లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్ష
ఒంగోలు టౌన్ : లైసెన్స్డ్ సర్వేయర్స్ రెండో బ్యాచ్ ఫైనల్ పరీక్షకు 53 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 45 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం అభ్యర్థులకు శనివారం స్థానిక సీఎస్ఆర్ శర్మ కాలేజీలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు థియరీ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్లాటింగ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ పరిశీలించారు.
శిక్షణను హాజరైన అభ్యర్థులు, పరీక్షకు హాజరైన వారి సంఖ్య తదితర వివరాలను సర్వే అండ్ ల్యాండ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావునడిగి తెలుసుకున్నారు. లైసెన్స్డ్ సర్వేయర్స్ ఫైనల్ పరీక్షకు హాజరైన అభ్యర్థులను మూడు బ్యాచ్‌లుగా విభజించి ఆదివారం నుంచి ఫీల్డ్ వర్క్‌కు పంపించనున్నట్లు సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ నరసింహారావు తెలిపారు. మండలాల్లో సర్వేయర్ల వద్ద వీరు 42 రోజులపాటు శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు.