'లెజెండ్' ఆడియోకు చంద్రబాబు డుమ్మా | Chandrababu naidu not to attend Legend Audio Function | Sakshi
Sakshi News home page

'లెజెండ్' ఆడియోకు చంద్రబాబు డుమ్మా

Published Fri, Mar 7 2014 9:22 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

'లెజెండ్' ఆడియోకు చంద్రబాబు డుమ్మా - Sakshi

'లెజెండ్' ఆడియోకు చంద్రబాబు డుమ్మా

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'లెజెండ్' సినిమా ఆడియో విడుదల అయింది. ఈ రోజు శిల్పకళా వేదికలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పలువురు ప్రముఖుల చేతులుగా పాటలను విడుదల చేశారు. బాలకృష్ణ వియ్యంకుడు చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి బాబు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.  అయితే ఎన్నికల ప్రచారంలో  తీరిక లేకుండా ఉండడం వల్లే చంద్రబాబు రాలేకపోయారని చెప్తుతున్నారు. అసలు చంద్రబాబును ఆహ్వానించలేదని సమచారం.

బాలయ్య అల్లుళ్లు లోకేష్, శ్రీభరత్‌లతో పాటు బాలకృష్ణ, జగపతిబాబు, బోయపాటి శ్రీను, రాధికా ఆమ్టే, దేవిశ్రీ ప్రసాద్, దర్శకులు శ్రీనువైట్ల, బి.గోపాల్, సుకుమార్, రాజమౌళి, హంసానందిని హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement