law amendment bill
-
పీరియడ్ ప్రొడక్టులు ఫ్రీగా అందిస్తున్న తొలి దేశం
పీరియడ్ పావర్టీ.. చాలా దేశాలను పట్టి పీడిస్తున్న సమస్య. ఆర్థికంతో ముడిపడిన విషయం కావడంతో.. చాలామంది పీరియడ్స్ ప్రొడక్టులకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అక్కడిదాకా ఎందుకు.. అసలు వాటి గురించి అవగాహన, మాట్లాడేందుకు మొహమాటం ప్రదర్శించే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే మహిళలకు నెలసరి విషయంలో పరిశుభ్రత పాటించకపోతే.. ఇబ్బందులు, అనారోగ్యాలు ఎదురవుతాయి. అంతేకాదు దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై ప్రభావం కూడా చూపిస్తుంది. అందుకే రుతుక్రమ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి.. పీరియడ్ ప్రొడక్టులను ఉచితంగా అందిస్తున్న తొలి ప్రపంచ దేశంగా నిలిచింది స్కాట్లాండ్. ఎడిన్బర్గ్: అవును.. యూరోపియన్ దేశం స్కాట్లాండ్ ఇవాళ్టి(ఆగష్టు 15వ తేదీ) నుంచి దేశం మొత్తం పీరియడ్ ప్రొడక్టులను ఉచితంగా అందిస్తోంది. తద్వారా ప్రపంచంలోనే ఈ చర్యకు ఉపక్రమించిన తొలి దేశంగా నిలిచింది. ఈ మేరకు ముందస్తుగా ఆదివారమే ఓ ప్రకటన చేసింది స్కాట్లాండ్ ప్రభుత్వం. స్కాట్లాండ్ ఉచిత పీరియడ్ ప్రొడక్ట్స్ చట్టం 2020లోనే తెర మీదకు వచ్చింది. శానిటరీ ఉత్పత్తులతో పాటు టాంపన్స్, శానిటరీ ప్యాడ్స్‌ను సైతం బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా అందుబాటులో ఉంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 2020లో స్కాటిష్ పార్లమెంట్ ఏకగ్రీవంగా చట్టానికి ఆమోదం కూడా వేసింది. అయితే.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు రుసుము లేకుండా శానిటరీ ఉత్పత్తులు ఇప్పటికే అందించబడ్డాయి, అయితే ఇప్పుడు బిల్లు.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూసుకునే బాధ్యత మంత్రులకు ఇచ్చింది. తద్వారా దేశంలో శానిటరీ ఉత్పత్తులు ఇకపై అందరికీ ఉచితంగా అందుబాటులోకి వస్తాయన్నమాట. అయితే ఈ చట్టం అంత ఈజీగా ఆచరణలోకి రాలేదు. చాలా పోరాటాలే జరిగాయి. ఉచిత పీరియడ్ ఉత్పత్తులకు ప్రాప్యతను అందించడం సమానత్వం, గౌరవానికి సంబంధించింది. వాటిని మహిళలు అంగీకరించడం ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది అని సామాజిక న్యాయ కార్యదర్శి షోనా రాబిసన్ చెప్తున్నారు. జీవన వ్యయ సంక్షోభం కారణంగా ప్రజలు కష్టతరమైన ఎంపికలు చేస్తున్న సమయంలో.. ఇది(ఈ సమస్య) గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యమైందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా పీరియడ్ ఉత్పత్తులకు ఎవరూ దూరంగా ఉండకూడదనే తమ ప్రభుత్వం ఉందని ఆమె తెలిపారు. ఇదీ చదవండి: బుజ్జి బుల్లిపిట్ట.. కానీ, నిలువెల్లా విషమే! -
సంస్కరణలకు ‘సవరణ’ దన్ను!
