గ్రామ గ్రామం ఇక ‘లక్ష్మీ’ గ్రామం
ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమైన కార్యక్రమం అంచెలంచెలుగా ఎదిగి ఆదర్శంగా వెలిసిన గ్రామమే మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని లక్ష్మీనగర్ గ్రామం. ఒకప్పుడది ఏ సౌకర్యాలూ లేనిదే.. కానీ అందరూ ఒక్కటై ఆలోచనలు పంచుకొని, ఆధునికతను సొంతం చేసుకొని నిర్మించుకుని, నేడు అన్నీ ఉన్న గ్రామం లక్ష్మీనగర్ గ్రామం. 900 మంది జనాభా ఉన్న ఈ చిన్న గ్రామం నేడు అభివృద్ధితో అందరినీ ఆకర్షిస్తోంది. ఆలయా లు, విద్యాలయాలు, వైద్యశాలలు, సహకార సంఘ భవనం, లక్ష్మీనగర్ వెల్ఫేర్ సొసైటీ, తాగునీటి ప్లాంట్, మిల్క్ సొసైటీ, సోలార్ వీధి లైట్లు, ప్లాస్టిక్ నిర్మూలన, ముఖ్యంగా మద్యం అమ్మకం నిషేధం వంటి ప్రజల సంక్షేమ కార్యక్రమాలతో నేడు ప్రపంచానికి ఆదర్శంగా ఉండటం లక్ష్మీనగర్ గ్రామ గొప్పతనం.
కర్తవ్య నిర్వహణలో వెనుకంజ వేయకుండా ఉత్సాహంతో ప్రగతి మార్గంలో ముందుకు నడవ డంలో లక్ష్మీనగర్ గ్రామం నిజంగానే తరతరాలకు ఆదర్శ గ్రామమే. మంచినీటి ప్లాంటు ఏర్పాటు, మ ద్యం అమ్మకాలు నిషేధం, మంజీర పాల సమాఖ్య ఏర్పాటు, మహిళా మండలి భవన నిర్మాణం, గ్రామా భివృద్ధి కమిటీలు, గ్రామంలో జెనరిక్ మందుల దుకా ణం, సౌరశక్తితో గృహ, వ్యవసాయ అవసరాలు తీర్చే విద్యుత్‌ని ప్రోత్సహించడం, ఇంకుడు గుంతల్ని ప్రోత్సహించడం, ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కి పనికొచ్చే డంప్ యార్డు నిర్మాణం, లక్ష్మీనగర్ కమ్యూనిటీ మెడిటేషన్ హాల్, లైబ్రరీ, ఆర్ఎంపీ హాస్పిటల్, స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు, వెటర్నరీ హాస్పిటల్, రైతు మహిళా సంఘా ల ఏర్పాటు..ఇలాంటి సామాజిక ప్రయోజన ప్రణా ళికలు ఎన్నో ఆచరణలోకి రావటం ఈ గ్రామం ప్రత్యే కత. ఫ్లోరైడ్ ఇబ్బందుల్ని అధిగమించే నీటి శుద్ధీకరణ ప్లాంట్. 20 లీటర్ల మంచినీరు కేవలం రూ.3 లకే అందించటం. తక్కువ పెట్టుబడితో ప్రజలకు మంచి నీరందించడం అనేది మామూలు విషయం కాదు. మంజీర పాల సమాఖ్య ఏర్పాటుతో 10 మంది స్త్రీలతో కూడిన సొసైటీ ద్వారా మధ్యవర్తుల ప్రమే యం లేకుండా నేరుగా ప్రభుత్వ డైరీ అయిన ‘విజ య’ డైరీకి పాల సరఫరాతో ఎందరో మహిళలు నేడు ఆర్థిక లాభాలు గడించారు. గ్రామంలో ఆలయాల పునరుద్ధరణ, సేంద్రియ వ్యవసాయం. గ్రామం నిం డా మొక్కలు నాటి పెంచడం. గ్రామాభివృద్ధికి సం బంధించి ఇవి చాలా మంచి పనులు. వీరి కృషికి మన కు చేతనైనంత సహకరిద్దాం. మన గ్రామాన్ని కూడా మరో లక్ష్మీనగర్ గ్రామంగా తీర్చి దిద్దుకుందాం. ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో దివ్యమైన ప్రణాళికలతో ప్రగతి వైపు దూసుకుపోతున్న ఆదర్శ గ్రామం లక్ష్మీ నగర్ గ్రామ అభివృద్ధికై ఎవరైనా ఆర్థికంగా సహ కరించాలనుకుంటే వారి బ్యాంకు ఖాతాకు జమ చేయవచ్చు.
Laxmi Nagar Welfare Society. Special Savings Account. A/c. No. 223101000627. IFSC Code: ICIC0002231, Papannapet Mandal, Medak District, Pin: 502125.
(వ్యాసకర్త మాజీ ఎంపీ, నిజామాబాద్,
సెల్: 7702941017
- ఎం.నారాయణరెడ్డి