Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu Govt Neglected Mango Farmers1
చెట్టునే నరకనా... మెడ కోసుకోనా?

ఆంధ్రప్రదేశ్‌లోని తోతాపురి మామిడి రైతుల హాహాకారాలు ఆ రాష్ట్ర సరిహద్దుల్ని దాటి ప్రతిధ్వనిస్తున్నాయి. కిలోకు పన్నెండు రూపాయలు కనీస ధరగా నిర్ణయించిన ప్రభుత్వం కార్యాచరణపై మాత్రం ముసుగేసింది. ఫలితంగా రెండు రూపాయలకు కూడా కొనే నాథుడు లేక రైతులు మామిడి కాయల్ని రోడ్లపై పారబోస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. పారబోయడానికి మనసొప్పని రైతులు రవాణా ఖర్చులు వచ్చినా చాలని హైదరాబాద్‌ వంటి దూర ప్రాంత మార్కెట్లకు తరలించిన ఉదంతాలు కోకొల్లలు. తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతున్న ఈ పరిస్థితుల్లో పసిబిడ్డల్లా పెంచుకున్న చెట్లను నరికేయాలో, చేతిలో వున్న కొడవలితో మెడనే నరుక్కోవాలో అర్థం కావడం లేదంటూ ఒక రైతు వాట్సప్‌లో పెట్టిన మెసేజ్‌ కంటతడి పెట్టించింది.ఇదొక్క మామిడి రైతుల ఆక్రందనే కాదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రైతులందరి ఉమ్మడి ఆవేదన ఇదే. జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్వింటాల్‌కు 24 వేలు పలికిన ధర ఇప్పుడు గరిష్ఠంగా ఏడు వేలు దాటకపోవడంతో మిర్చి రైతు కుదేలయ్యాడు. పత్తి ధర పదివేల నుంచి ఐదు వేలకు అంటే సగానికి సగం పడిపోయింది. అప్పుడు 18 వేల దాకా దక్కించుకున్న పొగాకు ఇప్పుడు గరిష్ఠంగా 6 వేలకు పడిపోయింది. పసుపు, కందులు, మినుములు, వేరుశనగ, మొక్కజొన్న, పెసలు, ఉల్లిపాయలు, టమాటా, మామిడిపళ్ళు, అరటి, బొప్పాయి, డ్రాగన్‌ ఫ్రూట్‌ వగైరా వ్యవసాయ ఉత్పత్తుల ధరలన్నీ సగానికి పడిపోయాయి. ఆనాటి జగన్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ధరలు పతనమవకుండా మార్కెట్‌లో జోక్యం చేసుకునే విధానాన్ని అవలంబించడం సత్ఫలితాలనిచ్చి మంచి ధరలు లభించాయి. రైతన్నకు దరహాసాన్నిచ్చాయి.చంద్రబాబు ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలేసింది. మొత్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ఈ ప్రభుత్వం కాడి పారేసింది. జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్న రైతు భరోసా కంటే అధికంగా ఇస్తానని హామీ ఇచ్చి వరసగా రెండో యేడు కూడా ఎగనామం పెట్టింది. వ్యవసాయ రంగం ఈ ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో లేదు. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని అడిగి తెచ్చుకొని తన కమీషన్ల ప్రాధాన్యాన్ని ఆ ప్రభుత్వం చాటి చెప్పుకున్నది. రెండోసారి అదే ప్రాధాన్యతను అమరావతి రూపంలో నిలబెట్టుకొన్నది. క్వాంటమ్‌ వ్యాలీ, డీప్‌ టెక్నాలజీ, ఏఐ వగైరాలన్నీ అమరావతి హైప్‌ కోసం కైపెక్కించడం తప్ప ఆచరణాత్మకమైన మాటలు కావనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. క్వాంటమ్‌ వ్యాలీకి అవసరమయ్యే ఎకో సిస్టమ్‌ అమరావతికి అందుబాటులోకి రావడమనేది ఒక సుదూర స్వప్నమే తప్ప ప్రభుత్వం చెబుతున్నట్టు ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించే స్థితి అసంభవమని నిపుణులు చెబుతున్నారు. మధ్యతరగతిని మభ్యపెట్టడానికి యువతకు జోల పాడటానికి ఇటువంటి పదజాలాన్ని వెదజల్లడం బాబు కాకస్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఈ జోలపాటల మాటున అమరావతిలో జరుగుతున్న అసలు కార్యక్రమమేమిటో చాలామందికి అర్థమైంది. అమరావతి పేరుతో ఇప్పటికే తెచ్చిన అప్పులే కాదు, ఇంకా అవసరమైన అప్పులు తీర్చడానికి భూములు అమ్ముతామనీ, అదో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కేపిటలనీ చెబుతూ వచ్చారు. తొలుత సమీకరించిన భూముల్లో రైతుల వాటా తీసేయగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు పోనూ మిగిలిన భూముల అమ్మకంతో తెచ్చిన అప్పులు తీర్చడం సాధ్యం కాదనే మాట వినిపిస్తున్నది. ఈ తత్వం బోధపడినందువల్లనే ప్రపంచ బ్యాంకు వాళ్లు ఈ మధ్య ప్రభుత్వానికి తాఖీదులు పంపారట! మీరు అమ్మబోయే భూములెన్ని? ఎప్పటిలోగా అమ్ముతారు? వాటి ద్వారా ఎంత డబ్బు సమీకరిస్తారో చెప్పండని వారు అడుగుతున్నారని సమాచారం.ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాల భూసేకరణ ప్రయత్నాలకు రైతులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వంలో కలవరం మొదలైనట్టు కనిపిస్తున్నది. కాకస్‌ పరంగా ఎంత సంపాదించుకున్నా ప్రభుత్వపరంగా మాత్రం అమరావతి ప్రాజెక్టు ఒక నిరర్థక ఆస్తిగానే మిగిలిపోయే ప్రమాదముందనే హెచ్చరికలు వినబడుతున్నాయి. పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ఈ మధ్యకాలంలో బాబు ప్రభుత్వం చేస్తున్న హడావుడి కూడా కమీషన్ల స్టార్టప్‌ కథేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 80 వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో గేమ్‌ ఛేంజర్‌ కాబోతున్నదని ఆయన చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికలో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది పూర్తయితే ఏడు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకూ, ఇంకో 23 లక్షల ఎకరాల స్థిరీకరణకూ ఉపయోగపడుతుంది. జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించి చాలావరకు పూర్తయి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇంకో 14 వేల కోట్లు సరిపోతుందనీ, ఈ పని చేస్తే కూడా అంత ఆయకట్టు అందుబాటులోకి వస్తుందనీ చెబుతున్నారు.అటువంటప్పుడు ఏది తొలి ప్రాధాన్యత కావాలి? 14 వేల కోట్లతో పెండింగ్‌ పనులు పూర్తి చేయడమా? 80 వేల కోట్లతో కొత్త ప్రాజెక్టును తలకెత్తుకోవడమా? గోదావరి వరద జలాలను ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఆ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అవసరమే కావచ్చు. ఈ ఆలోచన కూడా వాస్తవానికి గత ప్రభుత్వంలో వచ్చినదే. కానీ సత్వరం పూర్తి కావలసిన ప్రాజెక్టులకు పైసా విదల్చకుండా చేపట్టిన ఈ నిర్హేతుకమైన ప్రాధాన్యతాక్రమం దేన్ని సూచిస్తుంది? భారీ ప్రాజెక్టుతో భారీ కమీషన్ల దురాశతోనే ఈ రకమైన ఎంపిక చేసుకున్నారంటే తప్పవుతుందా? రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇప్పించలేకపోయిన ప్రభుత్వం, ఉన్న ఊరిలోనే కల్తీలేని విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తెస్తున్న ఆర్‌బీకేలను మూసి పారేసిన ప్రభుత్వం రైతన్నల కన్నీరు తుడవడానికి భారీ ప్రాజెక్టులను సంకల్పించిందంటే నమ్మశక్యమేనా?ఆలూ లేదు, చూలూ లేదు అన్నట్టుగా బాబు ఈ ప్రాజెక్టును పూర్తిచేసే అవకాశమే లేనప్పటికీ దీనిపై తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు సిగపట్లకు దిగడం ఒక విశేషం. చంద్రబాబుతో సాన్నిహిత్యం కారణంగానే ఆయన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. దీనిపై గత కొన్ని వారాలుగా తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ పంచాయితీలో బీఆర్‌ఎస్‌ వాదానిదే పైచేయిగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి ఇతరత్రా కారణాలు కూడా కొన్ని దోహదపడి ఉండవచ్చు. ప్రెస్‌మీట్లలో కాదు, అసెంబ్లీలో చర్చిద్దాం రండని తాజాగా కాంగ్రెస్‌ మంత్రులు సవాల్‌ విసురుతున్నారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ప్రాజెక్టునూ పూర్తిచేసిన రికార్డు లేని చంద్రబాబు చిటికెల పందిరిని ఆంధ్ర ప్రజలెవరూ పట్టించుకోకపోయినా తెలంగాణలో అది మంట పుట్టించడం విశేషం.ఒకపక్క అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల రూపంలో భారతీయ రైతును బలిపీఠమెక్కించే సూచనలు పొడసూపుతున్నాయి. వాణిజ్య ఒప్పందం కోసం అమెరికా విధించిన మూడు మాసాల గడువు ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసిపోనున్నది. ఈలోగా భారత్‌తో కనీసం మినీ ఒప్పందమైనా జరగాలని ట్రంప్‌ పట్టుపడుతున్నారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య గత వారం రోజులుగా చర్చోపచర్చలు జరుగున్నాయి. జన్యుమార్పిడి సోయాచిక్కుడు, మొక్కజొన్నలను, యాపిల్స్‌ను, డెయిరీ ఉత్పత్తులను తక్కువ సుంకాలతో భారత మార్కెట్‌లోకి అనుమతించాలని అమెరికా డిమాండ్‌ చేస్తున్నది. వందల ఎకరాల భారీ కమతాల్లో పూర్తిగా యంత్రాల సాయంతో, దాదాపు యాభై శాతం సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం దన్నుతో చౌకగా వచ్చే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ సుంకాలతోనే మళ్లీ మార్కెట్‌లోకి ప్రవేశిస్తే భారతీయ రైతు తట్టుకోగలడా? పైగా భారతీయ వ్యవసాయ రంగంలోకి, ఫుడ్‌ చెయిన్‌లోకి జన్యుమార్పిడి ఉత్పత్తులను అనుమతించకపోవడం భారత్‌ విధానంగా ఉంటూ వస్తున్నది. ఫుడ్‌ చెయిన్‌ పరిధిలోకి రాదనే కారణంతో పత్తిలోకి ఇప్పటికే జన్యుమార్పిడి విత్తనాలు ప్రవేశించాయి. రేపోమాపో కుదరనున్న మినీ వాణిజ్యం ఒప్పందంతో ఏం జరగనున్నదని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అమెరికా విధించే గడువుకంటే తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ఇంటర్వ్యూలో వాణిజ్య–పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఘంటాపథంగా చెప్పారు. శనివారం నాటి పత్రికలో వచ్చిన ఈ ఇంటర్వ్యూలో ‘మన వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే ఎటువంటి ఒప్పందాన్ని చేసుకోబోమ’ని ఆయన చెప్పారు. మొక్కజొన్న ఉత్పత్తిలో టాప్‌ ఫైవ్‌లో ఉన్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ట్రంప్‌ ప్రతిపాదనలు అంగీకరించడం బీజేపీకి కూడా ఆత్మహత్యా సదృశమే.వాణిజ్య చర్చల్లో పాల్గొంటున్న అధికారుల భోగట్టాగా పేర్కొంటూ బ్లూమ్‌బర్గ్‌ లాంటి వార్తా సంస్థలు మరో కథనాన్ని చెబుతున్నాయి. కేవలం పశువుల దాణా కోసం, పౌల్ట్రీ దాణా కోసం ఉపయోగపడే విధంగా మొక్కజొన్న, సోయా చిక్కుళ్ల ఉప ఉత్పత్తులను అనుమతించే మినీ ఒప్పందం కుదిరే అవకాశముందని ఈ కథనాల సారాంశం. మినీ రవ్వ రూపంలో వచ్చినంత మాత్రాన అది జన్యుమార్పిడి పంట కాకుండా పోతుందా? పశువుల దాణా, కోళ్ల దాణాలోకి ప్రవేశిస్తే అది ఫుడ్‌ చెయిన్‌లో భాగం కాకుండా పోతుందా అనేవి చర్చనీయాంశాలు. రెండుమూడు రోజుల్లో జరిగే మినీ ఒప్పందం అనంతరం, మూడు నాలుగు నెలల్లో జరిగే పూర్తి స్థాయి ఒప్పందం అనంతరం మాత్రమే ఈ అంశంపై ఒక స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికి దాణా రూపంలో ప్రవేశించినా, ఒంటె గుడారంలోకి కాళ్లు జాపితే ఏం జరుగుతుందో భవిష్యత్తులో అదే జరుగుతుంది. చంద్రబాబు వంటి వ్యవసాయ వ్యతిరేక విధానాలు అనుసరించే పాలకుల కారణంగా పాతికేళ్ల కిందటే మన రైతులు ఉరితాళ్లు పేనుకున్నారు. ఇప్పుడు కొడవళ్లు మెడపైకి చేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో అమెరికా జన్యుమార్పిడి పంట ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి ప్రవేశిస్తే వ్యవసాయం దండగన్న బాబు జోస్యం నిజమవుతుంది. ఈ విషయంలో నిజంగానే ఆయన విజనరీగా నిలబడిపోతారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Technical problem on TS POLYCET website2
పాలిసెట్‌ డేటా ఎరేజ్‌?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సాంకేతిక విద్య విభాగంలో గందరగోళం నెలకొంది. పాలిసెట్‌ సీట్ల కేటాయింపు ఆగిపోయింది. ఇంజనీరింగ్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియని స్థితి ఏర్పడింది. విషయం తెలుసుకునేందుకు మీడియా శనివారం రాత్రి వరకూ ప్రయత్నించినా అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు. కిందిస్థాయి సిబ్బంది కూడా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు మాత్రం సాఫ్ట్‌వేర్‌లో ఏదో సమస్య వచ్చిందని తెలిపారు. మరికొందరు వెబ్‌సైట్‌లో విద్యార్థుల డేటా మొత్తం ఎగిరిపోయిందని చెప్పారు. తాము చెప్పినట్టు ఎవరికీ చెప్పొద్దంటూ వారు వేడుకున్నారు. దీన్నిబట్టి సరిదిద్దలేని తప్పులేవో సాంకేతిక విద్య విభాగంలో జరిగినట్టు తెలుస్తోంది. పాలిసెట్‌ సీట్ల కేటాయింపు ఏమైంది? పాలిసెట్‌ సీట్ల కేటాయింపు ఈ నెల 4వ తేదీనే ఉంటుందని కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది. కానీ 4వ తేదీ రాత్రివరకూ ప్రకటించలేదు. కౌన్సెలింగ్‌ క్యాంపు అధికారులను వివరణ కోరితే పాలనాపరమైన అనుమతులు రావాల్సి ఉందని ఒకసారి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత రావాల్సి ఉందని మరోసారి బదులిచ్చారు. శనివారం ఉదయమే సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. పాలిటెక్నిక్‌ సీట్ల కోసం దాదాపు 22 వేల మంది ఎదురు చూస్తున్నారు. శనివారం రాత్రివరకు సీట్లు ఖరారు చేయలేదు. దీనిపై అధికారులు స్పందించడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వేల మంది విద్యార్థుల డేటా తారుమారైనట్టు తెలిసింది. సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు సమాచారం. విద్యార్థులు వెబ్‌సైట్‌లో పెట్టిన ఆప్షన్లు మొత్తం మారిపోయినట్టు తెలిసింది. దీనిపై సిబ్బంది, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం, ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సమస్య మరింత జటిలమైందని తెలియవచ్చింది. సిబ్బంది అజాగ్రత్తే దీనికి కారణమని తెలుస్తోంది. దీనివల్లే సీట్ల కేటాయింపు ఆగిపోయినట్టు సమాచారం. ఇంజనీరింగ్‌ కథేంటి? ఇంజనీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లు ఆదివారం నుంచి మొదలవ్వాలి. అన్ని యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు కాలేజీలు, సీట్లు, కోర్సుల వివరాలను ప్రభుత్వానికి పంపాయి. ఎక్కువ ప్రైవేటు కాలేజీలున్న జేఎన్టీయూహెచ్‌ కూడా శనివారం మధ్యాహ్నం గుర్తింపు వివరాలన్నీ సాంకేతిక విద్యా మండలి కార్యాలయానికి పంపింది. వీటిని అప్‌లోడ్‌ చేస్తేనే విద్యార్థులు ఆదివారం ఉదయం నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇవ్వడానికి వీలుంటుంది. కానీ, శనివారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ ప్రక్రియ పూర్తవ్వకపోవడంతో అసలు వెబ్‌ ఆప్షన్లు ఉంటాయా? షెడ్యూల్‌ను అనుసరిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక విద్య ఉన్నతాధికారి, ఎప్‌సెట్‌ క్యాంప్‌ అధికారి, జేఎన్టీయూహెచ్‌ రిజి్రస్టార్‌ శనివారం ఉదయం 11 గంటల నుంచే విద్యాశాఖ కార్యదర్శి వద్ద సమావేశమయ్యారు. పాలిసెట్‌ డేటా గందరగోళం అవ్వడంపై కొంత సీరియస్‌గానే చర్చ జరిగినట్టు తెలిసింది. ఆ తర్వాత ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌పై గంటల తరబడి చర్చించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత శనివారం రాత్రి ముఖ్యమంత్రి నివాసానికి అధికారులు వెళ్లి చాలా సమయం చర్చించడంతో అసలేం జరుగుతోందనే ఆసక్తి నెలకొంది.

Weekly Horoscope In Telugu From 06-07-2025 To 12-07-20253
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆసక్తికర సమాచారం నిరుద్యోగులను ఉత్సాహపరుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. సోదరులు కొంత సహాయం అందిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మందగించినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం మ«ధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నలుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.వృషభం...వీరికి మిశ్రమంగా ఉంటుంది. పనులు కొన్ని శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నా అవసరాలకు లోటు ఉండదు. సన్నిహితులతో వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు విజయాల బాటలో పయనిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. ముఖ్య వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇష్టంలేకున్నా కొన్ని మార్పులు తప్పదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా సాగవు. గులాబీ, తెలుపు రంగులు. దుర్గాదేవిని ఆరాధించండి.మిథునం...ఎంతటి వ్యవహారమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. ఆ తరువాత కొంత మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. ప్రముఖులు పరిచయం కాగలరు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అనుకోని పిలుపు రావచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.కర్కాటకం...కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు అన్నింటా అనుకూలమే. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. విష్ణుధ్యానం చేయండి.సింహం...బంధువులు, మిత్రుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో మానసిక అశాంతి. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.కన్య....ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమ మరింత పెరిగి సహనాన్ని పరీక్షిస్తుంది. విద్యార్థులు మరింత కృషి చేస్తే ఫలితం కనిపిస్తుంది. సోదరులు, మిత్రులతో అకారణంగా విరోధాలు. అనుకున్న పనుల్లో ప్రతిబ«ంధకాలు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వివాహ, ఉద్యోగయత్నాలు నిదానంగా కొనసాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. గృహ నిర్మాణాలపై నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు నెమ్మదిగా సాగి స్వల్పలాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. పారిశ్రామికవర్గాలకు లేనిపోని చిక్కులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. విందువినోదాలు. గులాబీ, ఎరుపు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.తుల...ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వాహనయోగం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు సఫలమవుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.వృశ్చికం...కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధువులు, మిత్రులు చేదోడుగా నిలుస్తారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది. సమస్యలు కొన్ని ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. వాహన, గృహయోగాలు కలుగవచ్చు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. కొద్దిపాటి ఆరోగ్యసమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఇంటాబయటా గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, నీలం రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...నేర్పుగా కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల హడావిడి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం. వ్యాపార లావాదేవీలు మరింత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకునే సమయం. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.మకరం...ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. విద్యార్థులు, నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. యుక్తి, నేర్పుతో క్లిష్టమైన వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం చివరిలో ఆరోగ్య, కుటుంబసమస్యలు. అనుకోని ధనవ్యయం. బంగారు, తెలుపు రంగులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.కుంభం...కొన్ని ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ప్రముఖులు మాటసహాయం అందిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. బాకీలు సైతం వసూలై ఆర్థికంగా బలపడతారు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. రాజకీయవర్గాలకు మరింత సానుకూలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, గులాబీ రంగులు. వినాయక స్తోత్రాలు పఠించండి.మీనం...ప్రారంభంలో కొన్ని సమస్యలు, వివాదాలు తప్పకపోవచ్చు. అయితే పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సోదరులు, మిత్రుల సహాయం కోరతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంగతులు గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహ వేడుకలకు హాజరవుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు. కళారంగం వారి సేవలకు గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

NITI Aayog Report on Chemical Industry4
కెమికల్స్‌ దిగ్గజంగా భారత్‌!! 

న్యూఢిల్లీ: దేశీయంగా ప్రపంచ స్థాయి కెమికల్‌ హబ్స్‌ను నెలకొల్పడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్‌ ఒక నివేదికలో సూచించింది. అలాగే అత్యధిక సామర్థ్యాలుండే ఎనిమిది పోర్ట్‌–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అప్పుడే గ్లోబల్‌ కెమికల్‌ తయారీ దిగ్గజంగా భారత్‌ ఎదగగలదని పేర్కొంది. ‘‘రసాయనాల పరిశ్రమ: అంతర్జాతీయ వేల్యూ చెయిన్‌లో (జీవీసీ) భారత భాగస్వామ్యానికి దన్ను’’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వివరించింది. 2040 నాటికి భారత్‌ 1 లక్ష కోట్ల డాలర్ల రసాయనాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీతి ఆయోగ్‌ తెలిపింది. నివేదిక ప్రకారం.. 2023లో జీవీసీలో 3.5 శాతంగా ఉన్న భారత్‌ వాటా 2040 నాటికి 5–6 శాతానికి పెరగనుందని, 2030 నాటికి అదనంగా 7 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని వివరించింది. గ్లోబల్‌ కెమికల్‌ వేల్యూ చెయిన్‌లో భారత్‌ వాటా 3.5 శాతమే ఉండటం, 2023లో రసాయనాల వాణిజ్య లోటు 31 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండటమనేది ముడి సరుకు, ఇతరత్రా స్పెషాలిటీ రసాయనాల కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తున్న విషయాన్ని తెలియజేస్తోందని రిపోర్ట్‌ పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → సమగ్ర ఆర్థిక, ఆర్థికేతర సంస్కరణలు అమలు చేస్తే భారత రసాయనాల పరిశ్రమ 2040 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరేందుకు, జీవీసీలో వాటాను 12 శాతానికి పెంచుకునేందుకు దోహదపడుతుంది. తద్వారా శక్తివంతమైన గ్లోబల్‌ కెమికల్‌ కేంద్రంగా భారత్‌ ఎదగవచ్చు. → కేంద్ర స్థాయిలో ఒక సాధికారిక కమిటీని వేయాలి. ఉమ్మడిగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, వీజీఎఫ్‌ మొదలైన వాటి కోసం బడ్జెట్‌ కేటాయింపులతో సాధికారిక కమిటీ కింద కెమికల్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలి. హబ్‌ స్థాయిలోని అడ్మినిస్ట్రేటివ్‌ యంత్రాంగం, మొత్తం హబ్‌ నిర్వహణను పర్యవేక్షించాలి. → పోర్టుల్లో రసాయనాల ట్రేడింగ్‌కు సవాలుగా ఉంటున్న మౌలిక సదుపాయాల అంతరాలను పరిష్కరించడంలో పోర్టులకు తగు సూచనలివ్వగలిగేలా కెమికల్‌ కమిటీ కూర్పు ఉండాలి. అత్యధిక సామర్థ్యాలున్న 8 పోర్ట్‌ క్లస్టర్స్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. → దిగుమతులు, ఎగుమతి సామర్థ్యాలు, సోర్సింగ్‌ కోసం ఒకే దేశంపై ఆధారపడటం, మార్కెట్‌ ప్రాధాన్యత తదితర అంశాల ఆధారంగా అదనంగా రసాయనాలను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలివ్వాలి. → పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండేలా పర్యావరణ అనుమతుల (ఈసీ) ప్రక్రియను వేగవంతం చేయాలి. కాల పరిమితులు, నిబంధనల అమలును పర్యవేక్షించేలా పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ కింద ఆడిట్‌ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఈసీ క్లియరెన్స్‌ ప్రక్రియలను సరళతరం, వేగవంతం చేయాలి. తరచుగా నివేదికలను ప్రచురించాలి. ఈఏసీకి మరింత స్వయం ప్రతిపత్తినివ్వాలి. → స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో (ఎఫ్‌టీఏ) రసాయనాల పరిశ్రమ కోసం నిర్దిష్ట నిబంధనలను చేర్చేలా భారత్‌ చర్చలు జరపవచ్చు. పరిశ్రమ ప్రయోజనాలను పరిరక్షించేలా టారిఫ్‌ కోటాలు లేదా కీలకమైన ముడిసరుకు, పెట్రోకెమికల్‌ ఫీడ్‌స్టాక్‌లపై సుంకాలపరంగా మినహాయింపులులాంటివి చేర్చే అవకాశాలను పరిశీలించవచ్చు. → అంతర్జాతీయంగా పోటీపడటంలో భారత రసాయన రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఫీడ్‌స్టాక్‌ కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం పెద్ద సవాలుగా ఉంటోంది. ఫలితంగా 2023లో 31 బిలియన్‌ డాలర్ల మేర వాణిజ్య లోటు నమోదైంది. → అంతర్జాతీయంగా పోటీ సంస్థలతో పోల్చి చూసినప్పుడు మౌలిక సదుపాయాల్లో అంతరాలు, కాలం చెల్లిన పారిశ్రామిక క్లస్టర్లు, భారీ స్థాయి లాజిస్టిక్స్‌ వ్యయాలు మొదలైనవి దేశీ సంస్థలకు ప్రతికూలంగా ఉంటున్నాయి. → దీనికి తోడు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై భారత్‌ పెట్టే పెట్టుబడులు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా ఇది సగటున 2.3 శాతంగా ఉండగా, భారత్‌లో 0.7 శాతంగానే ఉంది. అత్యంత విలువైన రసాయనాలను దేశీయంగా ఆవిష్కరించడానికి ఇది ఆటంకంగా ఉంటోంది. → నియంత్రణ సంస్థలపరమైన జాప్యాలు, ముఖ్యంగా పర్యావరణ అనుమతులపరంగా నెలకొన్న సవాళ్లు, పరిస్థితులకు తగ్గట్లు పరిశ్రమ ఎదగడంలో అవరోధాలుగా ఉంటున్నాయి. → పరిశ్రమలో నైపుణ్యాలున్న ప్రొఫెషనల్స్‌ కొరత 30 శాతం మేర ఉంది. ముఖ్యంగా గ్రీన్‌ కెమిస్ట్రీ, నానోటెక్నాలజీ, ప్రాసెస్‌ సేఫ్టీ లాంటి కొత్త విభాగాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది. → ప్రస్తుత సవాళ్లను పరిష్కరించి, ప్రతిపాదిత సంస్కరణలను అమలు చేస్తే, భారత్‌ అంతర్జాతీయంగా పోటీ పడే సామర్థ్యాలను పెంచుకోవచ్చు. పెట్టుబడులను ఆకర్షించవచ్చు. గ్లోబల్‌ వేల్యూ చెయిన్‌కి సారథ్యం వహించేలా రసాయనాల రంగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దుకోవచ్చు.

