lakhs of people
-
‘మద్యం’ మరణాలు ఏటా 30 లక్షలు
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవించే ప్రతి ఇరవై మరణాల్లో ఒక దానికి మద్యమే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. మద్యం వ్యసనపరులు లివర్ సిర్రోసిస్, క్యాన్సర్ వంటి 200 రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2016 గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మద్యంతో సంబంధమున్న 30 లక్షల మరణాలు సంభవించాయి. మొత్తం మరణాల్లో ఇది 5.3 శాతం. ఇదే సమయంలో ఎయిడ్స్‌తో 1.8 శాతం, రోడ్డు ప్రమాదాల్లో 2.5 శాతం, హింస కారణంగా 0.8శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 230 కోట్ల మందికి మద్యం అలవాటు ఉంది. యూరప్‌తోపాటు ఆసియాలోని భారత్, చైనాల్లో ఆల్కహాల్ వినియోగంలో గణనీయ పెరుగుదల నమోదవుతోంది. -
అక్కడ వరదల్లో మూడు లక్షలమంది..
న్యూయార్క్: ఇటీవల సంభవించిన వరదల కారణంగా పాకిస్థాన్‌లోని లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారని ఐక్య రాజ్యసమితి ప్రకటించింది. మొత్తం 2,85,000 మంది ఈ వరదల భారిన పడి కనీసం కూడు, గుడ్డ, నీడ లేనివారుగా మారారని ఒక ప్రకటనలో పేర్కొంది. భారీ స్థాయిలో సంభవించిన వర్షాలతో పాటు వేగంగా కరుగుతున్న మంచువల్ల భారీ వరదలు సంభవించాయని, ముఖ్యంగా చిత్రాల్ అనే జిల్లా తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రకటించిన బాధితుల సంఖ్య కేవలం ఒక అంచనా మాత్రమేనని, అడుగుపెట్టలేని వాతవారణం కారణంగా పూర్తి స్థాయిలో బాధితులు ఎంతమందో లెక్కతేల్చలేకపోతున్నామని వివరించింది. సంక్షోభంలో ఉన్న ప్రజానీకానికి ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ సేవలు అందించేందుకు ఐక్యరాజ్యసమితిలో ఒక ప్రత్యేక విభాగం ఉంది. ప్రకృతి విపత్కర పరిస్థితులు తలెత్తిన ప్రాంతాలను గుర్తించి వారి స్థితిగతులను ప్రపంచానికి తెలియజేయడం ద్వారా బాధితులకు సహాయం అందించాలనే విషయాన్ని తెలియజేస్తుంది. -
వైభవంగా గరుడవాహన సేవ
-
'లక్షలమందిలో కొందరికే ప్రజాప్రతినిధులుగా ఛాన్స్'
కొన్ని లక్షల మందిలో అతి కొద్ది మందికి మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుందని, అలా ఎన్నికైన వాళ్లు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేకర్ రావు అన్నారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల సదస్సులో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో పరిస్థితులు ఏమాత్రం మెరుగ్గా లేవన్నారు. పట్టణాలు మరింతగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా పట్టణ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో దశలవారీగా 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు అందిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.