lid
-
మూడు సంవత్సరాల్లో 351 కాలేజీలు మూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత మూడేళ్లలో వివిధ వృత్తి విద్యా కోర్సులను నిర్వహించే 351 కాలేజీలు మూత పడ్డాయి. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)కి వచ్చిన ఫీజు ప్రతిపాదనలతో ఈ విషయం వెల్లడైంది. వచ్చే మూడేళ్లలో ఆయా కాలేజీల్లోని వివిధ కోర్సులకు నిర్ణయించాల్సిన ఫీజుల కోసం కాలేజీ ఆదాయ, వ్యయాలు, కొత్త ఫీజు ప్రతిపాదనలు ఇవ్వాలని టీఏఎఫ్ఆర్సీ కాలేజీల నుంచి ప్రతిపాదనలను స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించింది. తాజాగా ఈ నెల 27వ తేదీ వరకు గడువును పెంచింది. అయితే ఇకపై కొత్తగా దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకొని, నిర్ణీత ఫీజు చెల్లించి, హార్డ్ కాపీలను అందజేయాల్సి ఉండటంతో ఈ గడువును పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, గడిచిన మూడేళ్లలో వసూలు చేసిన ఫీజులకు ప్రతిపాదనలు అందజేసిన కాలేజీల సంఖ్యతో పోల్చితే 351 కాలేజీలు మూత పడినట్లుగా తెలుస్తోంది. 2016–17, 2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో రాష్ట్రంలోని వృత్తి విద్యా కాలేజీల్లో నిర్వహించే కోర్సులకు వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేసేందుకు కాలేజీల నుంచి అంతకుముందు మూడేళ్ల ఆదాయ వ్యయాలను, కొత్త ఫీజల ప్రతిపాదనలను 2015లో ఏఎఫ్ఆర్సీ స్వీకరించింది. వాటి ఆధారంగా ఫీజులను నిర్ణయించింది. అయితే అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా 1,586 కాలేజీలు ఫీజుల ప్రతిపాదనలను ఇచ్చాయి. కానీ ఈసారి 1,235 కాలేజీలు మాత్రమే ఫీజుల ప్రతిపాదనలను ఇవ్వడంతో మిగిలిన 351 కోర్సులను నిర్వహించే కాలేజీలు మూత పడినట్లుగానే అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం ఫీజుల నిర్ణయం కోసం ఏఎఫ్ఆర్సీకి దరఖాస్తు చేసుకుంటేనే ఆ కాలేజీల్లో ఆయా కోర్సులు కొనసాగుతున్నట్లు లెక్క. లేదంటే ఆ కాలేజీలో ఆ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదు. అత్యధికంగా బీటెక్, ఎంటెక్‌లోనే.. రాష్ట్రంలో బీటెక్, ఎంటెక్ కాలేజీలే ఎక్కువగా మూత పడ్డాయి. 2015–16 విద్యా సంవత్సరం వరకు 268 కాలేజీలు బీటెక్ కోర్సును నిర్వహిస్తున్నాయి. ఆ కాలేజీలో కొత్త ఫీజుల కోసం అప్పట్లో దరఖాస్తు చేసుకున్నాయి. ఇపుడు 2019 నుంచి 2022 వరకు మూడేళ్ల పాటు వసూలు చేయాల్సిన కొత్త ఫీజుల కోసం కేవలం 197 కాలేజీలే దరఖాస్తు చేసుకున్నాయి. అంటే 71 బీటెక్ కాలేజీలు మూత పడ్డాయి. మరోవైపు ఎంటెక్‌ను నిర్వహిస్తున్న 235 కాలేజీలలో ఇపుడు 130 కాలేజీలు మాత్రమే కొత్త ఫీజుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 105 కాలేజీలు మూత పడ్డాయి. అలాగే గతంలో 228 బీఈడీ కాలేజీలు ఫీజులకు దరఖాస్తు చేసుకోగా, ఇపుడు 196 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. మిగతావన్నీ మూత పడ్డట్టుగానే భావిస్తున్నారు. -
131 స్కూళ్ల మూత