AP High Court Clear Cut Guidelines On Social Media Arrests5
సోషల్‌ మీడియా అరెస్టులు.. ఏపీ జడ్జిలకు హైకోర్టు సంచలన ఆదేశాలు

ఏపీలో అడ్డగోలుగా జరుగుతున్న సోషల్ మీడియా అరెస్టులలో జరుగుతున్న ఉల్లంఘనలపై ఉన్నత న్యాయస్థానం కన్నెర్ర జేసింది. ఈ తరహా అరెస్టులు, రిమాండ్‌లను కట్టడి చేసే దిశగా అడుగులేసింది. ఒకవైపు ఏపీ జడ్జిలకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూనే.. ఇంకోవైపు హెచ్చరికలూ జారీ చేసింది. సాక్షి, విజయవాడ: ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు, రిమాండ్‌ల విధింపు విషయంలో జరుగుతున్న అడ్డగోలు ఉల్లంఘనలపై ఉన్నత న్యాయస్థానం కన్నెర్ర జేసింది. ఈ క్రమంలోనే ఏపీ జడ్జిలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్‌ విధింపు విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూనే.. ఇంకోవైపు హెచ్చరికలూ జారీ చేసింది. సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారనే అభియోగాలతో ఈ ఏడాది కాలంలో ఏపీలో లెక్కలేనని అరెస్టులు జరిగాయి. అయితే.. ఇలాంటి కేసుల్లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను చాలావరకు జడ్జిలు పాటించడం లేదని ఉన్నత న్యాయస్థానం గుర్తించింది. ఈ క్రమంలో న్యాయమూర్తులకు హైకోర్టు రిజిస్ట్రార్‌ తరఫున తాజాగా ప్రత్యేక సర్క్యులర్‌ జారీ చేయించింది. ‘‘సుప్రీం కోర్టు నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా కొందరు జడ్జిలు రిమాండ్లు విధిస్తున్నారు. అనేక కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇది అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోంది. రిమాండ్ విధించేటప్పుడు తప్పనిసరిగా సుప్రీం గైడ్‌లైన్స్‌ పాటించాలి. ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి. ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్లు.. ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనల, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్ఐఆర్‌లు పెట్టకూడదు. డీఎస్పీ ఆమోదించాకే విచారించాలి. రిమాండ్‌కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా? లేదా? పరిశీలించాలి. మొత్తం 14 రోజుల్లోనే విచారణ పూర్తిచేయాలి.. అని తాజా సర్క్యులర్‌లో హైకోర్టు పేర్కొంది. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌లు ఖచ్చితంగా ఈ సర్క్యులర్ అమలు చేయాలని, ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని, కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని, సదరు మెజిస్ట్రేట్‌లు శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు.. ఇంతకు ముందు ఈ తరహా అరెస్టుల విషయంలో పోలీసుల తీరుపైనా ఉన్నత న్యాయస్థానం అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Sakshi Guest Column On Kancha Kattaya By Kancha Ilaiah6
సైన్స్‌నే నమ్మాడు... మిరాకిల్‌గా నిలిచాడు!

