least
-
దేశంలో అత్యల్ప అక్షరాశ్యత గల జిల్లా ఏది?
దేశంలో అత్యధిక విద్యావంతులు కలిగిన రాష్ట్రం గురించి ప్రస్తావించినప్పుడు కేరళ పేరు గుర్తుకు వస్తుంది. అయితే భారతదేశంలో అతి తక్కువ విద్యావంతులు కలిగిన జిల్లా ఏదో తెలుసా? భారతదేశంలో జనాభా గణన 2011లో నిర్వహించారు. ఇది దేశ జనాభాతో పాటు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్థితిగతులు సమాచారాన్ని అందించింది. ఇలా సేకరించిన డేటాలో ముఖ్యమైన అంశం వివిధ ప్రాంతాలలోని జనాభా, అక్కడి అక్షరాస్యత రేటు. భారతదేశంలో అతి తక్కువ విద్యావంతులు గల జిల్లాలను గుర్తించడానికి ఈ డేటా ఉపకరిస్తుంది. భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత శాతం కలిగిన జిల్లా అలీరాజ్‌పూర్. ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ సగటు అక్షరాస్యత రేటు 36.10 శాతం మాత్రమే. ఈ జిల్లాలలో మగవారిలో అక్షరాస్యత రేటు 42.02 శాతం, స్త్రీలలో 30.29 శాతంగా ఉంది. భారతదేశంలో అతి తక్కువ విద్యావంతులు ఉన్న రెండవ జిల్లా విషయానికొస్తే.. అది ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్. ఈ జిల్లాలో సగటు అక్షరాస్యత రేటు 40.86 శాతం. ఇందులో పురుషుల అక్షరాస్యత 50.46 శాతం. స్త్రీల అక్షరాశ్యత 31.11 శాతంగా ఉంది. అత్యల్ప విద్యావంతులు కలిగిన మూడవ జిల్లా దంతేవాడ. ఇది చత్తీస్‌గఢ్‌లో ఉంది. ఇక్కడ సగటు అక్షరాస్యత రేటు 42.12 శాతం. పురుషుల అక్షరాశ్యత శాతం 51.92 శాతం. స్త్రీలలో 35.54 శాతం అక్షరాశ్యత ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఝబువా సగటు అక్షరాస్యత రేటు 43.30 శాతం. ఇది దేశంలో నాల్గవ అత్యల్ప అక్షరాస్యత కలిగిన జిల్లా. ఇక్కడ పురుషులలో 52.85 శాతం, మహిళలలో 33.77 శాతం అక్షరాశ్యత కలిగినవారున్నారు. భారతదేశంలో అతి తక్కువ విద్యావంతులు ఉన్న ఐదవ జిల్లా ఒడిశాలోని నబరంగ్‌పూర్. ఇక్కడ నమోదైన సగటు అక్షరాస్యత రేటు 46.43 శాతం. ఇది కూడా చదవండి: రాజస్తాన్‌లో కొత్త పరిణామం.. బీజేపీ, కాంగ్రెస్‌లకు గుబులు -
‘లెక్క’ తప్పుతోంది!
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి తర్వాత తెలంగా ణ సహా వివిధ రాష్ట్రాల్లో పాఠశాల స్థాయిలో విద్యా ర్థుల అభ్యసన దిగజారుతున్నట్లు తాజా అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా గణితంలో 49 శాతం మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు కనబర్చలేకపోతు న్నారని జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సర్వేలో వెల్లడైంది. ప్రధాన రాష్ట్రాల్లో మాతృభాషలతోపాటు గణిత సామర్థ్యంపై ఈ అధ్య యనం జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 10 వేల ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు 90 వేల మంది విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించగా రాష్ట్రం నుంచి 180 స్కూళ్లకు చెందిన 1,500 మందికిపైగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించా రు. ఈ అధ్యయనం ప్రకారం కరోనా తర్వాత చదవ డం, రాయడం విద్యార్థుల్లో పూర్తిగా సన్నగిల్లింది. మాతృభాషలో కనీసం చదవలేని పరిస్థితి ఉన్నవాళ్లు 19 శాతంగా తేలారు. పట్టుమని పది పదాలు తప్పు లు లేకుండా చదవగలిగిన వారు 6 శాతం, 20 పదాలు చదవిన వాళ్లు 13 శాతమే ఉన్నారు. ఇక 70 పదాలు తప్పులు లేకుండా చదవగలిగే వాళ్లు 12 శాతంగా తేలారు. లెక్కల్లో బేసిక్స్ కూడా తెలియని విద్యార్థులు ఎక్కువమంది ఉన్నారు. ముఖ్యంగా మూడవ తరగతి వరకూ కనీసం అంకెలు కూడా గుర్తించలేని పరిస్థితి కనిపించింది. రెండంకెల కూడి కలు, తీసివేత లు కూడా చేయలేని స్థితిలో 43 శాతం విద్యార్థులు మూడో తరగతిలో ఉన్నట్లు సర్వే గుర్తించింది. గతేడాది రాష్ట్ర విద్యాశాఖ జరిపిన పరిశీల నలో సైతం గణితంలో సగం మందికిపైగా టెన్త్ విద్యా ర్థులు క్లిష్టమైన లెక్కలు చేయలేకపోతున్నారని వెల్లడైంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంజనీ రింగ్ విద్య వరకూ వచ్చే విద్యార్థుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించే అవకాశాలున్నాయని నిపు ణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అతితక్కువ కాలం పదవుల్లో కొనసాగింది వీళ్లే!
బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేయడం.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ఆరేళ్లలో నలుగురు ప్రధానులు మారడం.. యూకేలోని రాజకీయ అస్థిరత్వాన్ని ప్రతిబింబిస్తోంది. అయితే పాలనాపరమైన నిర్ణయాలు దారుణంగా బెడిసి కొట్టడం.. సొంత పార్టీ నుంచే ప్రతికూలత నడుమ కేవలం 45 రోజులకే ట్రస్ ఆ పదవికి రాజీనామా చేయడం ఇక్కడ గమనార్హం. ఈ తరుణంలో.. ట్రస్ రాజీనామాపై సెటైర్లు సైతం పేలుతున్నాయి. ఇక ప్రపంచంలో అత్యంత తక్కువ కాలం పదవిలో కొనసాగిన కొందరి నేపథ్యాన్ని ఓసారి పరిశీలిద్దాం.. ► లిజ్ ట్రస్.. బ్రిటన్ అధికారిక కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతుతో.. సెప్టెంబర్ 6వ తేదీన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ సమక్షంలో ప్రధాని పగ్గాలు చేపట్టారు లిజ్ ట్రస్. కానీ.. ఆర్థిక నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొని చివరకు 45 రోజుల తర్వాత డౌనింగ్ స్ట్రీట్‌ను వీడుతూ ఆమె తన రాజీనామాను ప్రకటించారు. బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా లిజ్ ట్రస్ రికార్డులకెక్కారు. అంతకు ముందు ఆ రికార్డు జార్జ్ కానింగ్ (119 రోజులు) పేరిట ఉండేది. క్షయ వ్యాధి బారినపడి ఆగస్టు 8వ తేదీన, 1827లో ఆయన మరణించారు. ► అటల్ బిహారీ వాజ్‌పేయి.. 16 రోజులు దేశ ప్రధాని పదవిలో కొనసాగారు. మే 16, నుంచి జూన్ 1వ తేదీ దాకా.. విశ్వాస పరీక్ష తీర్మానం నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి స్వచ్ఛందంగా దిగిపోయి రాజకీయాల్లో తనదైన నిజాయితీ ప్రదర్శించారనే ముద్ర వేసుకున్నారాయన. ► వాజ్‌పేయి కంటే ముందు.. గుల్జారీలాల్ నందా ఆపద్ధర్మ ప్రధానిగా కేవలం పదమూడు రోజులపాటు.. అదీ రెండు పర్యాయాలు కొనసాగారు. మొదటిసారి నెహ్రూ మరణం తర్వాత, రెండోసారి లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత గుల్జారీలాల్ నందా ప్రధాని పదవిలో కొనసాగారు. గుల్జారీలాల్ నందా మధ్యలో.. ప్రమాణం చేసిన గంటకే.. 1967లో సియెర్రా లియోన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సియాకా స్టీవెన్స్ ప్రధాని అయ్యారు. కానీ, పాపం గంటకే ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. మిలిటరీ తిరుగుబాటుతో ప్రమాణం చేసిన గంటకే ఆయన్ని అరెస్ట్ చేసి కారాగారానికి పంపారు. అయితే.. తన మార్క్ రాజకీయంతో జైలు నుంచే చక్రం తిప్పిన ఆయన.. రెండువారాలకు మిలిటరీ తిరుగుబాటును అణచివేయగలిగారు. బయటకు వచ్చి మళ్లీ ప్రధాని పదవి చేపట్టి.. పదిహేడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. అధ్యక్షులు కూడా.. ► అమెరికా ఆర్మీ అధికారి, ఆ దేశానికి తొమ్మిదవ అధ్యక్షుడు అయిన విలియం హెన్రీ హ్యారీసన్.. కేవలం 32 రోజులపాటు మాత్రమే పదవిలో కొనసాగారు. ఊపిరితిత్తుల సమస్యతోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పదవిలో ఉండగా మరణించిన తొలి అమెరికా అధ్యక్షుడు కూడా హ్యారీసన్ కావడం గమనార్హం. ► మెక్సికో అధ్యక్షుడు పెడ్రో లాస్కురెయిన్.. 1913లో కనీసం గంటపాటు కూడా పదవిలో కొనసాగలేదు. జనరల్ విక్టోరియానో హ్యూయెర్టో సారధ్యంలో జరిగిన మిలిటరీ తిరుగుబాటుతో పగ్గాలు చేపట్టిన 45 నిమిషాలకే పెడ్రో తన పదవి కోల్పోయారు. ► 1945, ఏప్రిల్ 30 జర్మనీ మాత్రమే కాదు.. ప్రపంచ చరిత్రలో గుర్తుండిపోయే రోజు. అడాల్ఫ్ హిట్లర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతరం.. నాజీ జర్మనీలో జోసెఫ్ గోయెబ్బెల్స్ ఛాన్స్లర్ పగ్గాలు చేపట్టారు. అయితే.. ఆయన జర్మనీ చాన్స్‌లర్‌గా కొనసాగింది ఆ ఒక్క రాత్రి మాత్రమే. ఉదయం కల్లా భార్య మాగ్దా, తన ఆరుగురు పిల్లలతో గోయెబ్బెల్స్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజులు.. రాణులు కూడా! ► అధినేతల విషయంలోనే కాదు.. రాజరికంలోనూ అత్యంత తక్కువ కాలం సింహాసనం మీద కూర్చున్నవాళ్ల రికార్డులు ఉన్నాయి. ఫ్రాన్స్ రాజుగా లూయిస్ 19.. 1803లో కేవలం ఇరవై నిమిషాలపాటు మాత్రమే సింహాసనం మీద కూర్చున్నారు. చాలాకాలం ఆయన ఫ్రాన్స్‌కు దూరంగా గడిపారు. ► పోర్చుగల్ రాజుగా లూయిస్ పిలిపె కూడా అత్యంత తక్కువ సమయం(20 నిమిషాలే!) సింహాసనం అధిష్టించిన రికార్డు ఉంది. 1908 ఫిబ్రవరి 1న జరిగిన తండ్రి కార్లోస్ 1 హత్య జరగ్గా.. అదే దాడిలో తీవ్రంగా గాయపడిన కొడుకు పిలిపె.. 20 నిమిషాలపాటు ప్రాణాలతో పోరాడాడు. ఆ 20 నిమిషాలను అతని సింహాసన కాలంగా గుర్తించింది పోర్చుగల్. ► నైన్ డేస్ క్వీన్‌గా గుర్తింపు పొందిన లేడీ జాన్ గ్రే.. తొమ్మిది రోజుల పాటు ఇంగ్లండ్, వేల్స్, ఐర్లాండ్‌లకు రాణిగా సింహాసనంపై కొనసాగింది. అదీ కేవలం 16 ఏళ్ల వయసులో. 1553 జులై 10 నుంచి 19 మధ్య ఆమె రాణిగా కొనసాగింది. ఆ మరుసటి సంవత్సరమే ఆమెకు మరణ శిక్ష అమలు చేశారు. ► రష్యాలో.. మైకేల్ 2 అతితక్కువ సమయం సింహాసనంపై రాజుగా కొనసాగాడు. సోదరుడు సార్ నికోలస్ 2.. మార్చి 1997లో సింహాసనం నుంచి దిగిపోగా.. 18 గంటలపాటు రాజుగా మైకేల్ 2 కొనసాగాడు. అయితే.. తిరుగుబాటు నేపథ్యంలో అతన్ని చెరసాలలో బంధించగా.. ఆపై హత్యకు గురయ్యాడు. -
రాధికా ఆప్టే అందానికి.. రాం.. ఫిదా!
సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లతో ఎప్పుడూ కనిపించే దర్శకుడు రాంగోపాల్ వర్మ కన్ను... ఈసారి మరాఠీ అందాల భామ రాధికా అప్టేపై పడింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన కబాలీ సినిమాలో నటిస్తున్న రాధికా ఆప్టే అందాన్ని వర్ణిస్తూ రాం చేసిన ట్వీట్.. రాధికా అభిమానులను మరింత పెంచేట్టుగా ఉంది. రాధికాను చూడగానే తాను డైరెక్ట్ చేసిన సినిమా గోవిందా గోవిందా సినిమాలోని పాట గుర్తుకు వచ్చిందని, ఇంతటి హాటెస్ట్ అమ్మాయిని ఇటీవల ఎక్కడా చూడలేదంటూ వర్మ తనదైన శైలిలో వర్ణిస్తూ ట్వీట్ చేశాడు. ఆ మరాఠీ బ్యూటీకి కొంతకాలం క్రితం విడుదలైన రక్త చరిత్ర సినిమాలో వర్మ...అవకాశం కూడ కల్పించాడు. అయితే ఇన్నాళ్ళ తర్వాత ఆమె మళ్ళీ తెరపైకి వస్తున్న నేపథ్యంలో తన మనసులోని భావాలను ''ఆహ్హాఆఆఆ! ది హాటెస్ట్ ఐ సా మై లాస్ట్ త్రీ బర్త్స్'' అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశాడు.Ahhhhhhhhh!- The hottest I saw in my last 3 births 😍 pic.twitter.com/KQ0wIWC2ZJ— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2016