Larry Accident
-
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం మండలం కేసరపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి లారీ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన ఒకే కుటుంబంలోని రాజ్యలక్ష్మి(29), శ్రీనివాస్(27), రోహిత్(2)లుగా పోలీసులు గుర్తించారు. లారీని క్లీనర్ నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గన్నవరం పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ప్రమద స్ధలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది క్రేన్ సాయంతో లారీని బయటకు తీస్తున్నారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కంటైనర్‌ను ఢీకొన్న బైక్: బీటెక్ విద్యార్థి మృతి
కోట (నెల్లూరు జిల్లా): ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని అదుపు తప్పి బైక్ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విద్యానగర్ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. మండలంలోని ఉప్పలమర్తికి చెందిన చందు, సూళ్లూరుపేటకు చెందిన సమీర్ ఎన్బీకేఆర్లో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. ఇద్దరు స్నేహితులు మరో స్నేహితుడి బైక్ తీసుకుని కోటకు వెళ్లి తిరిగి విద్యానగర్ కళాశాల వద్దకు వస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న రొయ్యల కంటైనర్ లారీని ఢీకొన్నారు. ప్రమాదంలో బైక్ కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారకస్థితిలోకి చేరుకున్న క్షతగాత్రులను స్థానికులు కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. సమీర్‌కు తలకు తీవ్రగాయం కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు సింహపురి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సమీర్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎన్బీకేఆర్ అధ్యాపకులు, విద్యార్థులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. సమీర్ తండ్రి ఎస్దాని షార్ కేంద్రంలో పని చేస్తున్నాడు. కుమారుడు మృతి చెందిన విషయం తెలుసుకుని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ, బైక్ ఢీ: ఒకరి మృతి
నిజాంసాగర్: ఎదురుగా వస్తున్న బైక్‌ను చెరుకు లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీ కొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని మాగి గ్రామానికి చెందిన గుర్రపు అనిల్(35), చింతకింది శేఖర్(34)ఆదివారం నారాయణఖేడ్‌లో తమ బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్తుండగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నిజాంపేట సమీపంలోని బొక్కలకుంట దర్గా వద్ద మూల మలుపు వద్ద చెరుకు లోడ్‌తో నారాయణఖేడ్ వైపు నుంచి వెళ్తున్న లారీ ఢీకొంది. దీంతో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. వారి బైక్ నుజ్జయింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నిజాంపేట సర్పంచ్ సాయిరెడ్డి హుటాహుటిని అక్కడికి చేరుకుని 108 అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. వారిని నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో గాయాలైన అనిల్, శేఖర్‌కు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. జోగిపేట సమీపంలోకి చేరుకునే సరికి అనిల్ మృతిచెందాడు. దీంతో శేఖర్‌ను హైదరాబాద్‌కు తరలించారు. మృతిచెందిన అనిల్‌కు భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. బైక్‌ను ఢీకొట్టిన చెరుకు లారీని నిజాంపేట వద్ద గ్రామస్తులు ఆపి వేశారు. నారాయణఖేడ్ ఎస్ఐ నరేందర్ సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్నారు. -
లారీ ఢీకొని తాపీమేస్త్రి మృతి
మందస : లారీ ఢీకొని తాపీమేస్త్రి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. మందస మండలంలోని ఉద్దాన ప్రాంతమైన కె.జగన్నాథపురం గ్రామానికి చెందిన కార్జి లింగరాజు(35) తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం పనికి బయలుదేరిన లింగరాజు బిన్నళమదనాపురం సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద ఆయిల్ కొట్టడానికి ద్విచక్ర వాహనం తిప్పుతుండగా ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగరాజు రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయం తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే లింగరాజు మరణవార్త అందడంతో భార్య పార్వతి, కుమార్తె శిరీషా, కుమారుడు మనోజ్‌లు దుఃఖసాగరంలో మునిగిపోయారు. సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. సోంపేట ఎస్ఐ భాస్కరరావు(మందస ఇన్చార్జి) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఎన్‌హెచ్ 44పై భారీగా ట్రాఫిక్ జామ్
-
ఎన్‌హెచ్ 44పై ట్రాఫిక్ జామ్
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలం బ్రిడ్జిపై ఓ లారీ నిలిచిపోవడంతో ఎన్‌హెచ్ 44 మార్గంలో రాకపోకలు స్తంభించాయి. బళ్లారి నుంచి అనంతపురం వైపు వెళుతున్న ఓ లారీ మంగళవారం ఉదయం బ్రిడ్జిపైకి వచ్చిన సమయంలో ఎదురుగా ఆటో రావడంతో తప్పించే క్రమంలో దిమ్మెను ఢీకొని పక్కకు ఒరిగింది. ఈ బ్రిడ్జి పై ఒక వాహనం మాత్రమే పట్టేంత స్థలం మాత్రమే ఉంటుంది. దీంతో ఉదయం 6.30 గంటల నుంచి వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆ లారీని అక్కడి నుంచి తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.