తెలంగాణలో ఓ మారుమూల పల్లెలో దాదాపు అర్ధ శతాబ్దం క్రితం ఓ పల్లెటూరి గొర్లకాపరి కేవలం సైన్సును నమ్మి తన గుండెజబ్బుతో పోరాడి విజయం సాధించిన కథ ఇప్పటికీ మూఢనమ్మకాల్లో కునారిల్లేవారికి మేలుకొలుపు. కంచ కట్టయ్య వరంగల్‌ జిల్లా, చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేటలో 1948లో జన్మించాడు. 11వ తరగతి వరకు నర్సంపేట హైస్కూల్లో చదివి, తల్లి మరణం తరువాత 1969లో పెళ్లి చేసుకొని, వ్యవసాయం– కులవృత్తి గొర్లమంద వ్యవహారం చూసుకునేవాడు.అకస్మాత్తుగా 1976లో ఆయనకు గుండె జబ్బు వచ్చింది. హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రిలో ఫిజిషియన్‌కు చూపించగా, ‘ఈయనకు గుండెలో రెండు వాల్వులు (కవాటాలు) పనిచేస్తున్నట్టు లేవు. బతకడం కష్టం’ అని చెప్పి, తమిళనాడులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (సీఎంసీ) హాస్పిటల్, వెల్లూరులో ఈమధ్య ఆపరేషన్లు చేస్తున్నారనీ, అక్కడికి వెళ్లమనీ చెప్పారు. ఆ రోజుల్లో హైదరాబాద్‌ గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఈసీజీ, ఎకోగ్రామ్‌ వంటి పరికరాలు కూడా లేవు. నిజానికి అప్పటికే ఆయన ఇద్దరు పిల్లల తండ్రి. భార్య నిరక్షరాస్యురాలు. కట్టయ్య హైదరాబాదులో చదువుకుని ఉద్యోగం చేస్తున్న తమ్ముడిని తీసుకొని వెల్లూరు వెళ్ళాడు. పరీక్షలు చేయించుకుంటే ఆయన గుండెలో అతి కీలకమైన వాల్వ్‌ పనిచెయ్యడం లేదని తేల్చారు. 45–50 వేల వరకు ఖర్చుపెట్టగలిగితే ఆపరేషన్‌ చేస్తామన్నారు. ఆపరేషన్‌కు సిద్ధమయ్యాడు కట్టయ్య. సీఎంసీలోని ప్రసిద్ధ థొరాసిక్‌ సర్జన్‌ స్టాన్లీ జాన్‌ యువకుడు. అప్పుడప్పుడే అమెరికాలో తయారై సీఎంసీకి అందుబాటులోకి వచ్చిన స్టార్‌–ఎడ్వర్డ్‌ స్టీల్‌ వాల్వ్‌లను అమర్చడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. 1979 నాటికే పేరున్న సర్జన్‌. గుండెలో అమర్చడం కోసం ఎడ్వర్డ్‌ కంపెనీ చేసిన మొదటి వాల్వ్‌ అది. కట్టయ్య స్కూల్లో ఉన్నప్పుడే సైన్సువాదిగా మారాడు. మూఢ నమ్మకాలు ఊళ్ళలో ఆనాడు కోకొల్లలు. ఈనాటికీ ఉన్నాయి. తాను చనిపోతాడని డాక్టర్లు చెప్పాక కూడా ఒక్క పైసా కూడా మూఢ నమ్మకం మీద ఖర్చు పెట్టనని మొండిచేసిన మనిషి. ‘నన్ను బతికిస్తే డాక్టర్లు, మందులు మాత్రమే బతికించగలవు’ అని గట్టిగా నమ్మాడు. వాల్వ్‌ను గుండెలో పెట్టించుకోవడానికి అప్పులు సప్పులు చేశాడు. సీఎంసీ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌ ఆయనకు 1979 డిసెంబర్‌ 17న ఆపరేషన్‌ చేస్తామని డేట్‌ ఇచ్చింది. ఇటువంటి ఆపరేషన్‌ చేయించుకొని బతికిన మనిషి ఉదాహరణ తన ముందు లేదు. ఆ రోజుల్లో డాక్టర్లు మనుషుల్ని ఇలా ఆపరేషన్‌ చేసి గుండెను రిపేర్‌ చేస్తారనే ఆలోచనే లేదు. గ్రామాల్లో ఆనాడు అసలు చదువే లేదు. డాక్టర్లు ఆపరేషన్‌ ఖర్చులతోపాటు రక్తం ఇవ్వడానికి 8 మంది కావాలని చెప్పారు. అందులో నలుగురు ఎప్పుడైనా ఇచ్చిపోవచ్చు, మరో నలుగురు ఆపరేషన్‌ చేసే రోజే ఇవ్వాలి. ఇది సాధారణ విషయం కాదు. మనిషి శరీరం నుంచి రక్తం తియ్యడమంటేనే భయమున్న రోజులవి. రక్తదానం మీద ఆనాడు అవగాహనే లేదు. మిత్రులు, తమ్ముని సహాయంతో కుటుంబ భారాన్ని భార్యకు, ఒక చెల్లె కుటుంబానికి అప్పజెప్పి 8 మంది రక్తదాతలతో వెల్లూరు వెళ్ళాడు. కట్టయ్యకు స్టాన్లీ జాన్‌ ఆపరేషన్‌ విజయవంతంగా చేశాడు. డాక్టర్‌ చరియన్‌ ఆయనకు అతి జాగ్రత్తగా జీవరక్షణ డ్రగ్స్, ముఖ్యంగా అసిట్రోమ్‌ 0.5 ఎం.జి. సెట్‌ చేశాడు. ఇది అటువంటి కృత్రిమ వాల్వ్‌తో బతికే పేషంటుకు ప్రతిదినం చావో బతుకో నిర్ణయించే ట్యాబ్లెట్‌. అది ప్రతిదినం నిర్ణీత సమయానికి వేసుకోకపోతే రక్తం గడ్డ కడుతుంది. డోసు ఎక్కువైతే రక్తం పలచనై ప్రాణాపాయానికి దారితీస్తుంది.1984లో కట్టయ్యకు మళ్ళీ రక్తం పల్చదనం తగ్గి, బ్రెయిన్‌ క్లాట్స్‌ ఏర్పడి ఫిట్స్‌ రావడం మొదలైంది. భార్య భారతి హైదరాబాదు ఉస్మానియాకు తెచ్చి అడ్మిట్‌ చేసింది. నెల రోజులు కోమాలో ఉన్నాడు. 50 రోజులకు బతికి బయటపడ్డాడు. అప్పటినుంచి హైదరాబాదులో పిల్లలతోనే జీవించడం, హాస్పిటల్‌ అవసరాలు, పిల్లల చదువులు, 2010లో మళ్ళీ నిమ్స్‌లో అడ్మిషన్, 18 రోజులు వెంటిలేటర్‌పై చావుతో పోరాడాడు. ఆయనకు 1979లో అమర్చిన ఎడ్వర్డ్‌ స్టీల్‌ వాల్వ్‌ చక్కగా పనిచేయడం, అప్పుడు నిమ్స్‌ డైరెక్టర్‌గా వున్న డాక్టర్‌ ప్రసాదరావును ఆశ్చర్యపరిచింది. ఆయన పర్యవేక్షణలో మళ్ళీ బతికి బయటపడ్డాడు. పడిపోవడాలు, దినాల తరబడి ఎక్కిళ్ళు, హాస్పిటల్‌ అడ్మిషన్లు నిరంతరం సాగాయి. అయినా బతుకు కొనసాగించాడు.ఈ కట్టయ్య అకస్మాత్తుగా బాత్‌రూమ్‌లో కమోడ్‌పై కూర్చుని ఉండగా, ఆయన గుండెలో అమర్చిన ఫస్ట్‌ జనరేషన్‌ స్టీల్‌ వాల్వ్‌ పనిచేయడం ఆగిపోయి జూన్‌ 7న సైలెంట్‌గా 77వ ఏట కన్నుమూశాడు. ఆయన పుట్టిన గ్రామం పాపయ్యపేటలో అదే నెల 26వ తేదీన ఏర్పాటు చేసిన ‘సైన్సు మనిషి కంచె కట్టయ్య’ యాదిలో జరిగిన సభలో ఉమ్మడి రాష్ట్రంలో నిమ్స్‌లో గుండె ఆపరేషన్లు మొదటగా ప్రారంభించిన ‘పద్మశ్రీ’ దాసరి ప్రసాదరావు 46 ఏళ్లు ఆయన గుండెలో అమర్చిన వాల్వ్‌ గురించి గుండె మోడల్‌ తెచ్చి 40 నిమిషాలు వివరించారు. వందలాది గ్రామస్థులు అది తమ సొంత గుండెకు సంబంధించిన సమస్యగా విన్నారు. 46 ఏళ్లు ఏకైక – అదీ మొట్టమొదట ప్రపంచంలో తయారైన వాల్వ్‌తో ఈయన బతకడం ప్రపంచ రికార్డ్‌ అని ప్రకటించారు. ప్రస్తుతం నిమ్స్‌ డైరెక్టర్‌గా ఉన్న డా‘‘ నగరి బీరప్ప– ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంట్రాలజీ సర్జన్, లండన్‌ ఎఫ్‌ఆర్‌సిఎస్‌ బోర్డ్‌ మెంబర్‌ ‘కట్టయ్య జీవితం ఒక మెడికల్‌ మిరాకిల్‌’ అని పోస్ట్‌ చేశాడు.కట్టయ్య పూర్తిగా మూఢ నమ్మకాల వ్యతిరేకి. మందులు, ఆపరేషన్ల వల్ల మాత్రమే వ్యాధులు తగ్గుతాయి కాని, మూఢ నమ్మకాల వల్ల కాదని జీవితాంతం నమ్మాడు. అలానే జీవించాడు. ఈయన జీవిత ఉదాహరణ ప్రజలను సైన్సు, మానవత్వం వైపు మళ్లిస్తుందని ఆశిద్దాం!కంచ ఐలయ్య షెఫర్డ్‌ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు

Ind vs Eng 2nd Test Day 4 Highlights: Gill Ton England Target 608 Stokes Co Losses 3 Wickets7
Ind vs Eng: పట్టుబిగించిన భారత్‌.. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ తడబాటు!

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత్‌ సంపూర్ణ ఆధిపత్యం సాధించింది. ఆది నుంచి పట్టుబిగించిన గిల్‌ సేన.. ఆతిథ్య జట్టుకు కొండంత లక్ష్యాన్ని విధించింది. బ్యాటింగ్‌లో దుమ్ములేపిన టీమిండియా.. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 427/6 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.తద్వారా ఇంగ్లండ్‌ ముందు ఏకంగా 608 పరుగుల టార్గెట్‌ ఉంచింది. 64/1 ఓవర్‌ నైట్‌ స్కోరుతో టీమిండియా శనివారం తమ ఆట మొదలుపెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ (269)తో చెలరేగిన భారత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ధనాధన్‌ దంచికొట్టాడు. 162 బంతుల్లో 161 పరుగులతో భారీ శతకం సాధించాడు.మిగతా వారిలో ఓపెనింగ్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (55), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (65) అర్ధ శతకాలతో రాణించగా.. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (69 నాటౌట్‌) ​కూడా హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌, షోయబ్‌ బషీర్‌ రెండేసి వికెట్లు తీయగా.. బ్రైడన్‌ కార్స్‌, జో రూట్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు మహ్మద్‌ సిరాజ్‌ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్‌ జాక్‌ క్రాలే (0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు.ఇక మరో భారత పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ మరో ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (25), జో రూట్‌ (6) వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్‌ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్‌ 15, ఓలీ పోప్‌ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఖరిదైన ఐదో రోజు భారత్‌ మిగిలిన ఏడు వికెట్లు కూల్చి గెలుపొందాలని పట్టుదలగా ఉండగా.. విజయానికి 536 పరుగుల దూరంలో ఉన్న ఇంగ్లండ్‌ కనీసం డ్రా కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ రెండో టెస్టు-2025 (బుధవారం (జూలై 2)- ఆదివారం (జూలై 6))👉వేదిక: ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియం, బర్మింగ్‌హామ్‌👉టాస్‌: ఇంగ్లండ్‌- మొదట బౌలింగ్‌👉భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరు- 587 ఆలౌట్‌👉ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరు- 407 ఆలౌట్‌ 👉భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం👉భారత్‌ రెండో ఇన్నింగ్స్‌- 427/6 డిక్లేర్డ్‌- తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకొని మొత్తం 607👉ఇంగ్లండ్‌ లక్ష్యం- 608👉శనివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోరు: 72/3 (16).

Doomsday Passed No Megaquake in Japan8
హమ్మయ్యా.. ఊపిరి పీల్చుకున్న జపాన్‌

క్యాలెండర్‌లో తేదీ మారింది. ఎట్టకేలకు జపాన్‌ ఊపిరి పీల్చుకుంది. ఏదో విపత్తు ముంచేస్తోందని ‘జపాన్‌ బాబా వాంగా’ ర్యో తత్సుకి చెప్పిన కాలజ్ఞానం ఉత్తదేనని తేలిపోయింది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా జపాన్‌ డూమ్స్‌ డే.. చివరకు హుళక్కే అని తేలింది. జులై 5, 2025న మెగా సునామీ జపాన్‌ను ముంచెత్తబోతోందన్న ప్రచారం.. ఉత్తి ఉత్కంఠగానే తేలిపోయింది. భారీ భూకంపంగానీ.. సునామీగానీ సంభవించలేదు. కొన్ని స్వల్ప ప్రకంపనలు, అగ్నిపర్వతం బద్దలు మినహా ఓ మోస్తరు ప్రకృతి వైపరిత్యాలు సంభవించలేదు. తేదీ మారినా.. ఏం జరగకపోవడంతో ఆ దేశ ప్రజలు హమ్మయ్యా.. అనుకుంటున్నారు. 1999లో ప్రచురించబడిన ఓ మాంగా (The Future I Saw) రచయిత ర్యో తత్సుకి.. జులై 5వ తేదీన విపరీతమైన భూకంపం, యుగాంతం తరహాలో సునామీ ముంచెత్తవచ్చని తన చిత్రాలతో బొమ్మలు గీసింది. మీడియాతో పాటు సోషల్‌మీడియాలోనూ జపాన్‌ డూమ్స్‌ డే అంటూ హడావిడి నడిచింది. #JapanTsunami, #July5, #TheFutureISaw వంటివి ట్రెండింగ్ అయ్యాయి. కొంతమంది పర్యాటకులు పర్యటనలు రద్దు చేసుకున్నారు. అందులో భారత్‌ నుంచి కూడా చాలామంది ఉన్నారు. జపాన్ లోని ఆకుసెకిజిమా వాసులను అప్రమత్తంగా తరలించాల్సి వచ్చింది.అయితే.. మేధావులు, సైంటిస్టులు.. ఆ భవిష్యవాణి నిరాధారమైనదిగా చెబుతూనే వస్తున్నారు. మరోవైపు అక్కడి వాతావరణ విభాగం కూడా.. భూకంపాలను అంచనా వేయలేమని మొత్తుకుంటూ వచ్చింది. చివరకు అదే నిజమని తేలింది.

