వేర్వేరు కేసుల్లో ఇద్దరి అరెస్టు
పంజగుట్ట: రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పంజగుట్ట పోలీసులు ఒకరి నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు, మరో నిందితుని నుంచి రూ.5.85 లక్షల నగదు స్వాధీనం చేసుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల పక్రారం ఆసీఫ్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్ (38) అసిస్టెంట్ కుక్‌గా పనిచేస్తుండేవాడు ఇతను చిల్లర దొంగతనాలు చేస్తూ పలుమార్లు పోలీసులకు చిక్కాడు. ఎరమ్రంజిల్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పద్మావతికి వైజాగ్‌కు బదిలీ కావడంతో ఇంటికి తాళం వేసి వైజాగ్ వెళ్లింది. ఈ నెల 12న ఇంటికి వచ్చిన ఆమెకు ఇంట్లోని 15 తులాల బంగారం, 40 వేల నగదు, ఒక టీవీ, సిలిండర్ కనిపించకపోవడంతో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో ఇస్మాయిల్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతడి నుంచి 7 తులాల బంగారం స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇంటి దొంగ అరెస్టు
పనిచేస్తున్న ఇంట్లోనే దొంగతనం చేసిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని రూ. 5.85 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అశోక్ జగద్గిరిగుట్టలో నివాసం ఉంటూ బంజారాహిల్స్‌కు చెందిన ఉత్తమ్ అనే వ్యాపారి వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు. గత శనివారం ఉత్తమ్ తన ఇంట్లోని బీరువాలో రూ. 6 లక్షల నగదు ఉంచడాన్ని గమనించిన అశోక్ వాటిని కాజేసి మహబూబ్‌నగర్ వెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. తన సోదరుడికి కాలు విరిగినందున, ఆసుపత్రిలో పాత నోట్లు తీసుకుంటున్నట్లు తెలిసి ఆపరేష¯ŒS చేయించేందుకు డబ్బులు కాజేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని రిమాండ్‌కు తరలించారు.