ఆ విషయంలో ముందున్న ఇండియన్ కంపెనీలు.. అమెరికా కూడా మన తర్వాతే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్యాలయాల కోసం స్థలాన్ని లీజుకు తీసుకున్న కంపెనీల్లో భారతీయ సంస్థలే ముందంజలో ఉన్నాయని సీబీఆర్ఈ ఇండియా నివేదిక వెల్లడింంది. దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన నగరాల్లో 2023 జనవరి - మార్చిలో స్థల లీజింగ్‌లో అమెరికా కంపెనీలను ఇక్కడి సంస్థలు వెనక్కి నెట్టాయని తెలిపింది. దాదాపు డిసెంబర్ త్రైవసికం మాదిరిగానే జనవరి - మార్చిలో మొత్తం డిమాండ్‌లో భారతీయ సంస్థల వాటా ఏకంగా 50 శాతం ఉంది. 2022లో తొలిసారిగా అమెరికన్ కంపెనీలను మించి భారతీయ సంస్థలు ఎక్కువ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2023 మార్చి త్రైమాసికంలో స్థల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 9 శాతం ఎగసి 1.26 కోట్ల చదరపు అడుగులు నవెదైంది.
నగరాల వారీగా ఇలా..
స్థల ఆఫీస్ స్థల లీజింగ్‌లో బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నైల వాటా 62 శాతం ఉంది. హైదరాబాద్ స్థిరంగా 14 లక్షల చదరపు అడుగుల డిమాండ్‌ను చూసింది. ఢిల్లీ ఎన్సీఆర్ స్వల్పంగా పెరిగి 24 లక్షలు, ముంబై రెండింతలై 16 లక్షలు, చెన్నై స్వ ల్పంగా అధికమై 20 లక్షలు, పుణే కొద్దిగా పెరిగి 12 లక్షల చదరపు అడుగులు నమోదైంది. బెంగళూరు స్వల్పంగా తగ్గి 35 లక్షల చదరపు అడుగులుగా ఉంది. 2022లో స్థల ఆఫీస్ లీజింగ్ 40 శాతం అధికమై 5.66 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. ఇందులో దేశీయ కంపెనీల వాటా 2.77 కోట్ల చదరపు అడుగులు కాగా, అమెరికా కంపెనీలు 2 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని తీసుకున్నాయి.
భిన్న పరిస్థితులు..
అంతకు ముందు త్రైమాసికాల్లో సాంకేతిక రంగ కంపెనీలే ముందు వరుసలో ఉండేవి. అందుకు భిన్నంగా జనవరి–మార్చిలో బీఎఫ్ఎస్ఐ, ఫ్లెక్సిబుల్ స్పేస్ కంపెనీలు చెరి 22 శాతం వాటాతో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. టెక్నాలజీ కంపెనీలు 20 శాతం, ఇంజనీరింగ్, తయారీ 11, పరిశోధన, కన్సల్టింగ్, అనలిటిక్స్ కంపెనీలు 10 శాతం వాటాకు పరిమితం అయ్యాయి. మధ్య, భారీ స్థాయి డీల్స్‌లో బీఎఫ్ఎస్ఐ కంపెనీల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, భారతీయ బ్యాంకులు, ఫ్లెక్స్ కంపెనీలు ముందంజలో ఉన్నాయి. బీఎఫ్ఎస్ఐ కంపెనీల వాటా డిసెంబర్ క్వార్టర్లో 20 శాతం ఉంటే, మార్చిలో ఇది 44 శాతానికి ఎగబాకింది.
రెండవ భాగంలో..
ద్రవ్య నియంత్రణ, ద్రవ్యోల్బణం, అభివృద్ధి చెంది న దేశాలలో మందగమన అవకాశాలు, భౌగోళిక రాజకీయ సమస్యల కారణంగా ఏర్పడే స్వల్పకాలిక స్థల ఆర్థిక ఒత్తిడి 2023లో కంపెనీల విస్తరణ ప్రణాళికలు, నిర్ణయాలపై ప్రభావం చూపవచ్చు. అయితే బహుళజాతి సంస్థల లీజింగ్ నిర్ణయాలపై ఈ పరిస్థితుల ప్రభావం ఇంకా గుర్తించలేదని సీబీఆర్ఈ తెలిపింది. లీజింగ్ కార్యకలాపాలు ముఖ్యంగా ఈ ఏడాది రెండవ భాగంలో పుంజుకోవచ్చు, ఎందుకంటే భారతదేశం అధిక నైపుణ్యం కలిగిన ప్రతిభకు ఆకర్షణీయ, సరసమైన మూలంగా కొనసాగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారాలను నిలదొక్కుకోవడం కోసం కా ర్పొరేట్లు దేశం వైపు చసేలా చేస్తుందని సీబీఆర్ ఈ ఇండియా చైర్మన్ అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు.