ఐఫోన్-7 ఫొటోలు లీక్.. కొత్త ఫీచర్స్‌తో హల్చల్
న్యూయార్క్: యాపిల్ కంపెనీ తీసుకురానున్న ప్రతిష్టాత్మక ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌కు సంబంధించి మరిన్ని తాజా ఫొటోలు లీకయ్యాయి. గత మోడళ్లకు భిన్నంగా ఈ రెండింటిలోనూ లార్జర్ కెమెరాలు ఉంటాయని తాజా ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తున్న ఈ ఫొటోలను గురించి 9టు5.కామ్ ఓ కథనాన్ని ప్రచురించింది. తాజా మోడళ్లలో ఎంటెన్నా లైన్స్ ను రీడిజైన్ చేసినట్టు వెల్లడించింది. 5.5 అంగుళాల తెరతో వస్తున్న ఐఫోన్ 7 ప్లస్‌లో డ్యుయెల్ కెమెరా కాంపొనెంట్ ఉంటుందని గతంలో కథనాలు రాగా.. తాజాగా లీకైన ఫొటోల్లో ఈ రెండు ఇన్నర్ కెమెరాల మధ్య సెంటిమీటర్ గ్యాప్ ఉంటుందని వెల్లడవుతోంది. అదేవిధంగా 4.7 అంగుళాల తెరతో రానున్న ఐఫోన్ 7లోనూ కెమెరా అప్‌గ్రేడ్ చేసినట్టు 9టు5.కామ్ వెల్లడించింది.