క్రికీతో జియో కొత్త రియాలిటీ గేమింగ్ యాప్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ అగ్మెంట్ రియాలిటీ మొబైల్ గేమింగ్ సంస్థ క్రికీ, జియోతో కలిసి కొత్తగా రియాలిటీ గేమింగ్ యాప్ యాత్రను భారత్‌లో ప్రారంభించింది. ఇందుకోసం జియో కూడా సిరీస్ ఎ ఫండింగ్ రౌడ్‌కు నాయకత్వం వహించి దాదాపు 22 మిలియన్ డాలర్లను క్రికీకు ఇచ్చింది. ఈ యాప్‌లో జియోతో కలిసి భారతదేశంలో ప్రారంభించిన సందర్భంగా క్రికీ వ్యవస్థాపకులు జాన్వీ, కేతకి శ్రీరామ్‌లు మాట్లాడుతూ.. ‘ఆన్లైన్ గేమింగ్ ప్రియులకు మరింత వినోదాన్ని అందించేందుకు మా క్రికీ యాప్ ప్రేరణ ఇచ్చింది. అందుకే ఆన్లైన్ ఆటగాళ్ల కోసం కొత్తగా యాత్ర యాప్‌ను ప్రారంభించాం. మీ మొబైల్లో గేమ్ ఆడుతున్నసమయంలో ఈ యాప్ మిమ్మల్ని ఆటలో లీనం చేస్తుంది. ఎ విధంగా అంటే ఈ యాప్‌ను త్రిడీలో రూపోందించినందున ఇందులో గేమ్ మీకు వాస్తవిక భావన కలిగిస్తుంది. కేవలం మీ మొబైల్ కెమెరాతో ఆటగాళ్లను యాక్షన్, ఆడ్వెంచర్‌లతో ఫాంటసీ ప్రపంచాన్ని మీ ఇంటికే తీసుకువస్తుంది.
అయితే అగ్మెంట్ రియాలిటీ గేమ్‌లో రాక్షసుడు సైన్యాన్ని ఓడించే ప్రయత్నం చేయడం, బాణం, విల్లు చక్రం, మెరుపు, ఫైర్ బోల్ట్ వంటి ఆయుధాలను ఉపయోగించి ఆటగాళ్లంతా ఇందులో పాల్గొనవచ్చు. ఈ రియాలిటీ గేమ్ అంతా త్రీడిలో ఉన్నందున యాత్ర యూజర్లంతా ఈ ఆటలో వాస్తవంగా పాల్గొన్న అనుభూతిని ఇస్తుంది’ అని వారు చెప్పుకొచ్చారు. ఇక ఆటగాళ్లు తమ ఆటను స్నేహితులతో పంచుకునే ఆప్షన్ కూడా ఉంది. మీ గేమ్ పూర్తి కాగానే వీడియో ఫేరింగ్ ఆప్షన్‌తో పాటు ఇతరులు పోస్టు చేసిన గేమ్ వీడియోను కూడా చూడటానికి వీడియో ఫీడ్ ఆప్షన్ ఉంటుంది. అలాగే తిరిగి అదే గేమ్‌ను ఆడేందుకి డిజిటల్ గ్రౌండ్ ఆప్షన్ సౌకర్యం కూడా ఉందని వారు పేర్కొన్నారు. అయితే జియో మొబైల్ యూజర్లకు మాత్రం కొన్ని అదనపు ఫిచర్లను అందిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. అవి: 3డీ అవతార్ ఫీచర్, గెమ్‌ప్లే టోకెన్లు(అదనపు ఆయుధాలు, పవన్ ఆన్‌లాక్ చేయడం), గేమ్ ప్లేస్‌లు.
అదే విధంగా దీనిపై జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. ‘‘ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్‌తో క్రికీ ఒక తరం భారతీయులను ప్రేరేపిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన అనుభవనాలను భారతీయులకు అందించేందుకు ఈ యాత్ర యాప్ మా దృష్టి ఆకర్షించిందన్నారు. ఈ యాప్ వినియోగాదారులంతా రియాలిటి గేమ్‌లో మంచి అనుభూతిని పొందుతారని, కాబట్టి ఆన్లైన్ గేమ్ ప్రియులంతా ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని ఫాంటసీ అనుభవాన్ని పొందాలని పిలుపునిచ్చారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమింగ్‌తో ఆటగాళ్లంత తమ స్వంత ప్రపంచ అనుభూతిని పొందడానికి యాత్ర యాప్ ఆక్సెస్‌ను జియో యూజర్లతో పాటు, జియోతర మొబైల్ యూజర్లకు కూడా కల్పిస్తున్నాం’ అని ఆకాష్ తెలిపారు. అయితే ఈ క్రికీ యాప్ ఇప్పడు ఐఓసీ(ios) యాప్ స్టోర్లతో పాటు గూగుల్ ప్లే స్టోర్లలో ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు.