'నమ్ముకున్నోళ్లను అన్యాయం చేయొద్దు'
హైదరాబాద్ : హైదరాబాద్ గాంధీభవన్ వద్ద శనివారం లంబాడీ హక్కుల పోరాట సమితి నిరసనకు దిగింది. లంబాడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న దేవరకొండ, మహబూబాబాద్ అసెంబ్లీ స్థానాలను పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించవద్దని లంబాడీ హక్కుల పోరాట సమితి నేత సంజీవ్ నాయక్ డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి లంబాడీలు కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్నారని .....వారికి అన్యాయం చేయవద్దని ఆయన కోరారు.
దేవరకొండ, మహబూబాబాద్ స్థానాలను సీపీఐకి కేటాయిస్తే తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పని చేస్తామని సంజీవ్ నాయక్ హెచ్చరించారు. కాగా తెలంగాణలో పొత్తులపై కాంగ్రెస్, సీపీఐ పార్టీలు సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సీట్ల కేటాయింపుపై ఇంకా ఓ స్పష్టతకు రాలేదు. తమకు ఒక ఎంపీ, 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది.