూసుకోవాలి -
‘ఈ సలహా నా భార్య ఎప్పుడో చెప్పింది’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపారాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ జనాలకు బాగా చేరువయ్యారు. ముఖ్యంగా ట్విటర్లో యాక్టివ్‌గా ఉంటూ విభిన్న అంశాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. వీటిల్లో ఎక్కువగా ఇతరులను ప్రోత్సహించే, ఉత్తేజపరిచే, నవ్వించే ట్వీట్లే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా నిద్రలేమికి తన భార్య కొన్నేళ్ల క్రితమే ఓ సలహా ఇచ్చిందంటూ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం.. ఈ సమస్య సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి కారణాలు అనేకం ఉండొచ్చు. అయితే ఈ సమస్యను భరించలేని కొంతమంది డాక్టర్లను సంప్రదించి జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అచ్చం ఇలాగే ఎరిక్ సోల్హీమ్ అనే వ్యక్తి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారికి అవసరమైన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇదే అంటూ ట్విటర్లో ఓ పోస్టు షేర్ చేశారు. చదవండి: భయంకర దృశ్యాలు.. డ్రైవర్ వేధింపులు.. కదులుతున్న ఆటో నుంచి దూకడంతో recommended treatment: pic.twitter.com/3wZmgNAHQj — Erik Solheim (@ErikSolheim) November 4, 2022 అందులో ‘నిద్రపట్టకపోవడమనే సమస్యకు పరిష్కారం మీ ఫోన్, కంప్యూటర్ను దూరంగా పారేయండి’ అని రాసుంది. ఇందులో పేషెంట్ పేరు ఆనంద్. ఈ ట్వీట్ ఆనంద్ మహీంద్రా కంటికి చిక్కింది. దీనిని రీట్వీట్ చేస్తూ.. ‘మీరు నా కోసమే ఈ ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే నా భార్య చాలా కాలం క్రితం నాకు ఈ సలహా ఇచ్చింది. ఆమెకు మెడికల్ డిగ్రీ కూడా లేదు.’ అని పేర్కొన్నారు. చదవండి: మహిళపై పెంపుడు కుక్క దాడి.. యజమానికి షాకిచ్చిన కోర్టు Looks like you were tweeting this to me, @ErikSolheim ?? By the way, my wife prescribed this for me aeons ago. And she doesn’t even possess a medical degree…😃 https://t.co/UOu5lp54sE — anand mahindra (@anandmahindra) November 15, 2022 ఇక ఆనంద్ మహీంద్రా చేసిన ఫన్నీ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘సర్ మీ భార్య మాటలు వినకండి.. మీరు మీ ఫోన్లు, కంప్యూటర్లు వాడటం మానేస్తే మేం మీమ్మల్ని చాలా మిస్ అవుతాం’. పలువురు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ఈ ప్రిస్క్రిప్షన్ ఫాలో అయితే తప్పకుండా నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు. -
హోమియో వైద్యంతో పార్శ్వపు నొప్పి మాయం
ప్రతి వంద మందిలో 15 నుండి 20 మంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. ఇది సాధారణంగా 15 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పార్శ ్వపు నొప్పితో (Migraine) బాధ పడుతున్నారా అని తెలుసుకోవటం ఎలా =నెలలో 5 కంటే ఎక్కువసార్లు తలనొప్పి రావటం =తలనొప్పి 4 గంటల నుండి 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది =కనీసం రెండు సార్లు అయినా తలలో ఏదో ఒక వైపు నొప్పి రావటం =వాంతులు అవటం, శబ్దం లేక వెలుతురు భరించలేకపోవటం వంటి లక్షణాలు తలనొప్పితో పాటు కానీ తలనొప్పి ముందు కానీ ఉండడటం =AURAతో కూడిన తలనొప్పి- అంటే... తలనొప్పి వచ్చే ముందు... కళ్లు మసకబారటం, కళ్ల ముందు వెలుతురు కనిపించటం, మెరుపులు ప్రకాశవంతమైన జ్యోతుల లాంటివి కనిపించటం మొదలగు లక్షణాలను కలిపి అ్ఖఖఅ అని అంటారు. పార్శ్వపు నొప్పి