life time scheme
-
ఇది కదా జాక్‌పాట్.. ఏడాదికి రూ.20 లక్షల చొప్పున జీవితాంతం
లాన్సింగ్: లాటరీలో అదృష్టం వరించిన వారికి ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు వస్తాయని అందరకీ తెలుసు. కానీ, ప్రతి ఏడాది లక్షల రూపాయలు జీవితాంతం లభిస్తే అది జాక్‌పాట్‌కే జాక్‌పాట్ అంటారు కదా? అలాంటి జాక్పాట్నే కొట్టేశాడు మిచిగాన్కు చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి. ఏడాదికి రూ.20లక్షల చొప్పున జీవితాంతం పొందే లాటరీని సొంతం చేసుకున్నాడు. ఆన్లైన్లో రాండమ్ నంబర్ జనరేటర్లో తన టికెట్‌పై ఉన్న నంబర్లను పొంది ఈ లాటరీ గెలుపొందనట్లు యూపీఐ పేర్కొంది. ఆయనే.. మిచిగాన్‌లోని వారెన్ ప్రాంతానికి చెందిన అరోన్ ఎసెన్‌మాచెర్(50). వారెన్ హ్యాపీ డేస్ పార్టీ స్టోర్‌లో సెప్టెంబర్ 15న లక్కీ ఫర్ లైఫ్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.‘నేను లక్కీ ఫర్ లైఫ్ ఆడాను. ప్రతిసారి ఒకే సెట్ నంబర్లను వినియోగించాను. నేను నా టికెట్ కొనుగోలు చేసినప్పుడు సాధారణంగానే సంఖ్యలను ఎంచుకున్నాను. తర్వాత ఆన్లైన్లో కనుగొన్న రాండమ్ సంఖ్యలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నా. డ్రా తీసిన తర్వాతి రోజు నేను నంబర్లను తనిఖీ చేశాను. నేను ఐదు నంబర్లను సరిగా మ్యాచ్ చేసినట్లు తెలుసుకున్నాను. రాండమ్ నంబర్ జనరేటర్లో గెలుపొందిన నంబర్లే ఇక్కడా వచ్చాయి. దాంతో షాక్‌కు గురయ్యాను. ధ్రువీకరించుకునేందుకు నా టికెట్‌ను యాప్‌లో పలుమార్లు స్కాన్ చేసి చూశాను. అప్పుడు నిజంగానే వచ్చిందని తెలుసుకున్నా.’ అని తెలిపారు అరోన్ ఎసెన్‌మాచెర్. ఐదు తెల్లని బంతులపై 02-18-27-41-45 సంఖ్యలు రావటంతో అరోన్ ఎసెన్‌మాచెర్ ఈ జాక్‌పాట్ గెలుపొందారు. దీంతో ఏడాదికి 25వేల డాలర్లు(రూ.20లక్షలు) పొందేందుకు అర్హత సాధించారు. ఇవి 20 ఏళ్లు లేదా జీవితాంతం(ఏది మందుగా వస్తే అది) చెల్లిస్తుంది లాటరీ సంస్థ. అయితే, ఈ 20 ఏళ్ల పాటు చెల్లించే డబ్బులు మొత్తం రూ.3.2 కోట్లు ఒకేసారి ఇవ్వాలని అరోన్ కోరినట్లు లాటరీ సంస్థ పేర్కొంది. అప్పులు చెల్లించాలని, మిగిలిన వాటితో టూర్‌కు వెళ్లాలని చెప్పినట్లు తెలిపింది. లక్కీ ఫర్ లైఫ్ ఆడేందుకు కేవలం 2 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నిసార్లైనా ఆడొచ్చు. ఈ గేమ్‌లో రోజుకు వెయ్యి డాలర్లు జీవితాంతం చెల్లించటం అతిపెద్ద ప్రైజ్. 1 నుంటి 48 నంబర్ల మధ్య ఐదు నంబర్లను సహా ఓ లక్కీ బాల్ 1-18 నంబర్లును మ్యచ్ చేస్తే గెలచుకోవచ్చు. అయితే, లక్కీబాల్ కాకుండా ఐదు నంబర్లు మాత్రమే సరిగా గుర్తిస్తే ఏడాదికి రూ.20 లక్షలు వస్తాయి. ఇదీ చదవండి: జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్ గిఫ్ట్‌లు’.. మరో వివాదంలో కర్ణాటక ప్రభుత్వం -
ఎల్ఐసీ కొత్త మనీ బ్యాక్ పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎల్ఐసీ మారిన నిబంధనలను అనుసరించి పాత జీవిత బీమా పథకాలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది. ఇం దులో భాగంగా ‘ప్రీమియం ఎండోమెంట్’ పేరుతో తొలి పథకాన్ని ప్రవేశపెట్టగా, సోమవారం నుంచి న్యూ మనీ బ్యాక్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. 20, 25 ఏళ్ళ కాలపరిమితితో లభించే ఈ మనీబ్యాక్ పాలసీలకు చెల్లించాల్సిన ప్రీమియం కాలపరిమితులను వరుసగా 15, 20 ఏళ్లుగా నిర్ణయించడమైనది. 20 ఏళ్ల పాలసీలో ప్రతీ 5 ఏళ్లకు 20% చొప్పున, అదే 25 ఏళ్లయితే 15%చొప్పున వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. వార్షిక ప్రీమియానికి 10 రెట్లు బీమా రక్షణ, మరణం సంభవిస్తే 125% బీమా రక్షణ మొత్తాన్ని చెల్లిస్తారు. ఇక జీవిత బీమా పథకాల విషయానికి వస్తే ప్రతీ సంవత్సరం లేదా ఒకేసారి ప్రీమియం చెల్లించే విధంగా రెండు రకాల ఎండోమెంట్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. కనీసం 12 నుంచి 35 ఏళ్ళ కాలపరిమితితో ఈ పాలసీని 8 నుంచి 55 ఏళ్లలోపు వారు తీసుకోవచ్చు. కాలపరిమితి మధ్యలోనే పాలసీదారుడు మరణిస్తే చెల్లించిన ప్రీమియానికి 105% తక్కువ కాకుండా క్లెయిమ్ మొత్తాన్ని చెల్లిస్తుంది. అదే సింగిల్ ప్రీమియం పాలసీలో కనీస కాలపరిమితిని 10 ఏళ్లు, గరిష్ట కాలపరిమితిని 25 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ పాలసీలపై రుణ సౌకర్యం కూడా ఉంది.