రామలింగరాజుకు లైబ్రరీ బాధ్యతలు
హైదరాబాద్ సిటీక్రైం: ‘సత్యం’ కుంభకోణం కేసులో చర్లపల్లి కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న రామలింగరాజుకు జైలు అధికారులు గ్రంథాలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ఆయనతోపాటు జైలులో ఉన్న రామరాజుకు వయోజన విద్య బాధ్యతలను గురువారం అప్పగించారు. ఈ మేరకు జైలు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.