Ladies hostal
-
హాస్టల్లో దారుణం.. గర్భం దాల్చిన విద్యార్థినులు!
సాక్షి, కొమురం భీం జిల్లా : అసిఫాబాద్లో ట్రైబల్ మహిళా డిగ్రీ కళాశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. ట్రైబల్ హాస్టల్ ఉంటూ చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థినులు గర్భం దాల్చడం కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెంటల్ డిగ్రీ కాలేజీ వసతి గృహానికి చెందిన పదిమంది విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం రాకపోవడంతో అనుమానం వచ్చి హాస్టల్ సిబ్బంది వారిని రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.పరీక్షలు నిర్వహించిన వైద్యులు సంచలన విషయాలు వెల్లడించారు. పదిమందిలో ముగ్గురు అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటీవ్ వచ్చిందని తెలిపారు. నెల రోజుల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించి ఒకరే గర్భం దాల్చారని వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. హాస్టల్ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్సీఓ లక్ష్మయ్య విద్యార్థినుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దాదాపు రెండు నెలలే ముందే ఈ విషయం తెలిసినా కూడా..సమాచారం రానివ్వకపోవడంతో హాస్టల్ సిబ్బందిపై, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
లేడీస్ హాస్టల్లో అగ్ని ప్రమాదం
విశాఖపట్నం : విశాఖపట్నంలో అశీలమెట్ట వద్ద లేడీస్ హాస్టల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అశీలమెట్టలోని ఓ లేడీస్ హాస్టల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే హాస్టల్లోని అమ్మాయిలు పరుగులు తీశారు. సమాచారం అందిన అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు. దీంతో ఎటువంటి నష్టం జరగలేదు. విద్యార్థుల దుస్తులు, పుస్తకాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మంటలు చెలరేగాయని తెలుస్తోంది. -
లేడిస్ హాస్టల్లోకి చొరబడ్డ దుండగులు
-
లేడీస్ హాస్టల్లో దొంగల హల్చల్
నంద్యాల: అర్థరాత్రి విద్యార్థినులు అదమరిచి నిద్రపోతున్న వేళ ముగ్గురు దొంగలు హాస్టల్లోకి చొరబడి హల్చల్ సృష్టించారు. భయంతో కేకలు వేసిన విద్యార్థినులను బూతులు తిడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు, డబ్బు, బంగారు దోచుకొని పరారయ్యారు. ఈ ఘటన టూటౌన్ పోలీసు స్టేషన్ సమీపంలోని వ ప్రభుత్వ మహిళా హాస్టల్లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసు స్టేషన్ సమీపంలోని మహిళా హాస్టల్లో పాలిటెక్నిక్, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలకు చెందిన 250మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురు ముసుగు ధరించిన వ్యక్తులు హాస్టల్ ప్రధాన గేటు తాళాలు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. వీరిని గమనించిన విద్యార్థినులు భయంతో కేకలు వేసినా చుట్టూ నిర్జల ప్రదేశం కావడంతో ఫలితం లేకపోయింది. దీంతో అగంతకులు మరింత రెచ్చిపోయి విద్యార్థినులను బూతులు తిట్టడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించారు. తర్వాత అందరినీ గదిలో నిర్బంధించి ఏడు సెల్ఫోన్లు లాక్కున్నారు. మరో విద్యార్థిని జత కమ్మలు, బ్యాగుల్లో ఉన్న రూ.2500 నగదు తీసుకెళ్లారు. విద్యార్థినల సమాచారం మేరకు పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ రామసుబ్బారెడ్డి టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు దొంగలను గుర్తించి పట్టుకునే పనిలో పడ్డారు.