విశాఖపట్నం : విశాఖపట్నంలో అశీలమెట్ట వద్ద లేడీస్ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అశీలమెట్టలోని ఓ లేడీస్ హాస్టల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే హాస్టల్‌లోని అమ్మాయిలు పరుగులు తీశారు. సమాచారం అందిన అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు. దీంతో ఎటువంటి నష్టం జరగలేదు. విద్యార్థుల దుస్తులు, పుస్తకాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మంటలు చెలరేగాయని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment