laptop theif
-
దొంగతనంలో కొత్త టెక్నిక్.. ధూమ్ సినిమాకి ఏ మాత్రం తక్కువ కాదు
చెన్నై: ఇటీవల చెన్నైలో జరిగిన ల్యాప్‌టాప్ దొంగతనాలు చూస్తుంటే బాలీవుడ్ ధూమ్ చిత్రానికి ఏ మాత్రం తక్కువ కాదనిపిస్తుంది. ఎందుకంటే దోపిడీకి దొంగలు ఉపయోగించే వివిధ పద్ధతులను మనం చూసుంటాం, కానీ ఇది అంతకు మించి అనేలా ఉంది. పక్కాగా ప్లాన్ చేస్తూ ఓ దోపిడీ గ్యాంగ్ కార్ల నుంచి ల్యాప్‌టాప్ దొంగతనం చేయడానికి కేవలం రబ్బరు బ్యాండ్, మెటల్ బాల్లను ఉపయోగించి సింపుల్‌గా తస్కరిస్తున్నారు. ఎట్టకేలకు పోలీసులు వాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు. అసలు వారు దానిని ఎలా చేసారంటే.... మొదటగా దొంగతనానికి టార్గెట్‌గా ఒక కారు ఫిక్స్ చేసుకుంటారు. ఆ తర్వాత, చుట్టు పక్కల ఎవరూ లేకుండా జాగ్రత్త పడతారు. చివరగా రబ్బర్ బ్యాండ్, మెటల్ బాల్ని ఉపయోగించి కారు విండోను పగలగొట్టేసి అందులోని విలువైన వస్తువులను స్వాహా చేస్తారు. ఈ దోపిడీ ముఠా అనేక సందర్భాల్లో ఈ విధంగానే ఫాలో అవుతూ వాహనాల అద్దాలను పగలగొట్టి, చెన్నై నగరంలో పార్క్ చేసిన కార్ల నుంచి కనీసం ఎనిమిది ల్యాప్‌టాప్‌లు, రూ .1.2 లక్షలు దొంగిలించారు. కాగా బెంగుళూరులోని ఒక రహస్య ప్రదేశంలో ఉండగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో, ఓ నిందితుడు వాళ్లు ఈ ప్లాన్‌ని పూసగుచ్చినట్లు వివరించాడు. దీంతో ఈ బండారం బయటపడింది. దీన్నంతటిని పోలీసులు వీడియో చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేశారు. చదవండి: Marital Affair: వివాహేతర సంబంధం.. ఎంత చెప్పినా వినలేదు.. చివరికి -
ప్రేయసికి అవమానం: ప్రతీకారం తీర్చుకున్నాడు
రాజ్‌కోట్: ఐదేళ్ల క్రితం తన ప్రేయసికి జరిగిన అవమానానికి విభిన్న రీతిలో ప్రతీకారం తీర్చుకున్నాడు ఓ యువకుడు. తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల తమిళసెల్వన్ కన్నన్.. 2015లో తన ప్రేయసిని అసభ్యకరంగా చిత్రీకరించి,సైబర్ వేధింపులకు గురి చేసిన ఆమె సహా వైద్య విద్యార్ధులందరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిందితుడు తన ప్రతీకారం తీర్చుకునేందుకు విభిన్న రీతిని ఎంచుకొని, దేశవ్యాప్తంగా ఉన్న వైద్యవిద్యార్ధుల ల్యాప్‌టాప్‌లను టార్గెట్ చేశాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్ పోలీసులు ఓ ల్యాప్‌టాప్ దొంగను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీకారేచ్ఛలో భాగంగా నిందితుడు ఇప్పటివరకు 500 మంది మెడికోల ల్యాప్‌టాప్‌లు దొంగిలించానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. చోరీలకు పాల్పడేందుకు నిందితుడు ఇంటర్నెట్లో మెడికల్ కాలేజీల సమాచారం సేకరించి, ఆ తరువాత రెక్కీ నిర్వహించి మరీ చోరీలకు పాల్పడేవాడని పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. తాను చోరి చేసిన ల్యాప్‌టాప్‌లు ఎక్కువ శాతం దక్షిణ భారత దేశంలోని మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్ధులవిగా పేర్కొన్నాడు. నిందితుడు చివరిగా గతేడాది డిసెంబర్లో జామ్ నగర్‌లోని ఎంపి షా మెడికల్ కాలేజీ బాలికల హాస్టల్ నుంచి ఐదు ల్యాప్‌టాప్‌లు దొంగిలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. -
విద్యార్థుల గదుల్లో చొరబడి...!
నాగోలు: ల్యాప్‌టాప్‌ల చోరీకి పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 6.5 లక్షల విలువైన 43 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ చేశారు. శుక్రవారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం... జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ మండలం, చెల్‌పురం గ్రామానికి చెందిన కె. రవికిరణ్ ఆలియస్ నల్వాలా రవికిరణ్ (34) ఎలక్ట్రీషియన్. ఇతను గతంలో సూర్యాపేట జిల్లా సుబేదార్ పోలీస్ స్టేషన్, హనుమకొండ, కోదాడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు ఇళ్లల్లో దొంగతనాలు చేయగా పోలీస్‌లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత తుర్కయాంజల్, సూరజ్‌నగర్ కాలనీలో అద్దెకు ఉంటూ ల్యాప్‌టాప్‌లు రిపేర్ చేస్తానంటూ కాలనీలో అందరినీ నమ్మబలికాడు. ఉదయం కాలనీలో తిరుగుతూ విద్యార్థులు ఉండే గదులను ఎంపిక చేసుకొనేవాడు. వారు కాలేజీలకు వెళ్లిన తర్వాత గదుల్లో చొరబడి ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు ఎత్తుకెళ్లేవాడు. దొంగతనం చేసిన ల్యాప్‌టాప్‌లను సికింద్రాబాద్, వరంగల్, ఇతర ప్రాంతంలో అమ్మేవాడు. ఇతను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, పహాడీషరీఫ్, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ల్యాప్‌టాప్‌లు చోరీలకు పాల్పడ్డాడు. ల్యాప్‌టాప్‌ల చోరీపై నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీస్‌లు రవి కిరణ్‌పై ప్రత్యేక నిఘా పెట్టి శుక్రవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ. 6.5 లక్షల విలువైన 43 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతనిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపాడు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ ఎస్. జయరామ్, మీర్‌పేట సీఐ యాదయ్య, డీఐ సత్యనారాయణ, వనస్థలిపురం డీఐ జగనాథ్, ఎస్ఐలు నర్సింహతో సిబ్బంది పాల్గొన్నారు. -
ల్యాప్‌టాప్‌లు మాయం కేసులో అజేష్ చౌదరి అరెస్ట్
సాక్షి, గుంటూరు: సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లు మాయమైన కేసులో ఏ-2 నిందితుడు అజేష్ చౌదరిని సత్తెనపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్‌యిన నిందితుడు స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్‌గా పనిచేశారు. ఈ కేసులో ఏ-1 నిందితుడైన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో 30 ల్యాప్‌టాప్‌లు మాయం అవ్వడంతో ఆగష్టు 23వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ అధికారి బాజీబాబు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు విషయమై బయటకు రావడంతో డీఆర్డీఏ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తి ల్యాప్‌టాప్‌లను వదిలివెళ్లారు. -
ల్యాప్‌టాప్‌లు మాయం కేసులో అజయ్ చౌదరి అరెస్ట్
-
చోరీ డాట్ కామ్ @ల్యాప్‌టాప్
