పాత లెవీ విధానాన్నే కొనసాగించండి: సునీత
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం రూపొందించిన కొత్త లెవీ విధానంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. పాత లెవీ విధానాన్నే కొనసాగించాలని కోరింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత బుధవారం ఢిల్లీలోని కృషిభవన్‌లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌ను కలసి ఈ మేరకు విన్నవించారు. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం మంత్రి సునీత కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజుతో భేటీ అయ్యారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఏవియేషన్ అకాడమీ ఏర్పాటుపై మాట్లాడారు.