
'లక్షలమందిలో కొందరికే ప్రజాప్రతినిధులుగా ఛాన్స్'
కొన్ని లక్షల మందిలో అతి కొద్ది మందికి మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుందని, అలా ఎన్నికైన వాళ్లు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేకర్ రావు అన్నారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల సదస్సులో కేసీఆర్ మాట్లాడారు.
తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో పరిస్థితులు ఏమాత్రం మెరుగ్గా లేవన్నారు. పట్టణాలు మరింతగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా పట్టణ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో దశలవారీగా 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు అందిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.