laksmirajyam
-
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
భీంగల్ మండలం దేవక్కపేట్లో కుప్ప లక్ష్మీరాజం(45) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి పొలంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెట్టుకు ఉరివేసుకుని ఉండటం గ్రామస్తులు శుక్రవారం గమనించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పుల బాధ భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవలే కూతురు పెళ్లి చేయడంతో సుమారు రూ.5 లక్షల అప్పు అయ్యిందని పేర్కొన్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దుబాయిలో కరీంనగర్ వాసి మృతి
కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట వాసి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన బొక్కెనపెల్లి లక్ష్మీరాజ్యం(47) బతుకు తెరువు కోసం దుబాయి వె ళ్లాడు. నాలుగు నెలల క్రితమే ఇంటికి వచ్చి తిరిగి వెళ్లిన లక్ష్మీరాజ్యం గుండెపోటుతో మృతిచెందినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. లక్ష్మీరాజ్యానికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. -
15 టన్నుల నల్లబెల్లం స్వాధీనం
గుడుంబా తయారి కోసం ఉపయోగించే నల్లబెల్లం నిల్వలను గురువారం ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వాసవీభవన్ రోడ్డులో ఉన్న లక్ష్మీ రాజ్యం అనే వ్యాపారికి చెందిన గొడౌన్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 15 టన్నుల నల్లబెల్లం నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఈ రోజు ఉదయం నుంచే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇప్పటికే పది టన్నుల పట్టికను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుధాకర్ తెలిపారు.