'హీరోగా చేసి విలన్గా చేయడం కష్టం' | villain role taught after hero says jagapathi babu | Sakshi
Sakshi News home page

'హీరోగా చేసి విలన్గా చేయడం కష్టం'

Published Fri, Mar 7 2014 9:48 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

'హీరోగా చేసి విలన్గా చేయడం కష్టం' - Sakshi

'హీరోగా చేసి విలన్గా చేయడం కష్టం'

హైదరాబాద్: వంద సినిమాలు హీరోగా చేసి విలన్గా చేయడం కష్టమని నటుడు జగపతిబాబు అన్నారు. ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న తనను దర్శకుడు బోయపాటి శ్రీను విలన్ చేశాడని అన్నారు. శిల్పకళా వేదికలో జరిగిన 'లెజెండ్' ఆడియో ఆవిష్కరణ కార్య్రమంలో జగపతిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ సినిమాలో పనిచేయడంలో ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.

'లెజెండ్'లో బాలకృష్ణకు తాను విలన్ని అని, నిజజీవితంలో తాము స్నేహితులమని చెప్పారు. బాలయ్యకు తనకు చాలా పోలికలున్నాయని అన్నారు. సాధారణంగా తాము ఎవరికి జోలికి వెళ్లమని, కానీ తమ జోలికి వస్తే ఊరుకోబోమని వెల్లడించారు. బాలయ్య నిరాడంబరత తనకెంతో నచ్చిందన్నారు. లెజెండ్ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుండని ఆకాంక్షించారు. ఈ సినిమా తర్వాత తనకు విలన్గా అవకాశాలు పెరుగుతాయని జగపతిబాబు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement