Larji Hydro Power Dam
-
గల్లంతైన విద్యార్థుల ఫేస్బుక్ కామెంట్స్
కొత్త ప్రదేశంలో ఎంజాయ్ చేస్తున్నా: రిథిమా రిథిమా చివరిసారిగా తన ఫేస్బుక్లో ప్రొఫైల్ చిత్రాన్ని మార్చింది. తర్వాత మార్లిన్ మన్రో చెప్పిన స్ఫూర్తినింపే వాక్యాన్ని మిత్రులకు పోస్ట్ చేసింది. ‘మొదటిసారిగా కొత్త ప్రదేశానికి రావడంతో నేను చాలా అభద్రతా భావంతో ఉన్నా. కానీ ఇక్కడి అందమైన ప్రదేశాలు, గలగల పారే సెలయేర్లు నా బెరుకును, కంగారును దూరం చేశాయి. కొత్తప్రదేశానికి వచ్చిన తరుణంలో కాసింత బెరుకు, కొంత ఉద్విగ్నం, మరికొంత ఆనందంతో ఈ క్షణాలను చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఈ పరిస్థితి నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. కష్టాలను ఎదురీదుతాం: దేవ ఆశిష్ బోస్ ‘గులాబీ అరగంట సేపు పరిమళిస్తుంది. కానీ, మన స్నేహం జీవితాంతం నిత్యనూతనంగా, సజీవంగా ఉంటుంది. జీవితంలో కష్టాలెన్ని ఎదురైనా కలిసికట్టుగా ఎదుర్కొందాం. మన ఫ్రెండ్షిప్ ఎల్లకాలం నిలిచి ఉంటుంది. టూర్లో నేను అనుభవిస్తున్న ప్రతి క్షణాన్ని జీవితంలో మరిచిపోలేను.’ అని పోస్ట్ చేశాడు బోస్. నేను లెజెండ్...: తరుణ్ ఫేస్బుక్లో లెజెండ్ అనే ట్యాగ్‌లైన్ పెట్టుకున్నాడు తరుణ్. ప్రతి పనిని నైపుణ్యం, సమర్థత, సరైన విజ్ఞానంతో చేయడమే తనకు ఇష్టమని చెప్పుకున్నాడు. కష్టాలు ఎదురైనపుడు కుంగిపోవడం..సుఖాలు ఎదురైనపుడు పొంగిపోవడం తన నైజం కాదని పోస్ట్ చేయడం విశేషం. ఎగ్జామ్ సిస్టమే.. ఎడ్యుకేషన్ సిస్టం కాదు: రిషితా రెడ్డి రిషితా రెడ్డి తన ఫేస్బుక్లో చివరిసారిగా భారతీయ విద్యావ్యవస్థకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ తన మిత్రులకు ఓ సందేశం పోస్ట్ చేసింది. వాటిలో కొన్ని.. భారతీయ విద్యా వ్యవస్థ ఎగ్జామ్ సిస్టమే కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదంది. తన ఇష్టాలను చెబుతూ.. ఇష్టమైన హీరో మహేశ్‌బాబు, 2013లో నచ్చిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ఇటీవల చూసిన చివరి చిత్రం ‘ఐరన్‌మ్యాన్-3’, ఐపీఎల్లో నచ్చిన టీం ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’, నలుపు రంగు, చాక్లెట్లంటే అమితమైన ఇష్టమని పోస్ట్ చేసింది. ఆనందానికి ఆకాశమే హద్దు: పరమేశ్వర్ ‘కొన్ని అనుభూతులను జీవితంలో మర్చిపోలేము. వాటిలో ముందు వరుసలో ఉండేది ఈ టూరే. రైల్ ఎక్కినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతీ క్షణాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నాం. ఫ్రెండ్స్‌తో చెప్పలేనంత ఎంజాయ్ చేస్తున్నా. మా ఆనందానికి ఆకాశమే హద్దు. ఇక్కడి పర్యాటక, దర్శనీయ స్థలాలు నాలో కొత్త అనుభవాలకు బీజం వేశాయి. ఈ టూర్‌ను నా లైఫ్‌లో ఎప్పటికీ మరచిపోలేను.’ అంటూ తన మదిలోని భావాన్ని పోస్ట్ చేశాడు పరమేశ్వర్. క్షేమంగా తిరిగొస్తాం: సందీప్ బస్వరాజ్ మంగళవారం (3వ తేదీ) నాంపల్లిలో రైల్ ఎక్కిన సందీప్ చివరిసారిగా తన మిత్రుడితో ఫొటో దిగాడు. దాన్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. టూర్‌ను ఎంజాయ్ చేసి క్షేమంగా తిరిగొస్తామన్న కామెంట్‌ను పోస్ట్ చేశాడు. క్షేమంగా వెళ్లి ఎన్నో మధుర అనుభూతులతో తిరిగి వస్తానని తనకు సెండాఫ్ ఇచ్చిన ఫ్రెండ్‌కు చెప్పడం విశేషం. ఈ విహార యాత్రను జీవితంలో మర్చిపోలేను. ఫ్రెండ్స్‌తో గడిపిన క్షణాలు తిరిగిరావు. బాగా ఎంజాయ్ చేస్తాం.. అని పోస్ట్ చేశాడు. -
మూడు చోట్ల..
సాక్షి, సిటీబ్యూరో: హిమాచల్‌ప్రదేశ్ లార్జీ డ్యామ్ దుర్ఘటన నేపథ్యంలో నగరంలో మూడు ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఐశ్వర్య, విజేత, రాంబాబు, లక్ష్మీగాయత్రిల పార్థివ దేహాలు బేగంపేట్ విమానాశ్రయానికి వస్తాయని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, ఆత్మీయులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారి రోదనలతో ఈ ప్రాంతమంతా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. వారి దుఃఖాన్ని ఆపడం ఎవరి తరమూ కాలేదు. ఇక ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని విద్యార్థులు చదువుతున్న వీఎన్ఆర్- వీజేఐటీ కళాశాలకు సైతం విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు అధిక సంఖ్యలో బాచుపల్లిలోని కళాశాల ఆవరణకు చేరుకోవడంతో ఇక్కడి పరిస్థితులు గంభీరంగా మారాయి. అలాగే త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్న మరో 24 మంది విద్యార్థులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వస్తున్నారన్న సమాచారంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠతో అక్కడికి చేరుకున్నారు. ఎప్పుడు ప్రత్యేక విమానాలు నగరానికి చేరుకుంటాయోనన్న ఆదుర్దాతో గడిపారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద.. గల్లంతయిన విద్యార్థుల జాడ తెలుసుకునేందుకు సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 15 మంది ప్రముఖులు, అధికారులు హిమాచల్‌ప్రదేశ్‌కు తరలి వెళ్లారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో సుమారు 21 మంది హిమాచల్‌ప్రదేశ్‌కు బయలుదేరి వెళ్లారు. ఇక ప్రమాదం నుంచి బయటపడిన 24 మంది విద్యార్థులు క్షేమంగా తిరిగి వస్తారన్న సమాచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు సోమవారం రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడంతో ఇక్కడ ఉద్విగ్నత చోటుచేసుకుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు విమానాశ్రయ పరిసరాల్లో బాధిత కుటుంబ సభ్యుల రాకపోకలు, మీడియా పోలీసుల హడావుడి నెలకొంది. వీఎన్ఆర్-వీజేఐటీ వద్ద.. స్టడీటూర్‌కు వెళ్లిన విద్యార్థులు బీయాస్ నదిలో గల్లంతయ్యారన్న సమాచారంతో విద్యార్థుల తల్లితండ్రులతో పాటు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది, స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గల్లంతైన విద్యార్థుల క్షేమ సమాచారం కోసం విద్యార్థుల తల్లిదండ్రులు, వారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులు పెద్దసంఖ్యలో కళాశాలకు తరలి వచ్చారు. ఏకకాలంలో 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారన్న షాక్ నుంచి పలువురు తేరుకోలేకపోయారు. పోలీసు అధికారులు, మీడియా హడావుడితో ఈ ప్రాంతం కిటకిటలాడింది. బేగంపేట విమానాశ్రయం వద్ద.. లార్జీ దుర్ఘటనలో మృత్యువాత పడిన ఐశ్వర్య, విజేత, రాంబాబు, లక్ష్మీగాయత్రిల పార్థివ దేహాలు బేగంపేట విమానాశ్రయానికి వస్తున్నాయన్న సమాచారం తెలుసుకొని సోమవారం రాత్రి వారి తల్లిదండ్రులు, ఆత్మీయులు, బంధువులు, మిత్రులు పెద్దసంఖ్యలో బేగంపేట విమానాశ్రాయనికి చేరుకున్నారు. బంగరు భవిష్యత్ ఉన్న తమ పిల్లలు విగత జీవులుగా మారారన్న సమాచారం వారిని శోకసంద్రంలో ముంచింది. వారి రోదనలు మిన్నంటడడంతో ఇక్కడ ఉద్విగ్నత నెలకొంది. మృతదేహాలు ఎప్పుడు నగరానికి చేరుకుంటాయోనని వారి బంధువులు అక్కడున్న పోలీసులు, విమానాశ్రయ భద్రతా సిబ్బందిని సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆరా తీస్తూ ఉండటం కనిపించింది. అలర్ట్ చేయలేదు డ్యామ్ వద్దకు