కరోనా స్పెషల్‌ ఆటో చూడండి | Anand Mahendra Shared a Video of Swach Bharat Auto Having Sink for Handwash | Sakshi
Sakshi News home page

వైరల్‌: కరోనా స్పెషల్‌ ఆటోను చూస్తే మతి పోవాల్సిందే!

Published Fri, Jul 10 2020 3:54 PM | Last Updated on Fri, Jul 10 2020 7:47 PM

Anand Mahendra Shared a Video of Swach Bharat Auto Having Sink for Handwash - Sakshi

సోషల్‌మీడియాలో ఆనంద్‌ మహేంద్ర చాలా యాక్టివ్‌గా ఉంటారు. సమాజంలో జరిగే విషయాలపై తన అభిప్రాయాలను ట్విట్టర్‌ ద్వారా ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉంటారు. అలాగే తనకు నచ్చిన వీడియోలను, ఆలోచింపజేసే కొన్ని విషయాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటు ఉంటారు.ఇప్పుడు అలాంటి ఒక వీడియోనే ఆనంద్‌ మహేంద్ర తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

చదవండి: ఆనంద్ మహీంద్ర ట్వీట్ : మద్యం డెలివరీ

ఈ వీడియో ప్రారంభంలో మీకు ఒక ఆటోరిక్షా కనిపిస్తుంది. ఆటోనే కదా అందులో ఏముంది అని అనుకోకండి. అలాగే చూస్తూ ఉంటే అది ఆటో కాదు అది మినీ వ్యానిటీ వ్యాన్‌లా అనిపిస్తుంది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఈ సమయంలో హ్యాండ్‌వాష్‌, మాస్క్‌ తప్పనిసరి. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణీకులు సురక్షితంగా ఉండేందుకు హ్యాండ్‌వాష్‌ చేసుకునేలా ఆటోలోనే సింక్‌ ఏర్పాటు చేశాడు. దాని చుట్టుపక్కల ఆహ్లాదకరంగా ఉండేలా మొక్కలు, దాంతో పాటు తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు ఆటోలో అద్భుతంగా ఏర్పాటు చేశాడు.  ఈ వీడియోను మహీంద్రా గ్రూప్  చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

చదవండి: ఆ పదం తొలగించే అవకాశం ఉంటుందా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement