letter to central government
-
కేంద్రానికి కేటీఆర్ లేఖ.. అది తెలుగువారి బాధ్యత అంటూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. తాజాగా మంత్రి కేటీఆర్.. కేంద్రానికి బహరంగ లేఖ రాశారు. లేఖలో మోదీ సర్కార్ నిర్ణయాలను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, కేటీఆర్ లేఖ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, కేటీఆర్ లేఖలో..‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు ఆపాలంటూ హితవు పలికారు. కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్లే పన్నాగాలు మానండి. వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు కోసం నిధులు సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పే కుట్ర కేంద్రం చేస్తోంది. తన కార్పొరేట్ మిత్రులకు రూ.12.5లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధాని మోదీ.. స్టీల్ ప్లాంట్ పట్ల ఇదే ఔదార్యం ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. కేంద్రమే ఈ వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆర్థిక సాయం అందించాలి. వైజాగ్ ఉక్కు తెలుగువారి హక్కు.. దీన్ని కాపాడుకోవడం తెలుగువారి బాధ్యత. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’ అని స్పష్టం చేశారు. -
ఇదీ మా ఎజెండా
న్యూఢిల్లీ: చర్చలకు సంబంధించి తమ షరతులను రైతు సంఘాలు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య బుధవారం జరగనున్న చర్చల ఎజెండాను మంగళవారం ఒక లేఖలో ప్రభుత్వానికి పంపించారు. వివాదాస్పద సాగు చట్టాల రద్దుకు విధి విధానాలను రూపొందించడం, కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించడంతో పాటు గతంలో జరిగిన చర్చల సందర్భంగా తాము లేవనెత్తిన మరో రెండు డిమాండ్లపై మాత్రమే చర్చ జరగాలని తేల్చి చెప్పారు. వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను ఆరో విడత చర్చలకు బుధవారం రావాలని ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే. సాగు చట్టాల రద్దు కార్యాచరణ, ఎమ్మెస్పీకి చట్టబద్ధతతో పాటు దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యానికి సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్‌లో సవరణల అంశాన్ని కూడా చర్చించాలని 40 రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ప్రభుత్వానికి పంపిన లేఖలో స్పష్టం చేసింది. అమిత్ షాతో మంతనాలు నేడు రైతు నేతలతో చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, గోయల్ హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరుపై వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం తరఫున రైతులతో వ్యవసాయ మంత్రి తోమర్, రైల్వే మంత్రి గోయల్ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. కొనసాగుతున్న టవర్ల ధ్వంసం రైతులు, రైతు మద్దతుదారులు పంజాబ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో టెలికం టవర్లను ధ్వంసం చేయడాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రిలయన్స్ జియో టెలికం సంస్థకు చెందిన టవర్లకు విద్యుత్ సరఫరా నిలిపేయడం, టవర్లకు చెందిన కేబుల్స్‌ను కత్తిరించడం చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల ప్రధానంగా లబ్ధి పొందేది రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, మరో ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ అని రైతులు భావిస్తున్నారు. పంజాబ్‌లో మంగళవారం దాదాపు 63 టవర్లు ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు. గ్రీన్ రెవెల్యూషన్ @ జిలేబీ సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రైతులు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. సింఘూ సరిహద్దు వద్ద జరిగిన ఓ పెళ్లి ఊరేగింపులో రైతులు ఆకుపచ్చ జిలేబీలను వడ్డించారు. హరిత విప్లవానికి సంకేతంగా ఆకుపచ్చ జిలేబీలను తయారుచేసినట్లు నిరసనలో పాల్గొన్న బల్దేవ్ సింగ్ (65) అనే రైతు చెప్పారు. కాగా, పంజాబ్‌లో రోజుకు దాదాపు అయిదు క్వింటాళ్ల ఆకుపచ్చ జిలేబీ పంచుతున్నామని జస్విర్ చంద్ అనే రైతు తెలిపారు. ఇదిలా ఉండగా హరియాణాలోని కర్నాల్‌లో నిరసన జరుగుతున్న ఓ ప్రాంతంలో నిరసనకారుడు పెళ్లి కుమారుడిలా తయారై ట్రాక్టర్‌పై ఊరేగుతూ విభిన్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. -
ప్రధాని నరేంద్రమోదీకి సీఎం లేఖ
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో ఐఐఐటీని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదివారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. తాను గతంలో ఎంపీగా పనిచేసిన సమయంలో ఐఐఐటీని కరీంనగర్లో ఏర్పాటు చేయాలని కోరుతూ 2018 ఆగస్టులో సీ ఎం ద్వారా పంపిన లేఖకు కొనసాగింపుగా సీఎం ద్వారా మరో లేఖ పంపినట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత కరీంనగ ర్ పట్టణం పారిశ్రామికంగా అభి వృద్ధి చెందిందని, కరీంనగర్‌కు ఐఐఐటీని ఏర్పాటు చేయలని లేఖలో కోరినట్లు తెలిపారు. -
బాబు లేఖతో కాళేశ్వరం ఆగుతుందా?
