గోమాతకు శ్రీమంతం | cow sreemantham im medak district | Sakshi
Sakshi News home page

గోమాతకు శ్రీమంతం

Published Thu, Feb 18 2016 8:10 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

గోమాతకు శ్రీమంతం

గోమాతకు శ్రీమంతం

పాపన్నపేట: మాతృత్వం ఓ వరం. ప్రసవం పునర్జన్మతో సమానం. అందుకే గర్భం దాల్చిన మహిళను ఇంటిల్లిపాది అపురూపంగా చూసుకుంటారు. ఐదో నెలలో శ్రీమంతం చేసి రకరకాల తినుబండారాలు చేసిపెట్టడం ఆనవాయితీ. అయితే లక్ష్మీనగర్ గ్రామ మహిళలు మాత్రం కాస్తా వెరైటీగా ఆలోచించి గోమాతకు శ్రీమంతం చేసి తమ జంతుప్రేమను చాటుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మినగర్‌లో గ్రామస్తులు తమదైన రీతిలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల గ్రామపుట్టినరోజు కార్యక్రమం నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే పవిత్రంగా పూజించే గోమాతకు గురువారం శ్రీమంతం చేశారు. మహిళలంతా ఒకచోటచేరి గోమాతను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి తినుబండారాలు చేసి పెట్టారు. 'గ్రామీణ అన్నదాతలకు ఆవు బహుళ ప్రయోజనకారి. అందుకే నోరులేని ఆ సాధుజంతువుకు అపురూపమైన ఆతిథ్యం ఇవ్వాలనే ఆలోచన తమకు వచ్చింది' అని మహిళలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement