పారదర్శకంగా సేవలందించాలి
► భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్
► జిల్లా రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ...
ఎదులాపురం : రెవెన్యూ అధికారులు ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని భూ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి రేమండ్ పీటర్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా జీవో నం.58, 59లకు అనుగుణంగా భూ క్రమబద్ధీకరణ చేసిన వాటిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐదు డివిజన్లలో 2635 మంది క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారని, 2255 మంది దరఖాస్తులను పరిశీలించి 914 మందికి రెగ్యులర్ చేశామని తెలిపారు. 297 అభ్యర్థుల ద్వారా రూ.18 ,91,60,000లు ప్రభుత్వానికి జమ చేయడం జరిగిందని, వీరికి పట్టాలు సిద్ధం చేశామని తెలిపారు.
జిల్లాలో మీ సేవ కేంద్రాల పని తీరుపై ప్రధాన కార్యద ర్శి వివరణ కోరగా జిల్లాలో కొంత మంది మీ సేవ కేంద్రాల నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని, విచారణ జరిపి సంబంధిత మీ సేవ యజమానులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి నుంచి తహసీల్దార్ కార్యాలయాల ద్వారా అన్ని మీ సేవా కేంద్రాల్లో ఒక ప్రతినిధిని ఏర్పాటు చేసి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ సుందర్‌అబ్నార్, డీఆర్వో సంజీవ్‌రెడ్డి, ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏవో అరవింద్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.