legend audio launch
-
'హీరోగా చేసి విలన్గా చేయడం కష్టం'
హైదరాబాద్: వంద సినిమాలు హీరోగా చేసి విలన్గా చేయడం కష్టమని నటుడు జగపతిబాబు అన్నారు. ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న తనను దర్శకుడు బోయపాటి శ్రీను విలన్ చేశాడని అన్నారు. శిల్పకళా వేదికలో జరిగిన 'లెజెండ్' ఆడియో ఆవిష్కరణ కార్య్రమంలో జగపతిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ సినిమాలో పనిచేయడంలో ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. 'లెజెండ్'లో బాలకృష్ణకు తాను విలన్ని అని, నిజజీవితంలో తాము స్నేహితులమని చెప్పారు. బాలయ్యకు తనకు చాలా పోలికలున్నాయని అన్నారు. సాధారణంగా తాము ఎవరికి జోలికి వెళ్లమని, కానీ తమ జోలికి వస్తే ఊరుకోబోమని వెల్లడించారు. బాలయ్య నిరాడంబరత తనకెంతో నచ్చిందన్నారు. లెజెండ్ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుండని ఆకాంక్షించారు. ఈ సినిమా తర్వాత తనకు విలన్గా అవకాశాలు పెరుగుతాయని జగపతిబాబు అన్నారు. -
'లెజెండ్' ఆడియోకు చంద్రబాబు డుమ్మా
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'లెజెండ్' సినిమా ఆడియో విడుదల అయింది. ఈ రోజు శిల్పకళా వేదికలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పలువురు ప్రముఖుల చేతులుగా పాటలను విడుదల చేశారు. బాలకృష్ణ వియ్యంకుడు చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి బాబు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉండడం వల్లే చంద్రబాబు రాలేకపోయారని చెప్తుతున్నారు. అసలు చంద్రబాబును ఆహ్వానించలేదని సమచారం. బాలయ్య అల్లుళ్లు లోకేష్, శ్రీభరత్లతో పాటు బాలకృష్ణ, జగపతిబాబు, బోయపాటి శ్రీను, రాధికా ఆమ్టే, దేవిశ్రీ ప్రసాద్, దర్శకులు శ్రీనువైట్ల, బి.గోపాల్, సుకుమార్, రాజమౌళి, హంసానందిని హాజరయ్యారు.