lecturer arrested
-
కోఠి మహిళా కళాశాల అధ్యాపకుడి అరాచకాలు.. ఫొటోలు మార్ఫింగ్ చేసి..
సాక్షి, కరీంనగర్: సోషల్ మీడియాలో ప్రేమ పేరుతో యువతిని, ఆమె కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తోన్న యువకుడిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కోటి ఉమెన్స్ కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తోన్న ఆదిత్య భరద్వాజ్, కరీంనగర్‌లోని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కుమార్తె ఉస్మానియా యూనివర్సిటీలో 2019 నుంచి 2021 వరకు పీజీ కలిసి చదువుకున్నారు. కొద్దిరోజుల స్నేహం తర్వాత యువతిని ప్రేమిస్తున్నానని తెలుపగా ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న భరద్వాజ్ యువతిని, ఆమె కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. స్నేహంగా ఉన్న రోజుల్లో యువతి కుటుంబ సభ్యులతో తీయించుకున్న పాత ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధించసాగాడు. వీలైన ప్రతి చోటా ఆన్లైన్లో యువతికి, కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాడు. పెళ్లి చేసుకోకుంటే యాసిడ్‌పోస్తానని బెదిరింపులకు గురిచేసేవాడు. తెలంగాణ మోడల్ స్కూల్ గంగాధర సోషల్ మీడియా అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టేవాడు. అతడి వేధింపులు భరించలేని యువతి ఈ నెల 10న గంగాధర పోలీసులకు ఫిర్యాదు చేసింది. లోతుగా విచారించిన పోలీసులు ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. భరద్వాజ్ కదలికలపై దృష్టి పెట్టారు. వనపర్తిలోని ఓ ఫంక్షన్‌కు వెళ్లగా అక్కడే అరెస్టు చేశారు. వేములవాడ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. పోలీసులు అరెస్టు చేయగా కొందరు వీడియో తీసినవి సోషల్ మీడియాలో రావడంతో కిడ్నాప్ అంటూ వార్తలు వచ్చా యి. దీనిపై వనపర్తిలోని ఒక పోలీసు అధికారి కిడ్నాప్ కాదు ఓ కేసులో అరెస్టు చేసినట్లు వివరించారు. చదవండి: Crime News: ఆమెకు పెళ్ళైంది కానీ.. -
ఫేస్బుక్ కీచకుడు
పెనుగొండ: అతనో అధ్యాపకుడు. భావ వ్యక్తీకరణ, నిర్వహణ కోర్సులో దిట్ట. సామాజిక మాధ్యమాల నిర్వహణలోనూ ఆరితేరాడు. యువతులను వేధించడానికి అతను సామాజిక మాధ్యమాన్నే వేదికగా చేసుకున్నాడు. అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ చివరకు కటకటాలపాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కారాని నరేష్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మేనేజ్మెంట్ అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. ఇతను నకిలీ ధ్రువపత్రాలతో సిమ్ తీసుకుని, ఫేస్బుక్ ఖాతా ప్రారంభించాడు. అందులో యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతూ పరిచయం చేసుకోవడం మొదలెట్టాడు. కొంత చనువు పెరిగాక అసభ్య మెసేజ్‌లు పంపడం ప్రారంభించాడు. ఇలా చాలామందికి అసభ్య మెసేజ్‌లు పంపాడు. ఈ నేపథ్యంలోనే పెనుగొండకు చెందిన ఓ యువతికి కూడా అసభ్య మెసేజ్‌లు పంపాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సీఐ సి.హెచ్.రామారావు ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించిన పోలీసులు శనివారం నరేష్‌ను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అప్రమత్తంగా ఉండాలి : పోలీసులు అపరిచిత వ్యక్తులతో సామాజిక మాధ్యమాల్లో స్నేహం చేసేటప్పుడు యువత అప్రమత్తంగా ఉండాలని పెనుగొండ ఎస్సై సి.హెచ్.వెంకటేశ్వరరావు హెచ్చ రించారు. ఇటీవల ఫేస్బుక్, వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో స్నేహాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. కొందరు ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తున్నారని, మరికొందరు ఫిర్యాదు చేయడం లేదని వివరించారు. యువత ఇటువంటి వారి ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.