► యూపీ స్కూళ్లలో మిగులనున్న టీచర్లు 77 మంది ► ప్రైమరీ పాఠశాలల్లో మిగులు టీచర్లు 372 మంది కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల రేషనలైజేషన్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా 131 స్కూళ్లు మూతపడనున్నాయి. ఇందులో 290 అప్పర్‌ప్రైమరీ(యూపీ) స్కూళ్లలో సున్న విద్యార్థుల సంఖ్య ఉన్న 34 పాఠశాలను మూసేయనున్నారు. అలాగే తక్కువగా పిల్లలు ఉన్న 26 స్కూళ్లను సమీపంలోని పాఠశాలల్లో కలపనున్నారు. మొత్తంగా 60 పాఠశాలలు మూతపడనున్నాయి. ప్రైమరీకి సంబంధించి 2215 స్కూళ్లకు గాను సున్న విద్యార్థులున్నవి 60 ఉండగా మరో ఎనిమిందింటిని పక్కవాటిలో కలపనున్నారు. మరో 3 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో వాటిని కూడా మూసివేయనున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా ప్రైమరీ, యూపీ, ఉన్నత పాఠశాలలు కలిసి మొత్తంగా 131 మూతపడనున్నాయి. పదిమంది విద్యార్థులు ఉన్న 46 పాఠశాలలను మాత్రం ఈ ఏడాది కొనసాగించనున్నారు. వీటిల్లో వచ్చే ఏడాదిలోగా సంఖ్యను పెంచితే కొనసాగుతాయి లేకుంటే ఇవి కూడా మూతపడతాయి. 6,7 తరగతులు ఉన్న యూపీ స్కూల్స్‌కు సంబంధించి 30 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న 14 తెలుగు, 1 ఉర్దూ పాఠశాలకు ఉపాధ్యాయుడిని మంజూరు చేస్తారు. అలాగే 30 మంది కంటే తక్కువున్న 152 పాఠశాలలకు పోస్టులను మంజూరు చేయరు. పులివెందుల నియోజక వర్గంలోని పెద్దరంగాపురం , ఉలిమెళ్ల యూపీ స్కూల్స్‌ను అంకాలమ్మపేట జెడ్పీ పాఠశాలలో కలపనున్నారు. చిన్నరంగాపుర యూపీ స్కూల్‌ను బ్రాహ్మణపల్లె జెడ్పీ స్కూల్లో తుమ్మలపల్లె యూపీ స్కూల్‌ను జెడ్పీ స్కూల్ ఇనగలూరులో కలపనున్నారు. ప్రైమరీ పాఠశాలలకు సంబంధించి టి.సుండుపల్లిలో రెండు, లింగాలలో రెండు , చిట్వేల్, సిద్దవటంలో, వేములలో ఒక్కో పాఠశాలను పక్క స్కూల్స్‌లో కలపనున్నారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలకు సంబంధించి 30 మంది లోపు విద్యార్థులున్న రాయచోటి మండలం అంబవరం పాఠశాలను 0 విద్యార్థులున్న చిట్వేల్ మండలం తిమ్మయ్యగారిపల్లె, కమలాపురం మండలం పి రాజుపాలెం పాఠశాలను మూసివేయనున్నారు. రాయచోటి మండలం దిగువ అబ్బవరం ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున దానిని నిబంధనల ప్రకారం చెన్నముక్కపల్లె ఉన్నత పాఠశాలలో కలపనున్నారు. యూపీ స్కూల్లో మిగులు ఉపాధ్యాయుల వివరాలు యూపీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ లెక్కలకు సంబంధించి తెలుగు పాఠశాలల్లో 7 మంది మిగలగా 12 మంది అవసరం ఉన్నారు. ఫిజిక్స్ విభాగంలో 4 మిగలగా 12 మంది అవసరం ఉన్నారు. బయాలజీలో 28 మంది మిగలగా 21 మంది అవసరం ఉన్నారు. సైన్సుకు సంబంధించి 29 మంది మిగలగా 22మంది అవసరం ఉన్నారు. ఇంగ్లిషు విభాగంలో 41 మంది అవసరం ఉన్నారు. లాంగ్వేజ్ పండిట్ తెలుగుకు సంబంధించి 11 మంది మిగలగా 26 మంది అవసరం అన్నారు. హిందీకి సంబంధించి 7 మంది మిగలగా 29 మంది అవసరం ఉన్నారు. ఉర్దూలో మాథ్స్‌కు ముగ్గురు, పీఎస్‌కు నలుగురు, బయాలజీకి నలుగురు, సైన్సుకు ఒక్కరు అవసరం ఉన్నారు.ప్రైమరీ సెక్షన్ ఇన్ యూపీ స్కూళ్లకు ఎస్జీటీ తెలుగుకు సంబంధించి 65 మంది మిగలగా 19 మంది అసవరం ఉన్నారు. ప్రైమరీ సెక్షన్ ఇన్ యూపీ పాఠశాలల్లో ఎస్జీటీ ఊర్దూకు సంబంధించి 6 మంది మిగలగా ఆరుగురు అవసరం ఉన్నారు. ప్రైమరీ పాఠశాలల్లో.. ప్రైమరీ పాఠశాలల్లో ఎస్జీటీలకు సంబంధించి 372 పోస్టులు మిగలగా 137 మంది అవసరం ఉన్నారు. అలాగే ఉర్దూ విభాగంలో 35 మంది మిగలగా 11 మంది అవసరం ఉన్నారు. ప్రైమరీ స్కూల్స్‌లో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఎస్జీటీలో ఐదుగురు, బ్లైండ్ స్పెషల్ స్కూల్లో ఏడుగురు మిగులుగా ఉన్నారు. వీరిని మాత్రం ఎక్కడికి మార్చేందుకు వీలు ఉండదు. మొత్తం 449 మంది మిగులుగా ఉండగా 156 మంది అవసరం అన్నారు. ఉర్దూ విభాగంలో 41 మంది మిగులు ఉండగా 17 మంది అవసరం ఉన్నారు. రేషనలైజేషన్ నిర్వహించగా మిగులు ఉపాధ్యాయులకు పని ఒకచోట కల్పించి జీతాలు మరో చోట ఇవ్వనున్నారు. నెలాఖరు లోగా పూర్తి చేస్తాం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులకు సంబం«ధించిన కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని ఈనెలాఖరులోగా పూర్తి చేస్తాం. జూలై ఒకటికల్లా బదిలీ అయిన ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో చేరేలా ఉత్తర్వులు ఇస్తాం. – పొన్నతోట శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి -
చిన్నారి గొంతులో సీసా మూత..
వనపర్తి: ఎనిమిది నెలల బాలుడు సీసా మూతను మింగటంతో వైద్యులు చాకచక్యంగా వ్యవహరించి మూతను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఈ ఘనత వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు దక్కింది. పెళ్లయిన పదేళ్లకు పుట్టిన బాబుకి ప్రమాదం తప్పడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. వనపర్తి జిల్లా కేంద్రం రాంనగర్ కాలనీకి చెందిన యాదగిరి, లత దంపతులకు ఎనిమిది నెలల దేవేంద్ర ఉన్నాడు. గురువారం ఇంట్లో ఆడుకుంటూ మెంతో ప్లస్ బామ్ మూత మింగడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. ఆహార వాహికకు అడ్డంగా ఉండిపోవడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్‌ఆస్పత్రులకు వెళ్లినా ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. గొంతులో మూత వాయునాళానికి అడ్డం పడితే ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. చివరి ప్రయత్నంగా వారు వనపర్తి ప్రజా వైద్యశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు ధైర్యంగా ఉంటామని హామీ ఇవ్వడంతో వైద్యులు ఎక్స్-రే తీసి మూత గొంతు కింది భాగంలో ఉందని గుర్తించారు. తర్వాత బాలుడికి మత్తు ఇచ్చి.. ఎలాంటి సర్జరీ లేకుండా ‘క్రొకడైల్ ఫిరెక్స్’ అనే పరికరం సహాయంతో డాక్టర్లు మురళీధర్, హరికిషన్ చాకచక్యంగా తొలగించారు. ఆ సందర్భంగా ప్రజావైద్యశాల నిర్వాహకుడు డాక్టర్ మురళీధర్ మాట్లాడుతూ మొదట్లో కర్నూల్‌కు రెఫర్ చేద్దామనుకున్నామన్నారు. అక్కడికి వెళ్లేలోపు ప్రమాదం జరగవచ్చని భావించి.. తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచడంతోనే మూతను తొలగించామని చెప్పారు. -
మరో పవర్‌హౌస్ మూత
