Launched India
-
కార్బన్ కొత్త స్మార్ట్‌ఫోన్...తక్కువ ధరలో
కార్బ్న్ బడ్జెట్ ధరలో మరోనూతన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ నెల ప్రారంభంలో ఆరా నోట్ ను గమనికను ప్రారంభించిన తర్వాత, కార్బన్ ఇప్పుడు ఇండియాలో ఎ 41 పవర్ ను ప్రారంభించింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారిత 4జీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వెబ్సైట్లో దర్శనమిచ్చింది. అయితే సంస్థ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ బ్లాక్-షాంపైన్, బ్లాక్-రెడ్, మరియు వైట్-షాంపన్ మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది. రూ.4,099కే ఈ ఫోన్ వినియోగదారులకు లభించనుంది. కార్బన్ ఎ41 పవర్ ఫీచర్లు 4 ఇంచ్ డిస్ప్లే 480 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్ 1 జీబీ ర్యామ్ 8 జీబీ స్టోరేజ్ 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 0.3మెగాపిక్సెల్ వీజీఏ సెల్ఫీ కెమెరా 4జీ వీవోఎల్టీఈ 2300 ఎంఏహెచ్ బ్యాటరీసామర్ధ్యం -
హెచ్‌టీసీ మరో కొత్త ఫోన్ విడుదల
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ హెచ్‌టీసీ భారత మార్కెట్లో తన జోరును కొనసాగిస్తోంది. ఇటీవలే 10 ప్రోను లాంచ్ చేసిన కంపెనీ తాజాగా మరో కొత్త స్మార్ట ఫోన్‌ను లాంచ్ చేసింది.'హెచ్‌టీసీ డిజైర్ 10 లైఫ్‌స్టైల్ ' పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసిన ఈ ఫోన్ ధరను రూ.15,990గా కంపెనీ నిర్ణయించింది. ప్రత్యేకంగా అమెజాన్ ఇండియా, హెచ్‌టీసీకి చెందిన ఈ-స్టోర్ ద్వారా అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది. భారత మార్కట్లలో స్టోన్ బ్లాక్, పోలార్ వైట్ రంగుల్లో డిజైర్ 10 లైఫ్‌స్టైల్ లభ్యం కానుండగా ఇతర మార్కెట్లలో రాయల్ బ్లూ, వాలంటైన్ లక్స్ రంగుల్లో లాంచ్ చేసినట్టు తెలిపింది. హెచ్‌టీసీ డిజైర్ 10 లైఫ్‌స్టైల్ ఫీచర్లు 5.5 ఇంచెస్ స్క్రీన్ 1.6 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 720x1280 ఎంపీ రిజల్యూషన్ 2జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత మెమొరీ 13ఎంపీ వెనుక కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఆండ్రాయిడ్ 6.0 2700 ఎంఏహెచ్ బ్యాటరీ