ప్రళయంలో చిరు సాయం
హైదరాబాద్: అప్పుడు లాతూరు..ఆ తర్వాత జపాన్..తాజాగా నేపాల్ ఇలా అందరికీ సవాల్ విసిరింది భూ ప్రళయం. ఈ విపత్తుల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవడమే ఆధునిక ప్రపంచానికి ఛాలెంజ్. ఆర్తనాదాలు చేస్తున్న సాటి మానవులను సజీవులుగా నిలుపుకునేందుకు విలయానికే ఎదురొడ్డాలి. సరిగ్గా ఆ ఆలోచన తోనే అలాంటి వేళ స్పందించి ఆదుకునేందుకే ఆ ఔత్సాహిక ఇంజనీర్లు నడుం కట్టారు. అద్భుత యంత్రాన్ని రూపొందించి భూ ప్రళయమా నీ చిరునామా ఎక్కడా అంటూ బాధితులను రక్షించేందుకు వీలైన ‘ల్యాండ్ ఎస్కలేటర్’ను రూపొందించారు. ఈ ఆవిష్కరణ చేసి ఔరా అనిపిస్తోంది కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల (ఐఏఆర్ఇ) మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు .
మనిషి సాయం లేకుండా మోషన్ టెక్నాలజీతో పని చేసే ఈ ల్యాండ్ ఎస్కలేటర్‌కు సెన్సా ర్లు అమర్చారు. భూకంపాలు సంభవించి నప్పుడు మనం కాలుపెట్టలేని ప్రాంతాలకూ ఇది అవలీలగా వెళ్లి సహాయక చర్యలను సైతం చేపడుతుంది. దీన్ని శనివారం కళాశాల ఆవరణలో ప్రదర్శించగా జెఎన్‌టియుూహెచ్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ గుప్త ముఖ్యఅతిథిగా హాజరై పరిశీలించారు. ‘ల్యాండ్ ఎస్కలేటర్’కు పేటెంట్ హక్కుల కోసం ధరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రొఫెసర్ హరినాధ్ నేతృత్వంలో 15 మంది మెకానిల్ విద్యార్థులు దీన్ని రూపొందించారు. రూ. 3 లక్షలు వ్యయం కాగా కళాశాల యాజమాన్యం సమకూర్చిం ది. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.