వైఎస్సార్‌ సీపీలో పలువురికి బాధ్యతలు | YSRCP Visakhapatnam Few Posts Appointed | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో పలువురికి బాధ్యతలు

Published Mon, Jun 25 2018 8:47 PM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

YSRCP Visakhapatnam Few Posts Appointed - Sakshi

వైఎస్సార్‌ సీపీలో పలువురికి బాధ్యతలు

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ నియమితులయ్యారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాకు చెందిన నాయకులను పార్టీలోని వేర్వేరు హోదాల్లో నియమించినట్టు సోమవారం వైఎస్సార్‌ సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. పసుపులేటి ఉషాకిరణ్‌, సనపల చంద్రమౌళి, సత్తి రామకృష్టా రెడ్డిలను రాష్ట్ర కార్యదర్శులుగా నియమించినట్టు వెల్లడించింది. విశాఖపట్నం నార్త్‌ అసెంబ్లీ నియోజకవర్గ సింగిల్‌ కో- ఆర్డినేటర్‌గా కమ్మిల కన్నపరాజును నియమించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement