leaders appointment
-
వైఎస్సార్ సీపీలో పలువురికి బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ నియమితులయ్యారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాకు చెందిన నాయకులను పార్టీలోని వేర్వేరు హోదాల్లో నియమించినట్టు సోమవారం వైఎస్సార్ సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. పసుపులేటి ఉషాకిరణ్, సనపల చంద్రమౌళి, సత్తి రామకృష్టా రెడ్డిలను రాష్ట్ర కార్యదర్శులుగా నియమించినట్టు వెల్లడించింది. విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గ సింగిల్ కో- ఆర్డినేటర్‌గా కమ్మిల కన్నపరాజును నియమించింది. -
వైఎస్సార్సీపీలో పదవుల నియామకం
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీలో పలు పదవుల నియామకం చేపట్టింది. రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పదవితో పాటు ఐటీ విభాగంలో పలువురు నాయకులను నియమించింది. ఈ మేరకు శనివారం వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. లీగల్ సెల్ కన్వీనర్‌గా పాలెం రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. చాలా ఏళ్లుగా పాలెం రఘునాథ్ రెడ్డి దివంగత సీఎం వైఎస్ఆర్ కుటుంబీకులను విధేయుడిగా ఉంటూ వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లి, పార్టీ అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తానని చెప్పారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కటుకూరి సురేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా బాదం నరేష్ గుప్త, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా పేరం నవీన్ కుమార్, మునగాల జగన్మోహన్ రెడ్డి, వరంగల్ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడుగా సి. హరికృష్ణారెడ్డిలను నియమిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం అధ్యక్షుడు శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు. -
వైఎస్సార్సీపీలో పదవుల నియామకం
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీలో పలు పదవుల నియామకం చేపట్టింది. రాష్ట్ర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా మందడపు వెంకటరామిరెడ్డి, అలస్యం సుధాకర్, వేమారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మందాడపు వెంకటేశ్వర్లు, జిల్లపల్లి సైదులు, కొల్ల వెంకట్‌రెడ్డి లను నియమించింది. సంయుక్త కార్యదర్శులుగా బండ్ల సోమిరెడ్డి, తుమ్మటి నర్సిరెడ్డి, వనమారెడ్డి నాగిరెడ్డి, పులి సైదులు, కుర్సమ్ సత్యనారాయణలు నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఈ నియామకాలు జరిపినట్లు తెలిపారు. పదవులకు ఎంపికైన వారిని గట్టు శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. -
వైఎస్సార్సీపీ పదవుల నియామకం
హైదరాబాద్: తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు విభాగాల్లో నేతలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా బోయినపల్లి శ్రీనివాసరావు, గుండెరెడ్డి రాంభూపాల్ రెడ్డిని నియమించింది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన పారిపెల్లి వేణుగోపాల్ రెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా అదే జిల్లాకు చెందిన నందమల్ల నరేష్ ను నియమించబడ్డారు. రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులుగా రంగారెడ్డి జిల్లాకు కె.విశ్వనాథ్ చారిని నియమించింది. కొత్తగా నియమించబడిన నేతలకు పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.