డాక్టర్ లక్ష్మయ్య స్టడీసర్కిల్‌లో ఉద్రిక్తత
చిక్కడపల్ల్లి, న్యూస్‌లైన్: కోచింగ్ తీసుకుంటున్న తనను డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ స్టడీ సర్కిల్ డెరైక్టర్‌తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు అసభ్య పదజాలంతో వేధిస్తున్నారంటూ బాధితురాలు, ఆమె భర్త ఇనిస్టిట్యూట్ నిర్వాహకులతో ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరుపక్షాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ముసారాంబాగ్‌కు చెందిన సునీత డాక్టర్ లక్ష్మయ్య స్టడీ సర్కిల్లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నారు.
డెరైక్టర్ లక్ష్మయ్య, రవి, సుధీర్ అనే అభ్యర్థులు తనపై 4 నెలలుగా ఆసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని సునీత తన భర్త ప్రవీణ్‌కు తెలిపిం ది. దీంతో ప్రవీణ్ శుక్రవారం కొందరితో కలిసి ఇనిస్టిట్యూట్‌కు వచ్చి డెరైక్టర్ లక్ష్మయ్య భార్య, మరో డెరైక్టర్ పద్మజారాణిని నిలదీశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. సమాచారం అందుకున్న చిక్కడపల్లి ఏసీపీ టి.అమర్‌కాంత్‌రెడ్డి సిబ్బందితో కలిసి స్టడీ సర్కిల్‌కు వచ్చి వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా ప్రవీణ్, పద్మజారాణి పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టడీ సర్కిల్ డెరైక్టర్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మయ్యను పోలీసులు సంప్రదించగా ఢిల్లీలో ఉన్నానని, శనివారం నగరానికి వస్తానని తెలిపారు. ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.