
అభిమానులతో కలసి 'లెజెండ్' చూసిన బాలయ్య
హైదరాబాద్: తాను హీరోగా నటించిన 'లెజెండ్' సినిమాను నందమూరి బాలకృష్ణ అభిమానులతో కలిసి తిలకించారు. నిజాంపేటలోని భ్రమరాంబ థియేటర్‌లో ఆయన ఈ సినిమా చూశారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి కూడా ప్రేక్షకులతో కలిసి 'లెజెండ్' సినిమాను వీక్షించారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదలయింది. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, రాధిక ఆమ్టే హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ హీరో జగపతిబాబు ఈ సినిమాలో విలన్గా నటించడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా బాలకృష్ణ సినిమాకు సంగీతం అందించాడు.