land victims
-
ప్రజావాణిలో ఆందోళనల పెట్రోల్!
గద్వాల రూరల్/ జనగామ/ జనగామరూరల్/ దురాజ్‌పల్లి (సూర్యాపేట)/ కరీంనగర్ అర్బన్: అవి జిల్లా పరిపాలనకు కీలకమైన కలెక్టరేట్లు.. జనం సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది.. ఇంతలో కలకలం.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. మరోచోట ఇంకో రైతు కలెక్టరేట్ భవనం ఎక్కి దూకేందుకు సిద్ధమయ్యాడు.. ఇంకోచోట ఓ యువతి, మరో యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. తమ చావుతోనైనా అధికారులు కళ్లుతెరుస్తారేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజున 3 జిల్లా కలెక్టరేట్లలో జరిగిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. భూమిని వేరేవారి పేరిట మార్చారంటూ ‘‘మా పెద్దల నుంచి వచ్చిన భూమిని గ్రామానికి చెందిన కొందరు కాజేశారు. దీనిపై కలెక్టర్‌కు ఎనిమిది సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. నేను చనిపోయాక అయినా కళ్లు తెరవండి..’’అంటూ జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట లోకేశ్ అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకుని అగ్గిపెట్టె లాక్కున్నారు.నీళ్లు చల్లి, దుస్తులు మార్చారు. జిల్లాలోని మానవపాడు మండలం కలుకుంట్లకు చెందిన లోకేశ్‌కు వారసత్వంగా ఐదు ఎకరాల భూమి వచ్చింది. కానీ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, కొందరు అధికారులు కుమ్మక్కై ఆ వ్యక్తి పేరిట పట్టా చేశారని లోకేశ్ పేర్కొన్నారు. తహసీల్దార్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ సమయంలో కలెక్టరేట్లోనే ఉన్న మానవపాడు తహసీల్దార్ యాదగిరి వచ్చి బాధిత రైతుతో మాట్లాడారు. లోకేశ్ భూమి పొరపాటున మరొకరి పేరు మీద మారిందని.. ధరణిలో మార్చే ఆప్షన్ రాగానే భూమిని లోకేశ్ పేరిట నమోదు చేసి పాస్‌బుక్ ఇస్తామని చెప్పారు. ఎనిమిది సార్లు ఫిర్యాదు చేసినా.. తన తాత పేరిట ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తుల పేరిట అక్రమంగా పట్టా చేశారని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. నిమ్మల నర్సింగరావు అనే రైతు జనగామ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం చేశారు. జనగామ మండలం పసరమడ్లకు చెందిన నర్సింగరావు తాత నిమ్మల మైసయ్య పేరిట 8 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. కొన్నేళ్ల కింద నర్సింగరావు బతుకుదెరువు కోసం ములుగు జిల్లా ఎల్బాకకు వలస వెళ్లారు. దీన్ని అలుసుగా తీసుకుని 2017లో అప్పటి తహసీల్దార్ జె.రమేశ్, వీఆర్వో క్రాంతికుమార్, అదే గ్రామానికి చెందిన ఇద్దరు కుమ్మక్కై తమ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని నర్సింగరావు ఆరోపించారు. అప్పటి నుంచీ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదన్నారు. దీనిపై సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే.. అది తమ పరిధిలో లేదని, కోర్టుకు వెళ్లాలని సూచించారు. ఆందోళన చెందిన నర్సింగరావు.. కలెక్టరేట్‌పైకి ఎక్కి ఒంటిపై డీజిల్ పోసుకున్నారు. ఆర్డీవో మధుమోహన్, ఇతర అధికారులు నచ్చజెప్పడంతో సుమారు రెండు గంటల తర్వాత కిందికి దిగాడు. నర్సింగరావు దగ్గర ఉన్న పత్రాలను పరిశీలించిన అధికారులు.. దీనిపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అయితే భూమి సమస్యపై నర్సింగరావు 2021 డిసెంబర్లో కూడా ఇదే కలెక్టరేట్‌పై ఆత్మహత్యాయత్నం చేశాడని.. అయినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు చెబుతున్నారు. కరీంనగర్ ప్రజావాణికి గట్టి బందోబస్తు ప్రజావాణి సందర్భంగా రైతులు, ప్రజలు పురుగుల మందు, పెట్రోల్ వంటి వాటితో ఆందోళనలకు దిగుతుండటంతో.. కరీంనగర్ జిల్లాలో ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి సందర్భంగా ప్రధాన ద్వారంతోపాటు ఆడిటోరియం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అర్జీదారులను తనిఖీ చేశాకే లోపలికి పంపారు. సూర్యాపేట కలెక్టరేట్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం అధికారులు తమ భూసమస్యలు పరిష్కరించడం లేదని, పైగా తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఇద్దరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మలచెర్వుకు చెందిన మీసాల అన్నపూర్ణ, ఆమె కుమార్తె స్వాతి కలిసి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. తన భర్త జానయ్య పేరిట ఉన్న 5 గుంటల భూమిని బెజ్జం వెంకన్న అనే వ్యక్తి ఆక్రమించారని.. తన పేరిట ఉన్న 34 గుంటల భూమిని, కుమార్తె స్వాతి పేరిట ఉన్న 25 గుంటల భూమిని సైదులు అనే వ్యక్తి కబ్జా చేశారని అన్నపూర్ణ ఆరోపించారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, పైగా తమపైనే అక్రమ కేసులు బనాయించారని వాపోయారు. ఇక ఇదే గ్రామానికి చెందిన పున్న వీరమ్మ తన కుమారుడు పున్న సైదులుతో కలిసి ప్రజావాణికి వచ్చారు. తమకు 2 ఎకరాల 20 గుంటల భూమి ఉందని.. అందులో సాగు చేయకుండా బెజ్జం పిచ్చయ్య, బెజ్జం దాసు, శెట్టిపల్లి కృష్ణ, శెట్టిపల్లి రాముడు అనే వ్యక్తులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. అయితే ఈ రెండు ఫిర్యాదుల విషయంలో పోలీసులను ఆశ్రయించాలని అదనపు కలెక్టర్ సూచించారు. దీనితో ఆవేదన చెందిన మీసాల స్వాతి తొలుత ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. సిబ్బంది ఆమెను అడ్డుకోగా.. పక్కనే ఉన్న పున్న సైదులు ఆ పెట్రోల్ బాటిల్‌ను తీసుకుని ఒంటిపై పోసుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారిని కోదాడ డీఎస్పీ వద్దకు పంపారు. -
భూ బాధితులకు భరోసా
► పేదలకు అండగా తుదికంటా పోరాడతాం ► ముదపాక రైతులకు అఖిలపక్షం హామీ ► కబ్జా అయిన భూముల సందర్శన ► అడ్డుకోవాలని ప్రయత్నించిన అధికార పార్టీ నేతలు ► రైతులను భయపెట్టినా ఫలితం శూన్యం ‘భూ బాధితుల పక్షానే ఉంటాం.. తుదికంటా వారికి అండగా నిలుస్తాం. అధికార పార్టీ కబ్జాల కోరల్లో చిక్కుకున్న భూములను రక్షించి.. తిరిగి రైతులపరం చేసేందుకు అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తాం’.. అని అఖిలపక్ష నేతలు భరోసా ఇచ్చారు. అధికార పార్టీ నేతల భూదందాలపై చేపట్టిన ఐక్య పోరాటంలో భాగంగా సోమవారం వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం పెందుర్తి మండలం ముదపాక సందర్శించింది. టీడీపీ నేతలు ఆక్రమించుకున్న 400కు పైగా ఎకరాల అసైన్డ్ భూములను పరిశీలించి.. బాధిత రైతులతో మాట్లాడింది.. ఆందోళన వద్దని.. అండగా ఉంటామని హామీ ఇచ్చింది. సాక్షి, విశాఖపట్నం : ప్రాణాలు పోయినా పోరాటం ఆపేది లేదని, కబ్జాల బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అఖిల పక్ష నేతలు స్పష్టం చేశారు. పెందుర్తి మండలం ముదపాకలో సోమవారం అఖిలపక్ష నేతలు పర్యటించి టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను పరిశీలించారు. అధికార పార్టీ భూదోపిడీపై వారంతా మండిపడ్డారు. జిల్లాలో రూ.2 లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణం జరిగిందని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లే కారకులని ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జీవో 304ను రద్దు చేసేందుకు న్యాయస్థానంలో పోరాటం చేసే అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్‌ల బినామీ అయిన రామరాజు అక్రమాలకు, విశాఖలో భూముల కుంభకోణాలకు వ్యతిరేకంగా అఖిలపక్షంతో కలిసి మహాధర్నా చేస్తామని ప్రకటించారు. భూ పోరాటం వీడితే ఏవో ప్రయోజనాలు కల్పిస్తామని వెంకటరాజు అనే వ్యక్తి నుంచి తనకు ఓ సందేశం వచ్చిందని వెల్లడించారు. ‘దళితులు, పేదల నుంచి అన్యాయంగా లాక్కున్న భూములను వారికి తిరిగి ఇచ్చేస్తే చాలని, అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భూ కబ్జాదారులందరికీ జైలు తప్పదని, చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు, పరుచూరి భాస్కరరావులు వెళ్లాల్సింది జైలుకని’ తాను వారికి బదులిచ్చానని చెప్పారు. టీడీపీ నేతల అడ్డంకులు : అఖిలపక్ష బృందం క్షేత్ర స్ధాయి పరిశీలన గురించి తెలుసుకున్న టీడీపీ నేతలు రైతులను బృందం వద్దకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ముందు రోజే పోలీసుల ద్వారా అందరినీ బెరించారు. భూముల పరిశీలనకు వచ్చిన బృందాన్ని ఘెరావ్ చేయాలని స్ధానిక టీడీపీ ఎంపీటీసీ రాంబాబు, సర్పంచ్ మల్లీశ్వరమ్మ భర్త రమణలు ప్రయత్నించారు. వారిని పోలీసులు, వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. మూడు కిలోమీటర్ల దూరం ర్యాలీగా వెళ్లిన నేతలు అక్కడ భూ కబ్జాదారులు అక్రమంగా నిర్మించిన రోడ్డును పరిశీలించారు. రైతులు తాము పండిస్తున్న జీడిమామిడి తోటలను నేతలకు చూపించారు. తరతరాలుగా తాము ఈ పంటపైనే ఆధారపడి బతుకుతున్నామని, ఇప్పుడు భూములను అక్రమంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులతోపాటు వైఎస్సార్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, అదీప్‌రాజు, తిప్పల నాగిరెడ్డి, కొయ్య ప్రసాదరెడ్డి, కోలా గురువులు, అక్కరమాని విజయనిర్మల, జాన్‌వెస్లీ, రవిరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, కొండా రాజీవ్, పసుపులేటి ఉషాకిరణ్, శ్రీదేవివర్మ, జిల్లా అధికార ప్రతినిధి మూర్తి యాదవ్, పీలా వెంకటలక్ష్మి, సీపీఎం నేత గంగారామ్, తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు అండగా...
-
యాదాద్రి' పైలాన్ వద్ద ఉద్రిక్తత
నల్గొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించి సేకరించిన రైతుల భూములకు ఎంత ధర నిర్ధారించారో స్పష్టంచేయాలని బాధితులు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం గ్రామాలకు చెందిన రైతులు.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నాయకులు కలిసి బుధవారం థర్మల్ విద్యుత్ ప్లాంట్ కు చేరుకొని పైలాన్ నిర్మాణం కోసం జరుగుతున్న ఏర్పాట్లను ధ్వంసం చేశారు. పైలాన్ కోసం తీసిన గుంటలను కప్పేయడంతో పాటు.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం తీసుకున్న భూములకు నష్టపరిహారం ఎంత ఇస్తారో స్పష్టం చేయాలని.. విద్యుత్ కేంద్రంలో స్థానికులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.