ఓ లారీ రివర్స్ తీస్తున్న సమయంలో లారీకి.. గోడకు మధ్య ఇరుక్కొని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
తిరుమల: ఓ లారీ రివర్స్ తీస్తున్న సమయంలో లారీకి.. గోడకు మధ్య ఇరుక్కొని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరుమల శ్రీవారి లడ్డు కౌంటర్ సమీపంలో శుక్రవారం జరిగింది. టీటీడీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకటకృష్ణయ్య(46) విధులు పూర్తి చేసుకొని వెళ్తున్న సమయంలో లడ్డు కౌంటర్ వద్దకు వచ్చిన లారీ రివర్స్ తీస్తుండగా.. లారీ వెనక ఉన్న వెంకటకృష్ణయ్యను ఢీకొట్టింది. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది అంబులెన్స్ సాయంతో అతన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.