లెజెండ్ లో సన్నివేశాలు తొలగించండి: ఈసీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ హిందూపూర్ ఎమ్యెల్యే అభ్యర్ధి, సినీనటుడు బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమాలో నాలుగు సన్నివేశాలను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుంది. లెజెండ్ చిత్రంలో నాలుగు అభ్యంతకర సన్నివేశాలున్నట్లు ఈసీ గుర్తించింది. అభ్యంతరకరమైన సీన్లను తొలగించాల్సిందిగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. హిందూపురం రిటర్నింగ్ అధికారి ద్వారా ఈసీ నోటీసులు పంపనుంది.
'లెజెండ్' చిత్రంపై చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్ గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో లెజెండ్ చిత్రం ప్రత్యేక షో వేశారు. లెజెండ్ చిత్రాన్ని రాష్ట్ర ఎన్నికల డిప్యూటి కమిషనర్ దేవసేన చూసి ఎన్నికల కమిషన్ కు నివేదిక సమర్పించారు. దేవసేన అందించిన నివేదిక అధారంగా నాలుగు సన్నివేశాలను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు.