launch new variant
-
ట్రెసా నుంచి వీ0.1 ఎలక్ట్రిక్ ట్రక్
హైదరాబాద్: ట్రెసా మోటార్స్ తన తొలి ఎలక్ట్రిక్ ట్రక్ ‘వీ0.1’ మోడల్‌ను ఆవిష్కరించింది. యాక్సియల్ ఫ్లక్స్ మోటార్ ప్లాట్ ఫామ్: ఫ్లక్స్350పై దీన్ని అభివృద్ధి చేసినట్టు సంస్థ ప్రకటించింది. దీన్ని ప్రపంచ మార్కెట్ కోసం డిజైన్ చేసినట్టు తెలిపింది. భవిష్యత్ కోసం ఉద్దేశించిన సుస్థిర రవాణా పరిష్కారాలను అందించాలన్న సంస్థ అంకిత భావానికి ఈ ఉత్పత్తి నిదర్శనంగా ఉంటుందని పేర్కొంది. ట్రెసా ఎలక్ట్రిక్ ట్రక్ ‘వీ0.1’లో 350 కిలోవాట్ పవర్‌ను అందించే మోటార్ ఉంటుంది. ఈ తరహా పవర్‌ను అందించే తొలి భారత ఓఈఎం తమదేనని ట్రెసా మోటార్స్ ప్రకటించింది. యాక్సియల్ ఫ్లక్స్ మోటార్‌ను పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసినట్టు తెలిపింది. ‘‘దేశంలో 28 లక్షల ట్రక్కులు ఉన్నాయి. ఇవి 60 శాతం కాలుష్యానికి కారణమవుతున్నాయి. కనుక మధ్య స్థాయి నుంచి, భారీ తరహా ట్రక్కులు సున్నా ఉద్గార ఇంధనాల వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. 2024లో రానున్న వాహన తుక్కు విధానం, పెరుగుతున్న ఇంధన ధరలు ఎలక్ట్రిక్ ట్రక్కులకు అనుకూలించనున్నాయి. సురక్షిత, వినూత్న, పర్యావరణ పరిష్కారాలతో ఈ పరివర్తనాన్ని ట్రెసా ముందుండి నడిపిస్తుంది’’అని సంస్థ పేర్కొంది. -
ఎల్జీ, శాంసంగ్‌లకు పోటీగా మోటోరోలా ఫోన్
న్యూఢిల్లీ : శాంసంగ్, ఎల్జీలకు పోటీగా ఫాస్ట్ ప్రాసెసర్‌తో మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వెర్షన్‌ను లాంచ్ చేయాలని లెనోవో ప్లాన్ చేస్తోంది. పునరుద్ధరించబడిన మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో మోటోరోలా త్వరలోనే వినియోగదారులు ముందుకు తీసుకొస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అప్‌గ్రేడ్ అయిన ప్రాసెసర్, ఆండ్రాయిడ్ వెర్షన్‌తో ఈ హ్యాండ్సెంట్ ఇప్పటికే గీక్‌బెంచ్ బెంచ్మార్కులో లిస్టు అయిందట. ప్రస్తుత మోటో జెడ్ మోడల్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. తాజా వెర్షన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తో దీన్ని ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ నోగట్ ఓఎస్‌ను ఇది కలిగి ఉండబోతుందట. 4జీబీ ర్యామ్‌తో ఇది మార్కెట్లోకి వస్తుందని ఈ వెబ్సైట్ పేర్కొంటోంది. ఫ్యూచర్-ప్రూఫ్‌తో కొత్త ప్రాసెసర్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్, మంచి ర్యామ్ వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా లెనోవో ప్రణాళికలు రచిస్తోంది. అప్గ్రేడెట్ మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్ కచ్చితంగా ప్రస్తుతమున్న ఎల్జీ, శాంసంగ్ ఫ్లాగ్‌షిప్‌లకు గట్టిపోటీ ఇస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. శాంసంగ్ కొత్త గెలాక్సీ ఎస్8 కూడా క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తోనే మార్కెట్లోకి రాబోతుందని టాక్. గత అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన మోటో జడ్ స్మార్ట్ ధర రూ.39,999.