Who is Mooli Devi Worked As Cop With Fake Identitiy For 2 Years9
రెండేళ్లు ఎస్సైగా ట్రైనింగ్‌.. కట్‌ చేస్తే కటకటాల్లోకి!

రెండేళ్లు పోలీస్‌ అకాడమీలో ఎస్సైగా శిక్షణ తీసుకుంది. అకాడమీకి వచ్చే ఉన్నతాధికారులతో సరదాగా మాటలు కలిపింది. డైనమిక్‌ యంగ్‌ ఆఫీసర్‌ అంటూ వాళ్లు కూడా ఆమెను అభినందించేవాళ్లు. అంతేకాదు.. యూనిఫారమ్‌లో రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో వాటిని షేర్‌ చేసుకుని సంబురపడిపోయేది. కట్‌ చేస్తే.. ఇప్పుడు కటకటాల్లో ఊచలు లెక్కపెడుతోంది. జైపూర్‌లోని రాజస్థాన్‌ పోలీస్ అకాడమీ(RPA)లో ఎస్‌ఐగా రెండేళ్లు శిక్షణ పొందిన మోనా అలియాస్‌ మూలీ దేవి(Mooli Devi) ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మోనా బుగాలియా 2021లో ఎస్సై ఎగ్జామ్స్‌ రాసింది. క్వాలిఫై కాలేకపోయింది. దీంతో దొడ్డిదోవ ఎంచుకుంది. మూలీ దేవి అనే పేరుతో ఫోర్జ్‌డ్‌ డాక్యుమెంట్లు సృష్టించి అకాడమీలో ప్రవేశించింది. స్పోర్ట్స్‌ కోటా క్యాండిడేట్‌గా తనను తాను అందరికి పరిచయం చేసుకుంది. అలా అకాడమీ పెద్దలనే బోల్తా కొట్టించి.. రెండేళ్లపాటు అధికారికంగా శిక్షణ పొందింది. ఈ రెండేళ్లలో.. అక్కడికి వచ్చే ఉన్నతాధికారులతో టెన్నిస్‌ ఆడుతూ ఫొటోలు దిగడమే కాకుండా.. వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ట్రైనింగ్ గ్రూప్‌లలో యాక్టివ్ మెంబర్‌గా ఉంటూ వచ్చింది. యూనిఫామ్‌లో రీల్స్ చేయడమే కాకుండా.. మోటివేషనల్ స్పీచ్‌లు ఇచ్చేది. అయితే.. ఆమె ఎప్పుడూ ప్రధాన గేట్ ద్వారా కాకుండా.. అధికారుల కుటుంబాలకు ప్రత్యేకంగా ఉన్న గేట్ ద్వారా అకాడమీకి ప్రవేశించేది. ఈ వీఐపీ వేషాలపై 2023లో కొంతమంది ట్రైనీలకు అనుమానం వచ్చింది. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లగా.. విచారణలో అసలు విషయం బయటపడింది. రెండేళ్లపాటు పరారీలో ఉన్న ఆమెను.. ఇవాళ(జూలై 5న) సికర్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఆమె నుంచి మూడు యూనిఫామ్‌లతో పాటు నకిలీ గుర్తింపు పత్రాలు, పోలీస్ అకాడమీకి సంబంధించిన పరీక్షా పత్రాలు స్వాధీనపర్చుకున్నారు. మోనా బుగాలియా స్వస్థలం నాగౌర్ జిల్లా అని, ఆమె తండ్రి లారీ డ్రైవర్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుగా తన గౌరవాన్ని పెంచుకునేందుకు, తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకునేందుకే తాను ఇలా నాటకం ఆడాల్సి వచ్చిందని ఆమె అంటోంది. మరోవైపు ఈ ఘటనతో పోలీస్‌ అకాడమీ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ చేయకుండా ఎలా శిక్షణకు అనుమతించారని మండిపడుతున్నారు పలువురు. అయితే అత్యంత భద్రత కలిగిన అకాడమీలో ఇలా నకిలీ పత్రాలతో ప్రవేశించడం అంత సులువైన పని కాదని.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని అధికారులు అంటున్నారు.

Nargis Fakhri Reveals She Fast For 9 Days, Survive Only On Water10
9 రోజులు మంచినీళ్లు తాగే బతుకుతా.. అన్నం ముట్టను: హీరోయిన్‌

చాలామంది వారానికోసారి లేదా ఏదైనా పండగ ఉన్నప్పుడు ఉపవాసం చేస్తుంటారు. అలా బాలీవుడ్‌ బ్యూటీ నర్గీస్‌ ఫక్రి (Nargis Fakhri)కి కూడా ఉపవాసం చేసే అలవాటుందట! కాకపోతే ఎప్పుడో ఒకసారి కాదు.. ఏకధాటిగా 9 రోజులు ఏమీ తినకుండా ఉంటుందట! ఇలా ఏడాదికి రెండుసార్లు దీన్ని కఠిన దీక్షలా పాటిస్తానని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నర్గీస్‌ ఫక్రి మాట్లాడుతూ.. నేను ఏడాదికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. ఆ సమయంలో ఏమీ తినను. 9 రోజులు తిండి లేకుండా..తొమ్మిదిరోజులపాటు కేవలం నీళ్లు తాగే బతుకుతాను. ఇది చాలా కష్టంగా ఉంటుంది. 9 రోజులయిపోయేసరికి ముఖం వికృతంగా మారుతుంది. కళ్లు, బుగ్గలు లోపలకు వెళ్లిపోయి, దవడ బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ముఖంలో మాత్రం కాస్త గ్లో ఉంటుంది. అయితే ఇది పాటించమని నేనెవరికీ సలహా ఇవ్వను. చాలామంది ఏదైనా త్వరగా జరిగిపోవాలనుకుంటారు. కానీ దేనికైనా సమయం పడుతుంది. ఉదాహరణకు మంచి నిద్ర కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. నేనైతే రోజూ ఎనిమిది గంటలు నిద్రపోతాను. సినిమాఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉంటాను. విటమిన్స్‌, మినరల్స్‌ వంటి మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. నర్గీస్‌ ఫక్రి.. రాక్‌స్టార్‌ (2011) మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మే తేరా హీరో, హౌస్‌ఫుల్‌ 3, టొర్బాజ్‌, అజర్‌, మద్రాస్‌ కేఫ్‌, అమవాస్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల హౌస్‌ఫుల్‌ 5 సినిమాతో అలరించింది.చదవండి: పాపం.. ఏదో నోరు జారింది.. రష్మికను వదిలేయండి: నటి

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement