ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపారాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ జనాలకు బాగా చేరువయ్యారు. ముఖ్యంగా ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉంటూ విభిన్న అంశాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. వీటిల్లో ఎక్కువగా ఇతరులను ప్రోత్సహించే, ఉత్తేజపరిచే, నవ్వించే ట్వీట్లే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా నిద్రలేమికి తన భార్య కొన్నేళ్ల క్రితమే ఓ సలహా ఇచ్చిందంటూ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం.. ఈ సమస్య సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి కారణాలు అనేకం ఉండొచ్చు. అయితే ఈ సమస్యను భరించలేని కొంతమంది డాక్టర్లను సంప్రదించి జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అచ్చం ఇలాగే ఎరిక్ సోల్‌హీమ్ అనే వ్యక్తి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారికి అవసరమైన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇదే అంటూ ట్విటర్‌లో ఓ పోస్టు షేర్ చేశారు.
చదవండి: భయంకర దృశ్యాలు.. డ్రైవర్ వేధింపులు.. కదులుతున్న ఆటో నుంచి దూకడంతో
recommended treatment: pic.twitter.com/3wZmgNAHQj
— Erik Solheim (@ErikSolheim) November 4, 2022
అందులో ‘నిద్రపట్టకపోవడమనే సమస్యకు పరిష్కారం మీ ఫోన్, కంప్యూటర్‌ను దూరంగా పారేయండి’ అని రాసుంది. ఇందులో పేషెంట్ పేరు ఆనంద్. ఈ ట్వీట్ ఆనంద్ మహీంద్రా కంటికి చిక్కింది. దీనిని రీట్వీట్ చేస్తూ.. ‘మీరు నా కోసమే ఈ ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే నా భార్య చాలా కాలం క్రితం నాకు ఈ సలహా ఇచ్చింది. ఆమెకు మెడికల్ డిగ్రీ కూడా లేదు.’ అని పేర్కొన్నారు.
చదవండి: మహిళపై పెంపుడు కుక్క దాడి.. యజమానికి షాకిచ్చిన కోర్టు
Looks like you were tweeting this to me, @ErikSolheim ??
— anand mahindra (@anandmahindra) November 15, 2022
By the way, my wife prescribed this for me aeons ago. And she doesn’t even possess a medical degree…😃 https://t.co/UOu5lp54sE
ఇక ఆనంద్ మహీంద్రా చేసిన ఫన్నీ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘సర్ మీ భార్య మాటలు వినకండి.. మీరు మీ ఫోన్లు, కంప్యూటర్లు వాడటం మానేస్తే మేం మీమ్మల్ని చాలా మిస్ అవుతాం’. పలువురు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ఈ ప్రిస్క్రిప్షన్ ఫాలో అయితే తప్పకుండా నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment