Lal Thanhawla
-
ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న జాతివివక్షపై మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో తాను చాలాసార్లు జాతివివక్షను ఎదుర్కొన్నట్టు తెలిపారు. ‘జాతివివక్ష అనేది మన దేశంలో చాలా దారుణంగా ఉంది. నేనే స్వయంగా చాలాసార్లు దీనిని ఎదుర్కొన్నాను. సొంత దేశం గురించి తెలియని మూర్ఖులు కొంతమంది ఉన్నారు’ అని ఐదుసార్లు ముఖ్యమంత్రి అయిన తన్హావాలా అన్నారు. తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘ 20-25 ఏళ్ల కిందట ఓ విందులో ఓ వ్యక్తి వచ్చి ‘నువ్వు భారతీయుడిలా కనిపించడం లేదే’ అన్నాడు. నేను వెంటనే భారతీయుడు ఎలా కనిపిస్తాడో ఒక్క ముక్కలో చెప్తారా? అని అడిగాను’ అని అన్నారు. దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో ఈశాన్య భారతీయులపై జాతివివక్ష దాడులు జరగడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఒక ప్రాంతం పట్ల ఇలాంటి వివక్ష, సవతి తల్లి ప్రేమవల్ల ప్రాంతీయవాదం, వేర్పాటువాదం తలెత్తవచ్చునని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘అందువల్లే ఈశాన్య భారతంలో ప్రాంతీయవాదం చాలా అధికంగా ఉంది. వేర్పాటువాద భావన కూడా ఇక్కడ ఎక్కువే. ఎందుకంటే ఈశాన్య భారతం ఆవల మమ్మల్ని ఆమోదించడం లేదు. భారతీయులుగా చెప్పుకొనే వాళ్లు మాపై వివక్ష చూపుతున్నారు’ అని అన్నారు. -
మిజోరం కాంగ్రెస్‌కే..
ఐజ్వాల్: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్ మిజోరంలో మాత్రం తీపి విజయం సాధించింది. మూడింట రెండు వంతులకుపైగా భారీ మెజారిటీతో వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 40 స్థానాలకు ఎన్నికలు జరగడం తెలిసిందే. ఈవీఎంలో సమస్య కారణంగా ఒక స్థానం మినహా 39 స్థానాల ఫలితాలను సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ 33 స్థానాలను కైవసం చేసుకుంది. 2008 నాటి ఎన్నికల్లో ఆ పార్టీకి 32 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో మూడు సీట్లు సాధించిన ప్రధాన విపక్షం మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) ఈసారి ఐదు సీట్లు కైవసం చేసుకుంది. మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్(ఎంపీసీ) ఒక చోట గెలిచింది. 17 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ రిక్తహస్తాలతో మిగిలింది. లాంగ్ట్లాయ్ తూర్పు స్థానంలో ఓ పోలింగ్ బూత్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎంలో సాంకేతిక సమస్య వల్ల కౌంటింగ్ పూర్తి కాలేదు. ఈ బూత్‌లో ఈ నెల 11న రీపోలింగ్ జరిపి, 12న కౌంటింగ్ చేపడతారు. క్రైస్తవుల ప్రాబల్యమున్న మిజోరంలో ‘హస్తం’ తాజా విజయంతో సీఎం లాల్ తాన్హవ్లా ఐదో పర్యాయం మళ్లీ గద్దెనెక్కనున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన తాను పోటీ చేసిన రెండు చోట్లా(సెర్చిప్, రంగ్టర్జో) గెలిచారు. తాన్హవ్లా అసెంబ్లీకి ఎన్నికవడం ఇది తొమ్మిదోసారి. కాంగ్రెస్ మల్లయోధుడు..!: ఈశాన్య పర్వత రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్‌ను మళ్లీ గద్దెనెక్కించిన ముఖ్యమంత్రి లాల్ తాన్హవ్లా (71) తాను ఆ పార్టీ ‘పోస్టర్ బాయ్’నని మరోసారి నిరూపించుకున్నారు. గత 30 ఏళ్లలో నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన ఆయన ఐదోసారి మళ్లీ ఆ పీఠాన్ని అధిష్టించనున్నారు. 1987లో మిజోరంకు రాష్ట్ర హోదా లభించినప్పటినుంచి ‘హస్తం’ గెలుపుల్లో ఆయనదే కీలక పాత్ర. ఆయన 1973 నుంచి రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా పనిచేస్తున్నారంటే రాష్ట్ర పార్టీలో ఆయన స్థానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. చిన్న ప్రభుత్వ ఉద్యోగి స్థాయి నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇంత స్థాయికి ఎదిగారు. -
ఈసారి తనదే గెలుపని ధీమా