Lashker e Taiba
-
తీరు మారని పాక్.. అమెరికా ఫైర్!
న్యూఢిల్లీ: ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ మనీల్యాండరింగ్ వ్యవహారాల గుట్టుమట్లను తేల్చే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గట్టి షాకిచ్చింది. లష్కర్-ఎ-తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలకు నిధులు చేకూరుతున్న మార్గాలను అన్వేషించడంలో విఫలమైనందుకుగానూ ‘గ్రేలిస్టు’లో కొనసాగించాలని నిర్ణయించింది. కరోనా(కోవిడ్-19) వ్యాప్తి నేపథ్యంలో ఎఫ్ఏటీఎఫ్ అధికారులు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ పాక్ తీరు మారకపోవడంతో అధ్యక్షుడు షియాంగ్‌మిన్ లియూ(చైనా) నేతృత్వంలోని బృందం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. (కశ్మీర్లో ఎన్కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు మృతి) పాకిస్తాన్‌పై అమెరికా ఆగ్రహం ఇదిలా ఉండగా.. లష్కర్, జైషే వంటి ఉగ్ర సంస్థలకు ఆశ్రయం కల్పిస్తూ.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందంటూ అమెరికా బుధవారం పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పాకిస్తాన్ కేంద్రంగా... ఆఫ్గనిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకున్న అఫ్గన్ తాలిబన్, భారత్ లక్ష్యంగా దాడులకు పాల్పడిన లష్కర్- ఎ- తొయిబా, దాని అనుబంధ సంస్థలు, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది. లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్, అతడి అనుచరులపై కేసులు నమోదు చేసినా చెప్పుకోతగ్గ స్థాయిలో చర్యలు తీసుకోలేదు’’ అని విమర్శించింది. అదే విధంగా ఆఫ్గనిస్తాన్‌లో నివసిస్తూ పాక్‌పై ఉగ్రచర్యలను ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ భారత పౌరుడిని ఉగ్రవాదిగా గుర్తించాలన్న పాకిస్తాన్ విన్నపాన్ని తోసిపుచ్చింది. ఈ విషయంపై స్పందించిన పాక్ విదేశాంగ శాఖ అమెరికా తీరు తమను నిరాశకు గురిచేసిందని విచారం వ్యక్తం చేసింది.(సిబ్బందిని 50% తగ్గించండి: పాక్‌కు భారత్ ఆదేశం) 2018 నుంచి గ్రే లిస్టులో.. భారత్‌లో ఉడి, పుల్వామా ఘటనలకు పాల్పడినట్లుగా భావిస్తున్న ఉగ్ర సంస్థలు జైషే మహ్మద్, లష్కర్-ఎ-తొయిబాలను మాత్రమే గతంలో నిషేధించిన దాయాది దేశం... నిషేధిత ఉగ్ర సంస్థల సరికొత్త జాబితాలో కొన్నింటిని ‘వాచ్‌లిస్టు’లో పెట్టి తన విధానమేమిటో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎఫ్ఏటీఎఫ్ హెచ్చరికల నేపథ్యంలో... లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ స్థాపించిన జమాత్-ఉద్- దావా(జేయూడీ), ఫతా-ఈ- ఇన్సానియత్(ఎఫ్ఏఐ)లను నిషేధిస్తామన్న పాక్.. వాటిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొంటూ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. ఈ నేపథ్యంలో 2018 నుంచి ఎఫ్ఏటీఎఫ్ గ్రేలిస్టులో కొనసాగుతున్న పాకిస్తాన్.. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే సమావేశం నాటికి తన పంథాను మార్చుకోనట్లయితే ఇరాన్, ఉత్తర కొరియా మాదిరి.. ‘బ్లాక్ లిస్టు’లో చేరే అవకాశం ఉంది. కాగా మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ నిరోధక నిబంధనలకు అనుగుణంగా లేదని భావించే దేశాల జాబితాలో ఎఫ్ఏటీఎఫ్ తమను చేర్చకుండా ఉండేందుకు పాకిస్తాన్ విఫలయత్నం చేస్తోంది. -
లాడనే మా హీరో: పాక్ మాజీ అధ్యక్షుడు
ఇస్లామాబాద్ : కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ తమ హీరో అని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్ వైఖరిని ముషార్రఫ్ బహిర్గతం చేశారు. జిహాది ఉగ్రవాదులందరు పాక్ హీరోలంటూ కొనియాడారు. ఈ మేరకు ముషారప్ వ్యాఖ్యానించినట్లుగా పాక్ రాజకీయ నాయకుడు ఫర్హతుల్లా బాబర్ ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రకారం.. పాకిస్తాన్‌కు లాభం చేకూర్చే విధంగా ఆఫ్ఘనిస్తాన్‌లో 1979లో మతపరమైన మిలిటెన్సిని ప్రవేశపెట్టామని తద్వారా దేశంలోని సోవియేట్లను వెళ్లిపోయే విధంగా కృషి చేశామని ముషారఫ్ అన్నారు. Gen Musharraf blurts that militants were nurtured and touted as 'heroes' to fight in Kashmir. If it resulted in destruction of two generations of Pashtuns it didn't matter. Is it wrong to demand Truth Commission to find who devised self serving policies that destroyed Pashtuns? https://t.co/5Q2LOvl3yb — Farhatullah Babar (@FarhatullahB) November 13, 2019 ‘ప్రపంచంలోని ముజాహిద్దీన్ ఉగ్రవాదులందరిని ఏకం చేశాం. అప్పట్లో లష్కరే తోయిబా, ఆల్‌ఖైదా ఉగ్రవాదులను ప్రోత్సహించాం. పాక్‌కు వచ్చే కశ్మీరీలను హీరోలుగా గుర్తించాం. మేము వారికి పటిష్టమైన శిక్షణ ఇచ్చాం. భారత ఆర్మీతో పోరాడే కశ్మీరులను ముజాహుద్దీన్‌లుగా గుర్తించాం. అంతర్జాతీయంగా పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తమ హీరోలు విలన్లయ్యారు’ అని ముషారఫ్ వ్యాఖ్యానించారు. -
ముంబై పేలుళ్ల సూత్రధారికి మళ్లీ భద్రత
లాహోర్: ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, జమాత్-ఉద్-దవా, లష్కరే తోయిబా అధిపతి హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి భద్రతను పునరుద్ధరించింది. అవసరం లేకున్నా ప్రభుత్వం తరఫున భద్రతా సేవల్ని పొందుతున్న వారికి తక్షణం సెక్యూరిటీని తొలగించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు నెల రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలతో పంజాబ్ ప్రభుత్వం సయీద్‌కు భద్రతను ఉపసంహరించింది. దీనిపై హఫీజ్ లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అవసరం లేకున్నా ప్రభుత్వం తరఫున సెక్యూరిటీ సేవల్ని అందిస్తున్నారని సుప్రీం చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి తనకు పంజాబ్ రాష్ట్రం భద్రతను తొలగించిందని హఫీజ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. తన ప్రాణాలకు నిజంగానే ముప్పు ఉందని కోర్టుకు విన్నవించుకున్నాడు. కాగా, ప్రాణాలకు ముప్పు ఉన్న వారికి సెక్యూరిటీని కల్పించాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తన ఉత్తర్వులను సవరించడం గమనార్హం. హఫీజ్ ప్రాణాలకు ముప్పు ఉన్నందునే భద్రతను పునరుద్ధరించామని పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షర్ఫీ తెలిపారు. సయీద్ లాహార్ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నాడు. -
చీలిన లష్కరే తోయిబా; జైషే మన్కాఫా ఏర్పాటు
ఇస్లామాబాద్ : ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హఫీజ్ సయీద్ కార్యకలాపాలపై నిఘా తీవ్రతరం కావడంతో సంస్థ డిప్యూటీ మౌలనా అమీర్ హంజా.. కొత్త కుంపటికి తెరలేపారు. ‘జైషే మన్కాఫా’ పేరుతో మౌలానా కొత్త సంస్థను స్థాపించినట్లు పాక్ మీడియా పేర్కొంది.ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకే హఫీజ్ ఈ ఎత్తుగడ వేసి ఉంటాడని తెలుస్తోంది. హఫీజ్ నిర్వహిస్తున్న సంస్థలను సీజ్ చేసిన పాక్ సర్కారు.. ఆయన ఏర్పాటు చేయాలనుకున్న రాజకీయ పార్టీకి కూడా అనుమతి నిరాకరించింది. కాగా, కొత్త సంస్థ తన ఉనికిని చాటేందుకు జమ్మూకశ్మీర్‌లో దాడులకు తెగబడొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
సర్జికల్ స్ట్రైక్స్‌తో ఆ టెర్రర్ గ్రూప్ కకావికలం!
బరాముల్లా/న్యూఢిల్లీ: భారత సైన్యం అత్యంత పకడ్బందీగా సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) చావుదెబ్బ తిన్నది. వాస్తవాధీన రేఖ ఆవల ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద తాత్కాలిక శిబిరాలపై భారత సైన్యం గత నెల 29న మెరుపు దాడుల్లో చేసింది. ఈ దాడుల్లో ఒక్క ఎల్ఈటీకే 20మంది ఉగ్రవాదులు హతమయినట్టు వివిధ నిఘా వర్గాల నివేదికలను బట్టి తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన వివిధ వర్గాల రేడియో సంభాషణలపై నిఘా సమాచారం, ఆర్మీ యూనిట్ల సమాచారం ప్రకారం సర్జికల్ దాడుల్లో ఎల్ఈటీ దారుణంగా నష్టపోయింది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా సెక్టర్‌కు అభిముఖంగా పీవోకేలో ఉండే డుద్నియాల్ వద్ద ఎల్ఈటీ ల్యాంచ్ప్యాడ్పై సైన్యం దాడులు జరిపింది. కెల్, కైల్ అని కూడా పిలిచే ఇక్కడ ఆర్మీ డివిజన్‌కు చెందిన ఐదు బృందాలు దాడులు జరిపాయి. పాకిస్థాన్ సైన్యం రక్షణలో ఎల్వోసీకి ఏడు వందల మీటర్ల దూరంలో ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్ ఉంది. ఇక్కడ అత్యధికంగా ఎల్ఈటీ ఉగ్రవాదులే ఉన్నారు. భారత సైన్యం చర్యను ఊహించలేకపోయిన ఉగ్రవాదులు.. సర్జికల్ దాడులతో షాక్ తిన్నారు. ప్రాణ రక్షణ కోసం పాక్ సైన్యం ఉన్న దిశగా పరుగులు పెట్టారు. వారు తప్పించుకునేలోపే భారత సైన్యం తన పని పూర్తి చేసింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం సర్జికల్ దాడులు ముగిసిన అనంతరం ఆర్మీ రేడియో సంభాషణలపై నిఘా పెట్టింది. ఈ నిఘా సమాచారం ప్రకారం ఇక్కడ కనీసం పది మంది ఎల్ఈటీ ఉగ్రవాదులు హతమైనట్టు పాక్ ఆర్మీ సంభాషణల్లో తేలింది. ఆ రోజు తెల్లవారుజామునే మృతదేహాలను తరలించి నీలమ్ వ్యాలీలో సామూహికంగా ఖననం చేసినట్టు వెల్లడైంది. ఇక పూంచ్ సెక్టర్‌కు అభిముఖంగా ఉన్న బాల్నోయ్ ప్రాంతంలో సైన్యం జరిపిన సర్జికల్ దాడుల్లో తొమ్మిది మంది వరకు ఎల్ఈటీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడ ఇద్దరు పాకిస్థానీ సైనికులు కూడా మృతిచెందారు. వివిధ మార్గాల్లో దేశంలోకి చొరబడేందుకు ఈ ఉగ్రవాదులు ఎల్వోసీ మీదుగా మాటువేశారని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందని, దేశంలో ఉగ్ర దాడులు జరిపేందుకు సన్నద్ధమవుతున్న వారిని పీవోకేలోకి ప్రవేశించి మెరుపు దాడుల ద్వారా సైన్యం మట్టుబెట్టిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.