అనగా చాలా తీవ్రమైన తలనొప్పి ఉండటం మరియు ఏదో ఒక వైపు తలనొప్పి రావటం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. సాధారణంగా ఇది మెడ వెనుక భాగంలో ప్రారంభమై కంటి వరకు వ్యాపిస్తుంది. తలనొప్పి వచ్చే ముందు కళ్లు మసక బారటం, తల తిరగటం వంటి లక్షణాలతో తలనొప్పి వస్తుంది. కడుపులో వికారంగా ఉండటం లేదా వాంతులు కావటం వంటి లక్షణాలు పార్శ్వపునొప్పిలో సాధారణం. పార్శ్వపు నొప్పికి కారణమైన నిర్దిష్టమైన జీవప్రక్రియ వ్యవస్థ గురించి తగిన శాస్త్రీయ ఆధారాలు ఇప్పటికీ అందుబాటులో లేవు. కానీ తలలోని నరాలలో కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావటం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. పార్శ్వపు నొప్పి రావటానికి గల కారణాలు =శారీరక మరియు మానసిక ఒత్తిడి =నిద్ర లేకపోవటం =ఎక్కువసేపు ఆకలిగా ఉండటం మరియు సమయానికి భోజనం చేయక పోవటం =స్త్రీలలో హార్మోన్ హెచ్చు తగ్గుల వల్ల కూడా పార్శ్వపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా నెలసరి సమయంలోను, గర్భిణీ స్త్రీలలోను మరియు మెనోపాజ్ సమయంలో చూస్తూ ఉంటాము =అతి వెలుగు, గట్టి శబ్దాలు మరియు ఘాటైన సువాసనలు పార్శ్వపునొప్పికి కారణాలు కావచ్చు =పొగతాగటం లేదా ఇంట్లో పొగతాగే వారుండటం =మద్యం సేవించటం లేదా ఇతర మత్తు పదార్థాలు కూడా పార్శ్వపునొప్పికి కారణం కావచ్చు. పైన పేర్కొన్న కారణాలకు దూరంగా ఉండటం వల్ల కొంతవరకు తలనొప్పిని రాకుండా చేయటం లేదా అదుపులో ఉంచటం చేయవచ్చు. లక్షణాలు: పార్శ్వపు నొప్పిలో చాలా రకాల లక్షణాలు ఉంటాయి. వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు. =పార్శ్వపునొప్పి వచ్చే ముందు కనిపించే లక్షణాలు (PRODROME & AURA) ఈ లక్షణాలు పార్శ్వపునొప్పి వచ్చే కొన్ని గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. =చిరాకు, నీరసం, అలసట, నిరుత్సాహం. =కొన్ని రకాల తినుబండారాలను ఎక్కువగా ఇష్టపడటం =వెలుతురు మరియు శబ్దాన్ని తట్టుకోలేకపోవటం =కళ్లు మసక బారటం, కళ్ల ముందు మెరుపులు లేదా వెలుతురు కనిపించటం జరుగవచ్చు. వీటినే అ్ఖఖఅ అంటారు. 2. పార్శ్వపు నొప్పి సమయంలో వచ్చే లక్షణాలు (paInphase) =సాధారణం నుండి అతి తీవ్రమైన తలనొప్పి =తలలో ఒక వైపు ఎక్కువగా తలనొప్పి ఉండటం =పని చేస్తున్నప్పుడు నొప్పి తీవ్రత ఎక్కువ అవటం =నొప్పి సాధారణంగా 4 గంటల నుండి 72 గంటల వరకు ఉండవచ్చు. =కడుపులో వికారం లేదా వాంతులు అవటం 3. పార్శ్వపునొప్పి వచ్చిన తరువాత లక్షణాలు =చిరాకు ఎక్కువగా ఉండటం నీరసంగా ఉండటం =వికారం, వాంతులు, విరోచనాలు కావటం హోమియో కేర్ ఇంటర్ నేషనల్ నందు జెనెటిక్ కాన్స్టిట్యూషన్ వైద్య విధానం ద్వారా మరియు ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన కచ్చితమైన చికిత్స ద్వారా పార్శ్వపు నొప్పి తీవ్రతనే కాకుండా పార్శ్వపునొప్పిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఎటువంటి దుష్ఫలితాలు లేని మరియు వ్యాధిని సమూలంగా నిర్మూలించే ప్రత్యేక వైద్యం కేవలం హోమియోకేర్ ఇంటర్నేషనల్కే సొంతం. రోగ నిర్థారణ పరీక్షలు పార్శ్వపునొప్పిని నిర్థారించుకోవటానికి ఖచ్చితమైన రోగనిర్థారణ పరీక్షలు లేవు. రోగ లక్షణాలను బట్టి ఎక్కువసార్లు పార్శ్వపునొప్పిని నిర్థారించటం జరుగుతుంది. ఈసీజీ, సీటీ-బ్రెయిన్, ఎమ్మారై-బ్రెయిన్ మొదలగు పరీక్షలు చేయటం ద్వారా ఇతరత్రా తీవ్రమైన వ్యాధులు లేవని నిర్థారించుకోవటం వల్ల మైగ్రేన్ తలనొప్పిని నిర్థారించుకోవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.