వెళ్లినప్పుడు అక్కడ మమ్మల్ని ఎవరూ అలర్ట్ చేయలేదు. దీంతో మా ఫ్రెండ్స్ నదిని చూడడానికి కిందికి దిగారు. అడుగు భాగంలో ఉన్న నీళ్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మా కళ్లముందే అంతా జరిగింది. ఇంకా భయం పోవడం లేదు. - సాయిలావణ్య, కేపీహెచ్‌బీ ఆనందంతో పాటు బాధగా ఉంది మా అబ్బాయి సుహర్ష సురక్షితంగా రావడంతో చెప్పలేనంత ఆనందంగా ఉంది. కానీ మిగతా పిల్లలు గల్లంతు కావడంతో చాలా బాధగా ఉంది. మా వాడు సంఘటన జరిగినప్పటి నుంచి మాకు ఫోన్లో పరిస్థితిని వివరిస్తూనే ఉన్నాడు. వాడు చాలా షాక్‌లో ఉన్నాడు. - చలపతిరావు, సుహర్ష తండ్రి -
విద్యార్థుల కోసం బంధుమిత్రుల ఆరా
వీఎన్ఆర్-వీజేఐటీ వద్ద ఉద్విగ్న వాతావరణం షాక్‌కు గురైన యాజమాన్యం హిమాచల్‌ప్రదేశ్‌కు తరలివెళ్లిన తల్లిదండ్రులు విద్యార్థుల కోసం బంధుమిత్రుల ఆరా జగద్గిరిగుట్ట : హిమాచల్‌ప్రదేశ్‌లోని లార్జీ హైడ్రో పవర్ డ్యామ్ దుర్ఘటన నేపథ్యంలో.. బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల వద్ద సోమవారం విషాదఛాయలు అలముకున్నాయి. స్టడీటూర్‌కు వెళ్లిన విద్యార్థులు బీయాస్ నదిలో గల్లంతయ్యారన్న సమాచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు, వారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులు పెద్దసంఖ్యలో కళాశాలకు తరలి వచ్చారు. వారి రోదనలతో ఈ ప్రాంతం అంతా ఉద్విగ్నంగా మారింది. ఏకకాలంలో 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారన్న షాక్ నుంచి పలువురు తేరుకోలేకపోయారు. కొంతమంది విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయని తెలుసుకుని విద్యార్థులు, కళాశాల సిబ్బంది హతాశులయ్యారు. పోలీసు అధికారులు, మీడియా హడావుడితో ఈ ప్రాంతం కిటకిటలాడింది. కుత్బుల్లాపూర్ మండల ఆర్ఐ ప్రభుదాసు కాలేజీని సందర్శించి విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ సిబ్బందితో మాట్లాడి పూర్తి సమాచారం సేకరించారు. బాచుపల్లిలోని కాలేజీలో నెలకొన్న పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. హిమాచల్‌ప్రదేశ్‌కు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను హిమాచల్‌ప్రదేశ్‌కు విమానంలో రెండు విడతలుగా తరలించారు. కళాశాల ప్రిన్సిపాల్ సి.డి.నాయుడు ఆధ్వర్యంలో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు బయలుదేరి వె ళ్లారు. కొంతమంది దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు బాచుపల్లిలోని కాలేజీ చేరుకుని సమాచారం కోసం విశ్వప్రయత్నం చేశారు. తమ పిల్లల వివరాలను వెల్లడించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం యాజమాన్యం నుంచి సరైన స్పందన లేదని రాంబాబు అనే విద్యార్థి తండ్రి శేఖర్ నాయక్ కాలేజీ భవ నం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం ఆలస్యంగా చేరుకున్న వారిని మరో విమానంలో హిమాచల్‌ప్రదేశ్‌కు పంపింది. కళాశాల వద్ద పటిష్ట బందోబస్తు నదిలో కొట్టుకుపోయిన విద్యార్థులు కొంతమంది మృతి చెందడంతో కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాలానగర్ ఏసీపీ నాగరాజరెడ్డి నేతృత్వంలో దుండిగల్ పోలీసులతో పాటు బీఎస్ఎఫ్ దళాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలానగర్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్, పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావులు ఘటనా స్థలానికి సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. కళ్లు తిరిగి పడిపోయిన సీఏఓ విద్యార్థులు గల్లంతై మృతి చెందిన విషయం తెలుసుకున్న కాలేజీ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి (సీఏఓ) సి.వి.రావు షాక్‌కు గురై కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో సిబ్బంది హడావుడి కనిపించింది. హుటాహుటిన డాక్టర్‌ను పిలిపించి పరిస్థితిని అదుపు చేశారు. దురదృష్టకరం : సీఏఓ సీవీ రావు వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి విద్యార్థులు నదిలో కొట్టుకుపోవడం దురదృష్టకరమని, విద్యార్థుల తల్లిదండ్రులకు జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడ్చలేనిదని అందుకు తాము ఎంతో బాధపడుతున్నామని కాలేజీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ సీవీ రావు అన్నారు. బాచుపల్లిలోని కళాశాలలో సోమవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. ఆదివారం సాయంత్రం తమకు సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తం అయ్యామన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు సమాచారం అందించమన్నారు. సిగ్నల్స్ అందకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు తమకు ప్రభుత్వపరంగా ఎంతో సహాయం అందించారని ఆయన తెలిపారు. తమకు ప్రత్యేక విమానాలను సమకూర్చడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. తమ విద్యార్థులను రక్షించుకోవడం కోసం ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నమన్నారు. ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, హిమచల్‌ప్రదేశ్ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. విద్యార్థుల మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపుతాం నది ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల మృతదేహాలను వారి స్వస్థలాలకు ఎయిర్ పోర్ట్ నుంచి చేరవేస్తామని సీవీ రావు చెప్పారు. ఎప్పటికప్పుడు లభించిన మృతదేహాలను రాష్ట్రానికి తీసుకువచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, బంధువులకు సమాచారం అందించేందుకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామన్నారు. షాక్‌కు గురయ్యాం ఆదివారం ఇండస్ట్రీయ్ల్ టూర్‌కు వెళ్లిన విద్యార్థులు నదిలో కొట్టుకుపోయారన్న సమాచారం రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. టూర్‌కు వెళ్లిన ఈఐఈ బ్రాంచ్ విద్యార్థులంతా సత్ప్రవర్తన కలిగిన పిల్లలే. ఇంత ఘోరం వీరికే జరగడం బాధాకరం. మృతి చెందిన వారిలో ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థులున్నారు. ఈ షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోలేక పోతున్నాం. - కె.అనిత, ఈఐఈ బ్రాంచ్ ఫ్యాకల్టీ గుండె బరువెక్కుతోంది భగవంతుడు మా విద్యార్థులకే ఇలాంటి కష్టాలు తేవాలా? ఎంతో మంచి తెలివితేటలు కలిగిన విద్యార్థులు లేరన్న సంగతి తల్చుకుంటేనే గుండె బరువెక్కుతుంది. ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడి చదివి జీవితంలో స్థిరపడే సమయంలోనే ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం. మాకే ఇంత బాధ ఉంటే ఇక విద్యార్థులను కనిపెంచిన వారి తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో? - కిరణ్మయి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ -
గల్లంతైన వారిలో శంషాబాద్ వాసి
