తోటపల్లి రిజర్వాయర్ భూములు రైతులకే ఇవ్వాలి
డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం
కరీంనగర్: తోటపల్లి రిజర్వాయర్ కోసం రైతులవద్ద సేకరించిన భూములను తిరిగి వారికే ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం డిమాండ్చేశారు. కరీంనగర్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కుర్చీ వేసుకుని రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తిచేస్తానని ఎన్నికల ముందుచెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే తోటపల్లి ప్రాజెక్టును రద్దుచేసి రైతుల నోట్లో మట్టికొట్టారని ఆరోపించారు. రిజర్వాయర్కోసం సేకరించిన 1600ఎకరాల భూములను రైతులకే బేషరతుగా అప్పగించాలని డిమాండ్చేశారు. తోటపల్లి రిజర్వాయర్ రద్దు వెనుక భూములు హస్తగతం చేసుకోవాలనే కుట్ర బడాబాబులకు ఉందని, దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వత్తాసు పలకడం సిగ్గుచేటని అన్నారు. రైతులకు చెందిన భూములను అల్టిమేషన్ కంపెనీ(అమెరికాకు)లకు ధారదత్తం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. తోటపల్లి రిజర్వాయర్ భూములను ఇతర పనులకు వాడుకోవాలని చూస్తే ఊరుకోమని, రైతుల పక్షాన పోరాడతామని హెచ్చరించారు.