Lawyers Attack
-
మహిళా జడ్జీకి లాయర్ల బెదిరింపు
తిరువనంతపురం: కొందరు లాయర్లు తనను బెదిరించారంటూ ఓ మహిళా జడ్జీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 12 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఓ నిందితుడి బెయిల్ రద్దు విషయమై మాట్లాడేందుకు తన చాంబర్‌కు వచ్చిన లాయర్లు చట్టవిరుద్ధంగా ప్రవర్తించారంటూ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ దీపా మోహన్ లిఖిత పూర్వకంగా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ ఫిర్యాదును పోలీసులకు పంపారు. దీనిపై స్పందించిన పోలీసులు తిరువనంతపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌తోపాటు 12 మందిపై దాడి, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం వంటి నేరాల కింద పలు కేసులు పెట్టారు. ‘ఒక నిందితుడి బెయిల్ రద్దు, రిమాండ్‌పై చర్చించేందుకు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేపీ జయచంద్రన్ మరికొందరితో కలిసి నా బాంబర్‌కు వచ్చారు. సదరు నిందితుడి రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేస్తారా లేదా అంటూ బెదిరించారు. మహిళ కాకపోయుంటే మిమ్మల్ని కొట్టి ఉండేవాళ్లం. బయటికి వస్తే అంతుచూస్తామంటూ జయచంద్రన్ వెళ్లిపోయారు’అని బాధిత జడ్జీ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర జ్యుడీషియల్ అధికారుల సంఘం కేరళ హైకోర్టులో పిటిషన్ వేసింది. కాగా, మహిళా జడ్జీ ఆరోపణలన్నీ అబద్ధాలేనంటూ తిరువనంతపురం బార్ అసోసియేషన్ శుక్రవారం విధులు బహిష్కరించింది. -
'షూట్ చేయండి... ఉరి తీయండి'
న్యూఢిల్లీ: 'అతడిపై మేము దాడికి పాల్పడ్డాం' అని జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్‌పై దాడిని చేసిన లాయర్లు గర్వంగా ప్రకటించుకున్నారు. రాజద్రోహం కేసు విచారణ కోసం బుధవారం పటియాలా హౌస్ కోర్టుకు తీసుకువచ్చిన కన్హయ్యపై న్యాయవాదులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దాదాపు 200 మంది లాయర్లు అతడిని చుట్టుముట్టి నినాదాలు చేశారు. 'అతడిని కాల్చి చంపండి, ఉరి తీయండి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. అక్కడితో ఆగకుండా అతడిపై దాడికి ప్రయత్నించారు. 'మా పని పూర్తయింది' అంటూ దాడి చేసిన లాయర్లు వ్యాఖ్యానించారు. న్యాయవాదుల దాడిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించలేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. జర్నలిస్టులు, విద్యార్థులపై సోమవారం దాడి చేసిన న్యాయవాదుల్లో చాలా మంది ఈ రోజు దాడి చేసిన వారిలో ఉన్నారని చెబుతున్నారు. లాయర్ల దాడిలో కన్హయ్య కుమార్(28)కు గాయాలయ్యాయని వార్తలు వస్తున్నాయి. పటియాలా హౌస్ కోర్టులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో శాంతి భద్రతలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆరుగురు ప్రముఖ లాయర్లతో కూడిన బృందాన్ని పటియాలా కోర్టుకు పంపించింది. -
తులసి రెడ్డిపై న్యాయవాదుల దాడి
కర్నూలు: 20 సూత్రాల అమలు పథకం చైర్మన్ ఎన్.తులసిరెడ్డికి కర్నూలులో చేదు అనుభవం ఎదురైంది. సమైక్యాంధ్రవాదులైన న్యాయవాదులు అతనిపై దాడి చేశారు. అతని వాహనం ధ్వంసం చేశారు. జెఎసి న్యాయవాదులపై తులసి రెడ్డి అనుచరులు ఎదురు దాడికి దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాటసాని రాంభూపాల్ రెడ్డి దీక్షా శిబిరం వద్దకు తులసిరెడ్డి వెళ్లారు. ఆ సమయంలో సీమాంధ్ర న్యాయవాదుల జెఎసి నేతలు పదవికి రాజీనామా చేయాలని తులసి రెడ్డిపై దాడికి దిగారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, తులసిరెడ్డి పరస్పరం దూషించుకున్నారు.