దుఃఖసాగరంలో మునిగిన కుటుంబం శంషాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లో గల్లంతైన వారిలో శంషాబాద్ వాసి కూడా ఉన్నారు. స్థానిక పట్టణంలో పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో నివసించే వినోద్, శశిలతల కుమారుడు అరవింద్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో చదువుతున్నాడు. అతను కూడా గల్లంతు కావడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. అరవింద్‌తోపాటు అతడి కుటుంబసభ్యులు ముగ్గురు పిల్లల చదువుల కోసం నాలుగైదేళ్లుగా వనస్థలిపురంలో ఉంటున్నారు. అరవింద్ వీరికి మొదటి సంతానం. సెలవుల్లో ఇక్కడికి వచ్చి వెళ్లే వాళ్లని వారి బంధువులు తెలిపారు. అరవింద్ కుటుంబసభ్యులను ఓదార్చడానికి వారి బంధువులు కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అరవింద్ తల్లి శశిలతను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కొడుకు గల్లంతయ్యాడనే షాక్ నుంచి ఆ తల్లి తేరుకోలేకపోతోంది. మూడు రోజుల క్రితం ఫోన్ చేశాడు: వినోద్ , బంధువు నా కొడుకు అరవింద్ మూడు రోజుల కింద ఫోన్ చేసి బాగున్నామని చెప్పాడు. నిన్నరాత్రి 12 గంటలకు తెలిసింది.. గల్లంతైన వారిలో మా వాడు కూడా ఉన్నాడని. కాలేజీ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. హిమాచల్‌ప్రదేశ్‌కు నా బావమరిది వెళ్లాడు. ఇది ఘోరం: ప్రశాంత్, పరమేశ్వర్ సోదరుడు కళాశాల నిర్లక్ష్యంతోనే ఇంత ఘోరం జరిగింది. కాలేజీ వాళ్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. మా తమ్ముడు గల్లంతైన వారిలో ఉన్నాడు. మా బాధను చెప్పుకోలేని పరిస్థితి. ఉదయమే ఫ్లైట్ ఉందని చెప్పినా విమానాశ్రయంలో అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. -
విషాదఛాయలు
జగద్గిరిగుట్ట (బాచుపల్లి): హిమాచల్‌ప్రదేశ్‌లోని లార్జీ హైడ్రో పవర్ డ్యామ్ దుర్ఘటన నేపథ్యంలో.. బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల వద్ద సోమవారం విషాదఛాయలు అలుముకున్నాయి. స్టడీటూర్‌కు వెళ్లిన విద్యార్థులు బీయాస్ నదిలో గల్లంతయ్యారన్న సమాచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు, వారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులు పెద్దసంఖ్యలో కళాశాలకు తరలివచ్చారు. వారి రోదనలతో కాలేజీ పరిసరాలంతా ఉద్విగ్నంగా మారాయి. ఏకకాలంలో 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారన్న షాక్ నుంచి పలువురు తేరుకోలేకపోయారు. కొంతమంది విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయని తెలుసుకుని విద్యార్థులు, కళాశాల సిబ్బంది హతాశులయ్యారు. పోలీసు అధికారులు, మీడియా హడావుడితో ఈ ప్రాంతం కిటకిటలాడింది. కుత్బుల్లాపూర్ మండల ఆర్ఐ ప్రభుదాసు కాలేజీని సందర్శించి విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ సిబ్బందితో మాట్లాడి పూర్తి సమాచారం సేకరించారు. బాచుపల్లిలోని కాలేజీలో నెలకొన్న పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. హిమాచల్‌ప్రదేశ్‌కు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను హిమాచల్‌ప్రదేశ్‌కు విమానంలో రెండు విడతలుగా తరలించారు. కళాశాల ప్రిన్సిపాల్ సి.డి.నాయుడు ఆధ్వర్యంలో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు బయలుదేరి వెళ్లారు. కొంతమంది దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు బాచుపల్లిలోని కాలేజీ చేరుకుని సమాచారం కోసం విశ్వప్రయత్నం చేశారు. తమ పిల్లల వివరాలను వెల్లడించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం యాజమాన్యం నుంచి సరైన స్పందన లేదని రాంబాబు అనే విద్యార్థి తండ్రి శేఖర్ నాయక్ కాలేజీ భవనం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం ఆలస్యంగా చేరుకున్న వారిని మరో విమానంలో హిమాచల్‌ప్రదేశ్‌కు పంపింది. కళాశాల వద్ద పటిష్ట బందోబస్తు నదిలో కొట్టుకుపోయిన విద్యార్థులు కొంతమంది మృతి చెందడంతో కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాలానగర్ ఏసీపీ నాగరాజరెడ్డి నేతృత్వంలో దుండిగల్ పోలీసులతో పాటు బీఎస్ఎఫ్ దళాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలానగర్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్, పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావులు ఘటనా స్థలానికి సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. కళ్లు తిరిగి పడిపోయిన సీఏఓ విద్యార్థులు గల్లంతై మృతి చెందిన విషయం తెలుసుకున్న కాలేజీ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి (సీఏఓ) సి.వి.రావు షాక్‌కు గురై కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో సిబ్బంది హడావుడి కనిపించింది. హుటాహుటిన డాక్టర్‌ను పిలిపించి పరిస్థితిని అదుపు చేశారు. దురదృష్టకరం : సీఏఓ సీవీ రావు వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి విద్యార్థులు నదిలో కొట్టుకుపోవడం దురదృష్టకరమని, విద్యార్థుల తల్లిదండ్రులకు జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడ్చలేనిదని అందుకు తాము ఎం తో బాధపడుతున్నామని కాలేజీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ సీవీ రావు అన్నారు. బాచుపల్లిలోని కళాశాలలో సోమవారం సాయంత్రం ఆయ న మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆదివారం సాయంత్రం తమకు సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తం అయ్యామన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు సమాచారం అందించమన్నారు. సిగ్నల్స్ అందకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు తమకు ప్రభుత్వపరంగా ఎంతో సహాయం అందించారని ఆయన తెలిపారు. తమకు ప్రత్యేక విమానాలను సమకూర్చడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. తమ విద్యార్థులను రక్షించుకోవడం కోసం ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నమన్నారు. ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, హిమచల్‌ప్రదేశ్ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్నాయని ఆయన తెలియ జేశారు. విద్యార్థుల మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపుతాం నది ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల మృతదేహాలను వారి స్వస్థలాలకు ఎయిర్ పోర్ట్ నుంచి చేరవేస్తామని సీవీ రావు చెప్పారు. ఎప్పటికప్పుడు లభించిన మృతదేహాలను రాష్ట్రానికి తీసుకువచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, బంధువులకు సమాచారం అందించేందుకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామన్నారు. షాక్‌కు గురయ్యాం ఆదివారం ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లిన విద్యార్థులు నదిలో కొట్టుకుపోయారన్న సమాచారం రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. టూర్‌కు వెళ్లిన ఈఐఈ బ్రాంచ్ విద్యార్థులంతా సత్ప్రవర్తన కలిగిన పిల్లలే. ఇంత ఘోరం వీరికే జరగడం బాధాకరం. మృతి చెందిన వారిలో ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థులున్నారు. ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాం. గుండె బరువెక్కుతోంది భగవంతుడు మా విద్యార్థులకే ఇలాంటి కష్టాలు తేవాలా? ఎంతో మంచి తెలివితేటలు కలిగిన విద్యార్థులు లేరన్న సంగతి తల్చుకుంటేనే గుండె బరువెక్కుతోంది. ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడి చదివి జీవితంలో స్థిరపడే సమయంలోనే ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం. మాకే ఇంత బాధ ఉంటే ఇక విద్యార్థులను కని పెంచిన వారి తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో?