lash
-
Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్ జాం (ఫొటోలు)
-
పూలపాన్పు
పాదుషా గారికి పూలపాన్పులో తప్ప నిద్రపట్టదు. అందుకోసం తన శయన మందిరంలోని మంచాన్ని రోజూ పలు రకాల పూలతో అలంకరించేందుకు ఓ సేవకురాలిని నియమించుకున్నారు. అలా చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు పాదుషా గారు వేటకు వెళ్లి రావడం ఆలస్యమయ్యింది. సేవకురాలు రోజూ లాగే రాజుగారి మంచాన్ని పూలతో అలంకరించింది. ‘ఇన్నేళ్లుగా పాదుషా గారి మంచాన్ని పూలతో ముస్తాబు చేస్తున్నాను కదా, ఒక్కసారి ఈ పూలపాన్పుపై కాసేపు సేదతీరితే’ అనే తలంపు ఆమెకు కలిగింది. వెంటనే పూలపాన్పుపై కాసేపు మేను వాల్చింది. క్షణాల్లోనే గాఢనిద్రలోకి జారుకుంది. అంతలోనే పాదుషా గారు వేటనుంచి తన శయన మందిరానికి వచ్చారు. తన పూలపాన్పుపై పడుకుని ఉన్న సేవకురాలిని చూసి ‘నా పూల పాన్పుపైనే పడుకుంటావా! ఎంత ధైర్యం’ అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తలారిని పిలిపించి ‘పాదుషా గారి మందిరం విలువేంటో ఇతర సేవకులకు తెలిసొచ్చేలా ఈమెను తల్లకిందులుగా వేలాడదీసి ప్రాణాలొదిలే వరకూ కొరడా దెబ్బలు కొట్టాలని’ ఆజ్ఞాపించారు. ఆజ్ఞ మేరకు కొరడా దెబ్బల శిక్ష అమలు చేశారు. కొరడా దెబ్బలకు ఆ సేవకురాలు పెడబొబ్బలు పెట్టసాగింది. అంతలోనే పకపకా నవ్వడం మొదలెట్టింది! దీన్ని గమనించిన పాదుషాగారు నీ ఏడుపుకు, అంతలోనే నీ నవ్వుకు కారణమేమిటని అడిగారు. దానికా సేవకురాలు ‘కొరడా దెబ్బల నొప్పి భరించలేక ఏడ్చాను. కాని, కేవలం కొన్ని నిమిషాలపాటు మీ పూలపాన్పుపై నిద్రపోయినందుకే నన్నింతగా హింసిస్తున్నారే, మరి జీవితాంతం పూలపాన్పుపై నిద్రపోయేవారి పరిస్థితి పైలోకంలో ఎలా ఉంటుందో ఊహించుకొని నవ్వుకుంటున్నాను’ అని జవాబిచ్చింది. పాదుషాగారి కళ్లు తెరుచుకున్నాయి. ఆ సేవకురాలిని క్షమించి వదిలి వేశారు. పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. తాను అనుభవిస్తున్న అనుగ్రహాలపట్ల అల్లాహ్ లెక్క తీసుకుంటాడన్న గుణపాఠం తెలియజేసిన ఆ సేవకురాలిని బహుమతులతో సత్కరించారు. – నాఫియా -
కొందుర్గులో కుండపోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గులో అత్యధికంగా 18 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. ఈ సీజన్లో ఒక ప్రాంతంలో ఈమేర కుండపోత వర్షం కురవడం ఇదే మొదటిసారని వాతావరణ అధికారులు చెబుతున్నారు. అలాగే బూర్గుంపాడులో 14, ములకలపల్లిలో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నారాయణఖేడ్‌లో 11, జడ్చర్ల, పర్వతగిరి, జూలూరుపాడుల్లో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. దుమ్ముగూడెం, మధిర, ఖానాపూర్, యాచారం, రామన్నపేట, నర్సంపేటల్లో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదైంది. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
నగరంలో భారీ వర్షం..
- ఈదురుగాలులు, ఉరుములతో కురిసిన వాన - పలు ప్రాంతాల్లో రోడ్లపైకి చేరిన వరద నీరు.. స్తంభించిన ట్రాఫిక్ - కూలిన చెట్లు.. విద్యుత్ సరఫరాకు అంతరాయం - నేడు కూడా వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం కారణంగా శుక్రవారం హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగా లులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, కొత్తపేట, చైతన్యపురి, ఉప్పల్, రామంతాపూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, చం పాపేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షంతో రహ దారులపై వరద నీరు పోటెత్తింది. ట్రాఫిక్ ఎక్కడి కక్కడే స్తంభించింది. ఈదురుగాలుల బీభత్సానికి పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చంచల్‌గూడ, ఉస్మాన్ఘడ్, మలక్‌పేట, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 50 ఫీడర్ల పరిధిలో గంటన్నర పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సీపీడీసీఎల్ వర్గాలు తెలిపాయి. నేడు కూడా వర్షసూచన ఉపరితల ఆవర్తనం కారణంగా శనివారం హైదరాబాద్ నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం హైదరాబాద్‌లో 39.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
విజయవాడలో భారీ వర్షాలు
-
కోస్తాలో భారీ వర్షాలు
-
తడిసి ముద్దయిన రాజధాని
-
శ్రీకాకుళం జిల్లాలో 65 సెంటీమీటర్ల వర్షపాతం
-
భారీ వర్షం.. ట్రాఫిక్ అతలాకుతలం
ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా రాత్రి వరకు కురుస్తూనే ఉన్న వర్షం వల్ల రాష్ట్ర రాజధాని నగరంలో ట్రాఫిక్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కేవలం ఒకటి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లడానికే దాదాపు గంట సమయం పట్టిందంటే పరిస్థితి అర్థమవుతుంది. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు.. వేటిలో వెళ్లినా ఇదే పరిస్థితి. ముఖ్యంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో చిన్న చినుకు పడితే చాలు.. నీళ్లు ఎక్కడికక్కడ నిల్వ ఉండిపోతున్నాయి. నిల్వ ఉన్న నీళ్లలోంచి వెళ్లడానికి వాహన చోదకులు ఇబ్బందులు పడుతుండటం, మరికొన్ని ప్రాంతాల్లో బాటిల్ నెక్స్ కారణంగా ట్రాఫిక్ జామ్ మరింత ఎక్కువ ఇబ్బంది పెడుతోంది. బుధవారం నాటి వర్షానికి జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, మాసాబ్ ట్యాంక్, లక్డీకా పుల్, ఆబిడ్స్, కోఠీ, మలక్ పేట, మూసారాం బాగ్, దిల్ సుఖ్ నగర్ లాంటి ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. మెట్రో రైలు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అయితే, సగానికి పైగా రోడ్డును మెట్రో రైలు కోసం ఆక్రమించుకోవడం, మిగిలిన కొద్దిపాటి రోడ్డు అప్పటికే ఎంతో కొంత ఆక్రమణలకు గురికావడంతో ఆ మధ్య ఉన్న కొద్దిపాటి ఖాళీ లోంచి వాహనాలు వెళ్లలేక, ఆగలేక నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మామూలు రోజుల్లోనే ఇలాంటి ప్రాంతాల్లో సమస్య ఉందంటే, ఇక వర్షం వచ్చినప్పుడు అసలు చెప్పనక్కర్లేదు. అమీర్ పేట, పంజాగుట్ట లాంటి ప్రాంతాలు కూడా వర్షం తాకిడికి విపరీతమైన రద్దీతో నిండిపోయాయి. మామూలు రోజుల్లో గంట - గంటన్నర ప్రయాణంతోనే గమ్యాన్ని చేరుకునే నగర జీవులు వర్షం పడిన రోజుల్లో మూడు నాలుగు గంటలు గడిస్తే తప్ప గమ్యాన్ని చేరుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు వర్షం, మరోవైపు మునిసిపల్ కార్మికులు సమ్మెలో ఉండటంతో పలు ప్రాంతాల్లో రోడ్డు మీద చెత్తకుప్పలు పేరుకుపోయాయి. ట్రాఫిక్ ఆగిపోయినప్పుడు తప్పనిసరిగా వాటి పక్కన ఉండేవారి బాధలు ఇక వర్ణనాతీతం. వర్షాలకు ఇలాంటి పరిస్థితులు కూడా తోడైతే వ్యాధులు వ్యాపిస్తాయేమోనన్న భయాందోళనలు సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నగర అవసరాలకు తగినట్లుగా రోడ్లు విస్తరించడం, గోతులు పడినప్పుడు రీ కార్పెటింగ్ మాత్రమే చేసి వదిలేయకుండా మొత్తం రోడ్డు వేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. రీ కార్పెటింగ్ చేసినప్పుడు మళ్లీ వారం పది రోజుల్లో వర్షాలు పడటం, మళ్లీ అక్కడ కూడా గుంతలు ఏర్పడటం సర్వసాధారణంగా మారింది. గతంలో ఒకసారి మాత్రం ముఖ్యమంత్రి నగర రోడ్ల పరిస్థితి మీద జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షించారు. తర్వాత మళ్లీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. ఈ రోడ్లకు ఎన్నాళ్లకు మోక్షం వస్తుందో ఆ పైవాడికే ఎరుక.. -
కుండపోత