గోదావరిఖని 18 మెగావాట్ల ప్లాంట్ మూసివేతకు సింగరేణి నిర్ణయం ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం ఆందోళన బాటలో కార్మిక సంఘాలు గోదావరిఖని (కరీంనగర్) : కంపెనీ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి యాజమాన్యం గోదావరిఖనిలో నెలకొల్పిన 18 మెగావాట్ల పవర్‌హౌస్ మూతపడనుంది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద సింగరేణి ఆధ్వర్యంలోనే 1800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పవర్‌హౌస్‌లో పనిచేస్తు న్న ఉద్యోగులను బదిలీ చేయడంలో భాగంగా స్థానికంగా ఉన్న డిపార్ట్మెంట్లకు వెళ్లడానికి దరఖాస్తులు సమర్పించాలని కోరింది. ఈ క్రమంలో పవర్‌హౌస్ మూసివేయవద్దని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకు 1998లో బెల్లంపల్లి పవర్‌హౌస్, 2014లో కొత్తగూడెం పవర్‌హౌస్ మూసివేతకు గురికాగా ఆ జాబితాలో గోదావరిఖని పవర్‌హౌస్ చేరనున్నది. 1968 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం రామగుండం రీజియన్‌లో 1959 సంవత్సరం బొగ్గుగను లు చేపట్టగా 1961 నుంచి బొగ్గును వెలికితీత ప్రారంభమైంది. ఆ సమయంలో విద్యుత్‌కు ఇబ్బందిగా మారడం తో యాజమాన్యం గోదావరిఖనిలో 18 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్‌హౌస్‌ను రుమేనియా దేశ సాంకేతిక పరిజ్ఞానంతో రూ.7కోట్ల వ్యయంతో నిర్మించింది. 1968 నుంచి మూడు టరై్బన్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైం ది. మొదట్లో 18 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినా.. క్రమేణా ఒక టరై్బన్‌తో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికే పరిమితమైంది. ఈ పవర్‌హౌస్‌లో 248 మంది పనిచేయా ల్సి ఉండగా ప్రస్తుతం 111 మంది మాత్రమే ఉన్నారు. రామగుండం, శ్రీరాంపూర్ ఏరియాలకు సరఫరా పవర్‌హౌస్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రామగుండం రీజియన్, శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని పలు బొగ్గుగను లు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్నారు. పలు కాలనీలకు సైతం వినియోగిస్తున్నారు. 2013లో పవర్‌హౌస్‌లోని రెండవ టరై్బన్‌కు సంబంధించి రన్నర్ రీ–బ్లేడింగ్ చేయడానికి రూ.70లక్షల వ్యయంతో హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఇప్పటివర కు ఆ టరై్బన్‌ను సదరు సంస్థ తీసుకువచ్చిన దాఖలాలు లేవు. దీంతో ప్రస్తుతం ఒకే టరై్బన్‌తోనే నాలుగు మెగావా ట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. బదిలీలకు దరఖాస్తుల ఆహ్వానం పవర్‌హౌస్ మూసివేతన నేపథ్యంలో అందులో పనిచేస్తు న్న ఉద్యోగుల్లో మొదటి విడతగా వివిధ డిజిగ్నేషన్లకు చెందిన 15 మందిని స్థానికంగా ఉన్న ఏరియా వర్క్‌షాపు, ఆటో వర్క్‌షాపులకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాల ని యాజమాన్యం ప్రకటించింది. అయితే పవర్‌హౌస్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, కార్మికులను బదిలీ చేసే ఆలోచనను విరమించుకోవాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.