laddu counter
-
తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం
తిరుపతి, సాక్షి: తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆపై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. లడ్డూ కౌంటర్లలో 47వ నెంబర్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కౌంటర్లోని కంప్యూటర్ యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే. అయితే.. ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత.. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా.. కాసేపు అక్కడున్న భక్తులు అందోళనకు గురయ్యారు. -
భవానీలతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
-
తిరుమల లడ్డూ కౌంటర్లలో కాంట్రాక్ట్ సిబ్బంది చేతివాటం
-
తిరుమలలో సిబ్బంది చేతివాటం
సాక్షి, తిరుమల: తిరుమలలో లడ్డు కౌంటర్ సిబ్బంది ఒకరు చేతివాటం ప్రదర్శించాడు. 40 వ లడ్డూ కౌంటర్లో ఉన్న ఉద్యోగి కర్ణాటకకు చెందిన భక్తులకు 104 లడ్డులు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 50 లడ్డూలు మాత్రమే ఇచ్చాడు. దీనిపై అడిగినందుకు భక్తులపై బెదిరింపులకు దిగాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న సాక్షి విలేకరి విజిలెన్స్ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. విజిలెన్స్ అధికారులు రాకను గమనించిన 40వ కౌంటర్ ఉద్యోగి పరారయ్యాడు. అనంతరం కర్ణాటకు చెందిన భక్తులకు టీటీడీ నిర్వాహకులు 104 లడ్డూలను అందజేశారు. పరారైన ఉద్యోగి కోసం విచారణ చేపడుతున్నారు. -
శ్రీవారి లడ్డూ కౌంటర్ వద్ద ప్రమాదం
తిరుమల: ఓ లారీ రివర్స్ తీస్తున్న సమయంలో లారీకి.. గోడకు మధ్య ఇరుక్కొని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరుమల శ్రీవారి లడ్డు కౌంటర్ సమీపంలో శుక్రవారం జరిగింది. టీటీడీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకటకృష్ణయ్య(46) విధులు పూర్తి చేసుకొని వెళ్తున్న సమయంలో లడ్డు కౌంటర్ వద్దకు వచ్చిన లారీ రివర్స్ తీస్తుండగా.. లారీ వెనక ఉన్న వెంకటకృష్ణయ్యను ఢీకొట్టింది. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది అంబులెన్స్ సాయంతో అతన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.