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల బాటలో కీలక చట్ట సవరణ బిల్లుకు బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (ఎల్ఎల్పీ) యాక్ట్ చట్ట సవరణలకు ఓకే చెప్పింది. ఇక బ్యాంకింగ్ డిపాజిటర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) యాక్ట్, 1961 సవరణకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ంది. రెండు అంశాలనూ వేర్వేరుగా పరిశీలిస్తే... ఎల్ఎల్పీ యాక్ట్.. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (ఎల్ఎల్పీ) చట్టంలో అనేక నిబంధనలకు కాలం చెల్లింది. ఆయా నిబంధనల కింద ఏదైనా తప్పు జరిగితే నేరపూరితంగా పరిగణించడం జరుగుతోంది. ఇలాంటి ఇబ్బందిని తొలగించడమే (డీక్రిమినలైజ్) ఎల్ఎల్పీ యాక్ట్ చట్ట సవరణ ప్రధాన ఉద్దేశ్యం. దేశంలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా వ్యాపార నిర్వహణకు (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ఎల్ఎల్పీ యాక్ట్‌లో పలు నిబంధనలను సవరించాలని పారిశ్రామిక వర్గాల నుంచి గత కొన్నేళ్లుగా డిమాండ్ ఉంది. ఈ చట్టం కింద నిబంధనలు పాటించడంలో విఫలమైన దాదాపు 2.30 లక్షల కంపెనీలు ప్రస్తుతం క్రిమినల్ చర్యలను ఎదుర్కొంటున్నాయి. కేంద్ర క్యాబినెట్ తాజా నిర్ణయం ఆయా కంపెనీలకు పెద్ద ఊరట. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, తాజా ఆమోదాల వల్ల చట్టంలోని పీనల్ ప్రొవిజన్స్ (శిక్షకు సంబంధించిన నిబంధనలు) 22కు తగ్గిపోతాయని తెలిపారు. కాంపౌండబుల్ (నేరుగా కక్షి దారులు పరిష్కరించుకోదగినవి) నేరాలకు సంబంధించిన నిబంధనలు ఏడుకు, నాన్–కాంపౌండబుల్ నిబంధనలు మూడుకు తగ్గుతాయని పేర్కొన్నారు. ఇక ఇన్–హౌస్ అడ్జూడికేషన్ యంత్రాగం (ఐఏఎం) కింద పరిష్కరించుకోగలిగిన వివాదాల నిబంధనలు కేవలం 12గా ఉంటాయని పేర్కొన్నారు. ఎల్ఎల్పీ యాక్ట్ 81 సెక్షన్లు, 4 షెడ్యూళ్లను కలిగిఉంది. డీఐసీజీసీ చట్టం... ఒక బ్యాంకు మూతపడే సందర్భాల్లో ఆ బ్యాంకులో ఉన్న తన మొత్తం డిపాజిట్లో కేవలం లక్ష రూపాయలను మాత్రమే డిపాజిట్ దారుడు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) యాక్ట్ కింద తిరిగి పొందగలుగుతున్నాడు. అయితే ఈ కవరేజ్‌ని ఐదు రెట్లు అంటే రూ.5 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఐసీజీసీ యాక్ట్, 1961ను సవరిస్తున్నట్లు 2021–22 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► చట్ట సవరణ ప్రకారం, మారటోరియం కింద ఉన్న డిపాజిట్ సొమ్ములో 5 లక్షల వరకూ డిపాజిటర్ 90 రోజుల్లో పొందగలుగుతాడు. ► పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ), యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి, డిపాజిటర్లు తీవ్ర ఇబ్బందుల్లో పడిన నేపథ్యంలో కేంద్రం డీఐసీజీసీ చట్ట సవరణ బిల్లు, 2021కు ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు ఆమోదం వేలాది మంది డిపాజిటర్లకు ప్రయోజనం చేకూర్చనుంది. ► ఈ బిల్లును వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తెలిపారు. ► నిజానికి ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, 5 లక్షల వరకూ డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉంది. అయితే బ్యాంక్ లైసెన్స్ రద్దయి, లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభమైతేనే ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ అమల్లోకి వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒత్తిడిలో ఉన్న బ్యాంక్ నుంచి తమ డబ్బు రాబట్టుకోడానికి దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల కాలం పడుతోంది. ► బ్యాంక్ డిపాజిటర్లకు బీమా కవరేజ్ అందించడానికి ఆర్బీఐ అనుబంధ విభాగంగా డీఐసీజీసీ పనిచేస్తోంది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ బ్యాంక్ బ్రాంచీలుసహా కమర్షియల్ బ్యాంకుల సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్, రికరింగ్ డిపాజిట్ హోల్డర్లందరికీ డీఐసీజీసీ కింద బీమా సదుపాయం లభిస్తుంది. ► తాజా సవరణ ప్రకారం అసలు, వడ్డీసహా గరిష్టంగా బ్యాంకుల్లో ప్రతి అకౌంట్ హోల్డర్ డిపాజిట్‌పై రూ.5 లక్షల వరకూ బీమా కవరేజ్ ఉంటుంది. అంటే వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు ఐదు లక్షలకుపైబడి ఉన్నా... మొత్తంగా ఐదు లక్షల వరకే బీమా లభిస్తుంది. ► తాజా క్యాబినెట్ నిర్ణయంతో దేశంలోని దాదాపు 98.3% డిపాజిట్ అకౌంట్లకు పూర్తి ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. విలువలో చూస్తే 50.9% డిపాజిట్ల విలువకు కవరేజ్ లభిస్తుంది. ఆర్థిక మంత్రి తెలిపిన సమాచారం ప్రకారం, అంతర్జాతీయంగా చూస్తే, ఆయా అంశాల్లో భారత్ మెరుగైన పరిస్థితిలో ఉంది. అంతర్జాతీయంగా 80 శాతం డిపాజిట్ అకౌంట్లకే కవరేజ్ లభిస్తుంటే, విలువలో ఈ కవరేజ్ 20 నుంచి 30%గా ఉంది. ► ప్రస్తుతం రూ.100 డిపాజిట్‌కు ప్రతి బ్యాంక్ 10 పైసలు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుండగా, దీనిని 12 పైసలకు పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ► 2020 ఫిబ్రవరి 4వ తేదీ నుంచీ రూ. 5 లక్షల వరకూ డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అమలు జరుగుతుందని మంత్రి వివరించారు. -
ఎల్ఐసీలో వాటా విక్రయం 25%
జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తోందన్న వార్తలు రాగానే భారత్‌లో ఇదే అతి పెద్ద ఐపీఓ అనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే అందరి అంచనాలను మించిన ఐపీఓ ఇదే కానున్నదని సమాచారం. ఐపీఓ ద్వారా 10% వాటాను కేంద్రం విక్రయించగలదని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఐపీఓ ద్వారా 25% వాటా విక్రయించే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఒకేసారి 25 శాతాన్ని విక్రయిస్తారా, లేక 2–3 దఫాలుగా విక్రయిస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత లేదు. అయితే రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి షేర్ ధరలో డిస్కౌంట్‌ను ఇవ్వాలని, బోనస్ షేర్లను కూడా జారీ చేయాలని ఒక ముసాయిదా కేబినెట్ నోట్ సిఫార్సు చేసిందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఆర్థిక సేవల విభాగం ఇటీవలే ఎల్ఐసీ ఐపీఓకు సంబంధించి ఒక ముసాయిదా కేబినెట్ నోట్‌ను రూపొందించింది. ఎల్ఐసీలో ప్రభుత్వానికున్న 100% వాటాను 75%కి తగ్గించుకోవాలని, 25 శాతాన్ని దశలవారీగా విక్రయించాలని ఈ ముసాయిదాలో ప్రతిపాదించారు. కరోనా కల్లోలంతో ప్రభుత్వానికి రాబడి తగ్గింది. బడ్జెట్ లోటు మరింతగా పెరిగింది. ఈ సమస్యను ఎల్ఐసీ ఐపీఓతో అధిగమించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముసాయిదా కేబినెట్ నోట్లో ఏముందంటే... ► ఎల్ఐసీ ఐపీఓకు సంబంధించి ఒక ముసాయిదా కేబినెట్ నోట్‌ను ఆర్థిక శాఖ ఆధ్వర్వంలోని ఆర్థిక సేవల విభాగం రూపొందించింది. సంబంధిత కేంద్ర మంత్రులు, సెబీ, నీతి ఆయోగ్, ఐఆర్డీఏఐ పరిశీలన నిమిత్తం ఈ ముసాయిదాను తయారు చేసింది దీని ప్రకారం... ► ఎల్ఐసీలో ప్రభుత్వానికున్న వంద శాతం వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలనుకుంటున్న 25 శాతం వాటాను ఒకేసారి గానీ, దశలవారీ గానీ విక్రయించాలి. ► ఎల్ఐసీ ఐపీఓకు సంబంధించిన ఇష్యూ ధరలో రిటైల్ ఇన్వెస్టర్లకు, ఎల్ఐసీ ఉద్యోగులకు 10 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఇవ్వాలి. ► ఎల్ఐసీ లిస్టయిన తొలి రోజుల్లోనే బోనస్ షేర్లను జారీ చేయాలి. ► దీనికి సంబంధించి 1956 నాటి ఎల్ఐసీ చట్టంలో మొత్తం ఆరు సవరణలను చేయాల్సి ఉంటుంది. కేబినెట్ ఆమోదిస్తే రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎల్ఐసీ చట్ట సవరణల బిల్లును కేంద్ర ం తెచ్చే అవకాశాలున్నాయి. లోక్‌సభలో తగినంత మెజారిటీ ఉన్నందున దీన్ని ద్రవ్యబిల్లుగా ప్రవేశపెట్టి ఆమోదం పొందాలనేది సర్కారు ప్రణాళిక. 10 శాతం డిస్కౌంట్!! ఎల్ఐసీ ఐపీఓలో 10 శాతం వాటానే విక్రయించి, ఆ తర్వాత ఒకటి లేదా రెండు దఫాల్లో మిగిలిన 15 శాతం మేర వాటాను విక్రయించే అవకాశాలే అధికంగా ఉన్నాయని నిపుణులంటున్నారు. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టయిన తర్వాత కనీస ప్రజా వాటాను మూడేళ్లలో 25 శాతం మేర తగ్గించుకోవాలన్న సెబీ నిర్ణయమే దీనికి ఆధారమని వారంటున్నారు. ఇక రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఇష్యూ ధరలో 10 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఇచ్చే అవకాశాలున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు ఎల్ఐసీ ఉద్యోగులకు కూడా ఈ డిస్కౌంట్ లభించవచ్చు. బోనస్ షేర్ల బొనంజా...! ఎల్ఐసీ చెల్లించిన మూలధనం రూ.100 కోట్లు. ఇంత పెద్ద కంపెనీకి ఇంత చిన్న మూలధనం సమంజసం కాదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకనే బోనస్ షేర్లు జారీ చేయడం ద్వారా కంపెనీ రిజర్వ్‌లను పాక్షికంగానైనా మూలధనంగా మార్చుకునే వీలు కలుగుతుందని, ఆ విధంగా చెల్లించిన మూలధనం పునర్వ్యస్థీకరించుకునే వీలు కలుగుతుందని ప్రభుత్వ ఆలోచన. బోనస్ షేర్లను జారీ చేయడం వల్ల రిజర్వ్(మిగులు నిధుల)ను మూలధనంగా మార్చుకునే వెసులుబాటుతో పాటు, రిటైల్ ఇన్వెస్టర్లను ఇట్టే ఆకర్షించవచ్చు కూడా ! ఐపీఓ సైజు ఎంత? ఎల్ఐసీ సంస్థ విలువ రూ.8 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల రేంజ్లో ఉండొచ్చని ఒక అంచనా. 10% వాటా విక్రయం ప్రకారం.. ఐపీఓ సైజు రూ.80,000 కోట్ల నుంచి లక్ష కోట్ల రేంజ్లో ఉండొచ్చనేది గత అంచనా. తాజా వార్తల ప్రకారం ఇష్యూ సైజు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. -
రెండు చట్టసవరణ బిల్లులకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ గురువారం రెండు చట్టసవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. తెలంగాణ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలి ఫికేషన్ యాక్ట్–1953 చట్టానికి.. భూదాన్ అండ్ గ్రామ్‌దాన్ యాక్ట్ 1965 చట్టానికి సవర ణలను ఆమోదించింది. అయితే భూదాన్ చట్ట సవరణపై ఎమ్మెల్యే చిన్నారెడ్డి అభ్యం తరం వ్యక్తం చేశారు. భూదాన్ చట్టం కింద కేటాయించిన భూమి పట్టణ ప్రాంత పరిధి లోకి వచ్చినప్పుడు, లేదా వ్యవసాయ భూమిగా లేనప్పుడు ఆ భూమిని బోర్డు తీసు కుంటుందన్న నిబంధనలను తప్పుబట్టారు. భూదాన్ భూములను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకే ఈ సవరణ చేపట్టారని ఆరోపించారు. ఇటీవల గాంధీభవన్‌లో ఉన్న భూదాన్ బోర్డు కార్యాలయం తలుపులను పోలీసులు అర్ధరాత్రి పగలగొట్టి ఫైళ్లు పట్టుకెళ్లారని పేర్కొన్నారు. అయితే దీనిపై ప్రభుత్వ విప్ జి.సునీత కల్పించుకుని సభను తప్పుదోవ పట్టించవద్దని వ్యాఖ్యానించారు. చిన్నారెడ్డి స్పందిస్తూ.. సునీతను ‘ఆవిడ’ అంటూ సంబోధించడంతో అధికార పక్షం అభ్యంతరం తెలిపింది. మహిళ సభ్యురాలిని ఆవిడ అని సంబోధించడం సరి కాదని, క్షమాపణ చెప్పాలని హరీశ్ పేర్కొన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ కల్పించుకుని శాంతింపజేశారు. సెలెక్ట్ కమిటీకి నివేదించండి.. గందరగోళం తగ్గాక.. భూదాన్ అంశంపై నేరుగా ప్రశ్న అడగాలని చిన్నారెడ్డికి స్పీకర్ సూచించారు. దీంతో చిన్నారెడ్డితోపాటు ప్రతిపక్ష నేత జానారెడ్డి కల్పించుకుని.. భూదాన్ చట్ట సవరణ బిల్లును ఆమోదిం చకుండా సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కోరారు. దీనిపై డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక రూల్స్‌లో దళితులు, ప్రభుత్వ అవసరాలకు భూములను కేటాయించేలా నిబంధనలను పొందుపరిచే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. దీంతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. ఇక వేతనాల చెల్లింపు, పెన్షన్‌కు సంబంధించిన బిల్లులో వక్ఫ్ బోర్డు చైర్మన్‌కు వేతనం చెల్లించే అంశాన్ని పొందుపరచడం పట్ల బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. -
మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు
♦ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం ♦ మద్దతు ప్రకటించిన విపక్షాలు ♦ మహిళలకూ కోటా కావాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి ♦ అంగీకరించిన ముఖ్యమంత్రి.. అప్పటికప్పుడు బిల్లుకు సవరణ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఇక రిజర్వేషన్ విధానం అమలు కానుంది. పాలకమండళ్ల నియామకం విషయంలో రిజర్వేషన్లకు అవకాశం కల్పించేలా చట్టసవరణ చేస్తూ ప్రతిపాదించిన బిల్లుకు మంగళవారం శాసనసభ ఆమోదముద్ర వేసింది. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి విధానం మరెక్కడా లేదని ప్రభుత్వం పేర్కొనగా, ఈ బిల్లుకు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో సభ ఏకగ్రీవంగా దీనికి ఆమోదం తెలిపింది. కేవలం కులాలవారీగా రిజర్వేషన్లను బిల్లులో పొందుపరచగా, అందులో మహిళలకూ రిజర్వేషన్ ద్వారా చోటు కల్పించాలన్న కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి సూచనను సభ పరిగణనలోకి తీసుకుంది. దాన్ని బిల్లులో పొందుపరచాల్సిందిగా సభా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సూచించడంతో అప్పటికప్పుడు సవరణ చేసి ఆమోదించడం విశేషం. విపక్షాలు చేసే ఇలాంటి మంచి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, ఇదేవిధంగా బంగారు తెలంగాణకు అంతా కలసి కృషి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం డాక్టర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లుల ఆమోదం అయిన వెంటనే మంత్రి హరీశ్‌రావు మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం విషయంలో సామాజిక న్యాయం పాటించేలా రిజర్వేషన్ విధానం అమలు చేయటాన్ని స్వాగతిస్తున్నట్టు కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి పేర్కొన్నారు. అయితే కులపరమైన రిజర్వేషన్లతో సరిపుచ్చకుండా లింగభేదాన్ని కూడా అందులో చేరిస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. దానికి వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ‘చిన్నారెడ్డి మంచి సూచన చేశారు. మహిళలకు ప్రాధాన్యం అవసరం. 33 శాతం కోటాను వారికి కేటాయించేలా మార్చి బిల్లుకు ఆమోదం తెలిపితే బాగుంటుంది’ అంటూ స్పీకర్‌ను కోరారు. ఆయన సూచన మేరకు సిబ్బంది అప్పటికప్పుడు బిల్లుకు సవరణ చేశారు. గుజరాత్లో అమలులో ఉన్నట్టు రైతులే పాలకమండలిని ఎన్నుకునే విధానం అందుబాటులోకి తేవాలని చిన్నారెడ్డి సూచించారు. ముందుగా రిజర్వేషన్ల ప్రకారం కొత్త కమిటీలు వేసి మార్కెట్లను పటిష్ట పరచిన తర్వాత దాన్ని పరిశీలిద్దామని ముఖ్యమంత్రి సభ దృష్టికి తెచ్చారు. మహిళల కోటా ప్రకటించటం పట్ల అధికార పక్ష సభ్యురాలు సురేఖ హర్షం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లలో మైనారిటీలను కూడా చేర్చాలని దేశం సభ్యుడు సండ్ర సూచించగా, ఆ విషయం బిల్లులో ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మహిళలకూ మార్కెట్ కమిటీలో చోటు కల్పించేలా రిజర్వేషన్ అమలు చేయాలని తాము ప్రతిపాదిద్దామనుకున్న తరుణంలో స్వయంగా ముఖ్యమంత్రే స్పందిం చటం సంతోషంగా ఉందని బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఇది మంచి నిర్ణయమని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్, మజ్లిస్ సభ్యుడు జాఫర్ హుస్సేన్‌లు పేర్కొన్నారు. మార్కెట్‌యార్డులలో ఆన్లైన్ విధానం: హరీశ్‌రావు లోపభూయిష్టంగా ఉన్న మార్కెట్‌యార్డులను పటిష్టపరిచి అక్రమాలకు తావులేకుండా ఆన్లైన్ విధానాన్ని ప్రారంభిస్తున్నామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా గడ్డిఅన్నారం, బోయిన్పల్లి మార్కెట్లలో ప్రవేశపెడితే వాటి ఆదాయం పెరిగిందని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు. రూ. 1,024 కోట్లతో కొత్తగా గోడౌన్లు నిర్మిస్తున్నామని, త్వరలో కొన్ని మార్కెట్లలో కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తామని వెల్లడించారు. సీఎంకు మహిళా ఎమ్మెల్యేల కృతజ్ఞతలు మహిళల సంక్షేమానికి పాటు పడడంతో పాటు వారికి సముచిత గౌరవం దక్కేవిధంగా మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించినందుకు టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లకు సంబంధించి సభలో బిల్లు పాసయిన అనంతరం టీ విరామ సమయంలో డిప్యూటీ స్పీకర్పద్మా దేవేందర్‌రెడ్డి, వి.సునీత, కొండా సురేఖ, బొడిగె శోభ, కోవా లక్ష్మి, అజ్మీరా రేఖా నాయక్ తదితరులు సీఎం చాంబర్లో కేసీఆర్‌ను కలిశారు. సీఎం నిర్ణయాలు తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో పెంచే విధంగా ఉన్నాయని వారన్నారు.