సాక్షి బెంగళూరు: దొంగలు ట్రెండ్ మార్చారు. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకున్నారు. చోరీ వస్తువులను బహిరంగంగా విక్రయించకుండా ఆన్లైన్ వేదికగా విక్రయాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా డిమాండ్ ఉన్న ల్యాప్‌టాప్‌లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడి తర్వాత వెబ్సైట్లలో ఉంచి కనిష్టంగా రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు విక్రయిస్తున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేసి చోరీలు ప్రైవేటు కంపెనీ ఉద్యోగి నిలిన్ ఈ నెల 20న రాత్రి తన కారులో వచ్చి హెచ్ఎస్ఎర్ లేఔట్‌లోని ఒక రెస్టారెంట్ ముందు ఆపి ఆ హోటల్లోకి వెళ్లగా దుండగులు అద్దాలు ధ్వంసం చేసి అందులోని ఆపిల్ మ్యాక్‌బుక్, ల్యాప్‌టాప్ చోరీచేశారు. ఇదే పోలీసు స్టేషన్ పరిధిలోని మరో రెస్టారెంట్లో రజత్భట్ అనే వ్యక్తి భోజనం చేసి వచ్చి చూసే సరికి కారు అద్దాలు పగులకొట్టి ల్యాప్‌టాప్, పర్సు, డెబిట్ కార్డులను చోరీ చేశారు. ఇలాంటి ఘటనలపై నెలకు 50కేసుల వరకు నమోదవుతున్నాయి. ఆన్లైన్ మార్కెట్లో లభ్యం... దొంగలు తాము చోరీ చేసిన ల్యాప్‌టాప్‌లను మొదట కేవలం ఎస్పీ రోడ్డు, నేషనల్ మార్కెట్, హాంకాంగ్ బజార్ తరహాలో అమ్మేవారు.అయితే పోలీసుల భయంతో వాటిని ఆన్‌లైన్‌ద్వారా విక్రయిస్తున్నారు. కేవలం దొంగలు మాత్రమే ఈ పని చేయడం లేదని, కాలేజీ విద్యార్థులు కూడా డబ్బు కోసం ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. గుర్తించడం చాలా కష్టం.. రోజూ ఆన్లైన్లో వేలాది సెకెండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్‌లు విక్రయానికి వస్తున్నాయి. వీటిలో దొంగతనానికి గురైన వాటిని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. ఆన్లైన్లో లభించే వాటిలో దాదాపు 75 శాతం దొంగిలించనవేనని పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా అయితే ఆయా చోర్ బజార్లలో లభించేవాటినైతే స్వాధీనం చేసుకుని దొంగను అరెస్టు చేయవచ్చు. కానీ ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన వారిని కనుగొనడం, ఆ వస్తువులను స్వాధీనం చేసుకోవడం చాలా కష్టమైన పని అని పోలీసులు చెబుతున్నారు. జీపీఎస్ ట్రాకర్ ఉంటే మేలు.. ల్యాప్‌టాప్‌లకు జీపీఎస్ ట్రాకర్లను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. స్టిక్కర్ల రూపంలో జీపీఎస్ ట్రాకర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని ల్యాప్‌టాప్‌కు అంటించుకోవాలి. ల్యాప్‌టాప్‌ను చోరీ చేసిన దుండగులు నెట్వర్క్ కార్డు మార్చుతుంటారు. ఇందుకు ఇంటర్నెట్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ల్యాప్‌టాప్‌కు అంటించిన జీపీఎస్ ట్రాకర్ పని చేయడం మొదలై దొంగను ఇట్టే పట్టేస్తోంది. -
జల్సాల కోసం.. ల్యాప్‌టాప్‌లపై కన్నేశాడు
హైదరాబాద్: జల్సాలకు అలవాటుపడిన ఓ యువకుడు అక్రమమార్గం పట్టాడు. సులభంగా పనికానిచ్చే వీలుంటుందని ల్యాప్‌టాప్‌లపై కన్నేశాడు. చిన్నాచితక దొంగతనాలతోపాటు ఎక్కడా ల్యాప్‌టాప్ కనిపించినా నొక్కేయడం పనిగా పెట్టుకున్నాడు. ఈ నేరాలపై ఓసారి జైలుకు వెళ్లివచ్చినా అతని బుద్ధి మారలేదు. మరోసారి దొంగతనానికి పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అతన్ని గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా పాలకూర్తి మండలం గూడూరుకు చెందిన కట్కూరి పురుషోత్తంరెడ్డి గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 2014 సెప్టెంబర్‌లో అబిడ్స్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా 2015 మార్చిలో విడుదలయ్యాడు. బయటకొచ్చినా అతని ధోరణి మారలేదు. తిరిగి దొంగతనాలే వృత్తికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో చోరీలకు పాల్పడుతూ మళ్లీ పోలీసులకు దొరికిపోయాడు. అతని వద్ద నుంచి 15 ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.