నంగునూరు(సిద్దిపేట): కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రాకు అన్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు ఢిల్లీకి లేఖ రాస్తే ప్రాజెక్టు ఆగుతుందా అని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎవ్వరు అడ్డుపడ్డా సంవత్సరంలోపు ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు సాగు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 954 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని ఆంధ్ర నాయకులు శ్రీకృష్ణ కమిటీకి అఫిడవిట్ ఇచ్చారన్నారు. వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గోదావరి నదిపై ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు ఢిల్లీకి లేఖ రాయడం ఎంత వరకు సమంజసమన్నారు. మా నీళ్లు మాకు కావాలనే తెలంగాణ తెచ్చుకున్నామని రాష్ట్రం హక్కును కాలరాస్తే ఊరుకునేదిలేదని అన్నారు. తెలంగాణ ఆపేందుకు కాళ్లు కాలిన పిల్లిలా ఢిల్లీకి తిరిగిన చంద్రబాబు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు లేఖలమీద లేఖలు రాస్తున్నాడన్నారు. సంవత్సరంలోపు పూర్తి.. కోర్టు కేసులతో కాంగ్రెసోళ్లు, లేఖలతో చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని చూస్తున్నారని, అయితే ఎవరు అడ్డుపడ్డా సంవత్సరంలోపు నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. కాలువల నిర్మాణానికి రైతులు భూములు ఇవ్వకుండా కాంగ్రెసోళ్లు రాష్ట్రం లోపల కొట్లాడుతుంటే, టీడీపీ బయట నుంచి కొట్లాడుతోందని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమ ఉనికి కోల్పోతామని వారు భయపడుతున్నారన్నారు. -
ఆ లేఖను బాబు రాసినట్టా, రాయనట్టా?
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర న్యాయశాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు 2017లో రాసిన లేఖలను జస్టిస్ ఈశ్వరయ్య ఈమధ్యే బహిర్గతం చేశారు. ఇద్దరు బీసీ న్యాయవాదులు అమరనాథ్ గౌడ్, అభినవ కుమార్‌లను హైకోర్టు జడ్జీలుగా నియమించాలని హైకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా, ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బాబు ఆ లేఖలు రాశారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా విచారణ జరిపించింది. బీసీ న్యాయవాదులపై బాబు చేసిన ఆరోపణలు అబద్ధాలని తేలడంతో ఆ ఇద్దరినీ హైకోర్టు న్యాయమూర్తులుగా కేంద్రం నియమించింది. ఈ అంశాన్ని జస్టిస్ ఈశ్వరయ్య ఆ లేఖల ప్రతులతో సహా విశాఖపట్నంలో మీడియా ప్రతినిధుల ఎదుట బహిర్గతం చేశారు. తర్వాత సీఎం బాబు, యనమల రామకృష్ణుడుతోపాటు బీసీ మంత్రులు ఈశ్వరయ్యను విమర్శిస్తూ ప్రకటనలు చేశారు. కానీ వీరెవ్వరూ ఆ లేఖలు బాబు రాయలేదని గానీ, రాసిన లేఖల్లో బీసీ న్యాయవాదులపై ఆరోపణలు చేయలేదని గానీ, వాటిని తిరస్కరించిన విషయాన్నిగానీ ఖండించలేదు. తమ హయాంలో బీసీ న్యాయవాదులు 9 మంది హైకోర్టు న్యాయమూర్తులుగా అయ్యారంటూ చెబుతున్నారు తప్ప ఆ ఇద్దరు బీసీ న్యాయవాదులకు వ్యతిరేకంగా బాబు కేంద్రానికి లేఖలు రాశారా లేదా అనేదే కీలక ప్రశ్న. ఈ రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఒక్క బీసీ కూడా నియమితులు కాలేదు కానీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులు ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జీలుగా ఎలా నియమితులయ్యారు. ఇందులో బాబు దొడ్డిదారి ప్రయత్నం లేదా? ఏపీ హైకోర్టులో గత 7 దశాబ్దాల కాలంలో ఆయా ప్రభుత్వాల హయాంలో ఎంతమంది బీసీ న్యాయవాదులు జడ్జీలుగా నియమితులయ్యారు. అప్పుడు మొత్తం హైకోర్టు జడ్జీల సంఖ్య ఎంత? వారిలో బీసీ జడ్జీలు ఎందరు? అలాగే హైకోర్టులో, జిల్లా కోర్టుల్లో కూడా ఎంతమందిని లా ఆఫీసర్లుగా ప్రభుత్వాలు నియమించాయి? వారిలో బీసీలు ఎంత మంది? వంటి వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని రాష్ట్రప్రభుత్వం, మంత్రి యనమల తక్షణమే ప్రకటించాలి. అప్పుడే బీసీలకు సామాజిక న్యాయాన్ని ఏపార్టీ, ఏమేరకు చేసిందో తేలిపోతుంది. – వై. కోటేశ్వరరావు, రాష్ట్ర కన్వీనర్, బీసీ మహాజన సమితి, 98498 56568 -
ముఖ్యమంత్రి నిజస్వరూపం బయటపడింది
సాక్షి, విజయవాడ సిటీ: బీసీలంటే సీఎం చంద్రబాబుకు ఎంత అలుసో మరోసారి తేటతెల్లమైందని.. ఆయన నిజస్వరూపం బయటపడిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. బీసీలు, దళితులు హైకోర్టు జడ్జీలుగా పనికిరారంటూ చంద్రబాబు తప్పుడు నివేదికలు పంపారంటూ జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆధారాలతో సహా చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారనే విషయాన్ని వైఎస్సార్సీపీ ఎప్పట్నుంచో చెబుతోందన్నారు. చంద్రబాబులో కులతత్వం ఏ స్థాయికి చేరుకుందో జస్టిస్ ఈశ్వరయ్య డాక్యుమెంట్లతో సహా నిరూపించారన్నారు. బీసీ వర్గానికి చెందిన జడ్జీలపై తప్పుడు ఆరోపణలు చేసి.. వారికి చెందాల్సిన అవకాశాలను చంద్రబాబు ఏ వి«ధంగా కాలరాశారో ఈశ్వరయ్య సవిరంగా వివరించారని చెప్పారు. బీసీలైన అమర్నాథ్గౌడ్, అభినవకుమార్తో పాటు ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ కులానికి చెందిన డీవీ సోమయాజులపై తప్పుడు నివేదికలు ఎందుకు పంపారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జడ్జీల నియామకాల్లో చంద్రబాబు పోషించిన పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీసీల్లో ఎవరినైనా ప్రిన్సిపల్ సెక్రటరీలుగా గానీ, డిపార్ట్మెంట్ హెడ్లుగా గానీ నియమించావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. బీసీ డిక్లరేషన్‌లోని ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని మండిపడ్డారు. బీసీలంటే బాబు గారి క్లాస్ అని.. అందులో లోకేశ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీలు, ఎల్లో మీడియా మాత్రమే ఉంటాయన్నారు. కాగా, ప్రత్యేక హోదా ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలతో సమావేశమైతే దానిపై ఎల్లో మీడియా దుష్పచారం చేసిందని పార్థసారథి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ వార్తలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ అంశంపై న్యాయపరంగా పోరాటం చేస్తామని పార్థసారథి తెలిపారు. ఇది ఏరకమైన జర్నలిజమని ఆయన ప్రశ్నించారు. -
'ఎస్జీటీ పోస్టుల అర్హతపై కేంద్రానికి లేఖ రాస్తాం'
-మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కర్నూలు : సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ చేసిన అభ్యర్థులను అర్హులుగా గుర్తించాలని కోరుతూ ఈ నెలాఖరులోపు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం కర్నూలుకు వచ్చిన మంత్రిని బీఈడీ అభ్యర్థులు కలసి తమకు ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించాలని కోరారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ లో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అర్హులుగా గుర్తించిన విషయాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకురాగా.. అందుకు ఆయన స్పందించి ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తాను చర్చించానని, కేంద్రానికి లేఖ రాయమని సలహా ఇచ్చినట్లు చెప్పారు. ఈ నెలాఖరులో తానే ఢిల్లీకి వెళ్లి మానవ వనరుల శాఖాధికారులను కలసి పశ్చిమ బెంగాల్‌కు అనుమతి ఇచ్చిన విధంగానే ఏపీకి ఇవ్వాలని కోరతానన్నారు. ఒకవేళ కేంద్రం ఏస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అర్హులుగా గుర్తిస్తే ప్రస్తుతం ప్రకటించిన డీఎస్సీలోనే అమలు చేయాలని బీఈడీ అభ్యర్థులు కోరగా దానిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ-2015 పరీక్షలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే ఆ పరీక్షలకు సంబంధించిన హాల్‌టిక్కెట్లు కూడా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్నారని, పరీక్షలను వాయిదా వేయకపోవచ్చునని మంత్రి సూచన ప్రాయంగా తెలిపారు. రాష్ట్ర విద్యార్థినులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు ఇచ్చే యోచనలో ఉన్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.