Lift man
-
రక్షించినందుకు చెంపదెబ్బలు తిన్న సెక్యూరిటీ గార్డు
ఇటీవలకాలంలో చిన్న స్థాయిలో ఉన్న ఉద్యోగులంటే చిన్న చూపో ఏంటో తెలియదు. వారిపట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. ఐనా మనుషులన్నాక తప్పులు అనేవి సహజం. మందలించి వదిలేయాలి గానీ చేయి జేసుకోవడం అనాగరికం. ఇక్కడొక వ్యక్తి కూడా సెక్యూరిటి గార్డు పట్ల అలానే అనుచితంగా ప్రవర్తించాడు. వివరాల్లోకెళ్తే...గుర్గావ్లోని వరుణ్ నాథ్ అనే వ్యక్తి సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే సెక్యూరిటీ గార్డు అప్రమత్తమై ఆ వ్యక్తిని రక్షించి బయటకు వచ్చేలా చేశాడు. ఐతే ఆ వ్యక్తి ఆ ప్రమాదం నుంచి బయటపడి వచ్చిన వెంటనే అదే పనిగా సెక్యూరిటీ గార్డును చెంపదెబ్బలు కొడతాడు. ఆ తర్వాత ఆ లిఫ్మ్యాన్ని కూడా గట్టిగా కొడతాడు. #WATCH | Haryana: A resident of The Close North Apartments in Gurugram thrashed security guards after being briefly stuck in lift; FIR filed I helped him get out of the lift within 3-4 minutes. As soon as he got out, he started beating me up: Guard Ashok Kumar (CCTV visuals) pic.twitter.com/mtcXOy8zTh — TOI Gurgaon (@TOIGurgaon) August 29, 2022 ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో అపార్ట్మెంట్ గార్డులు వరుణ్‌నాథ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. అంతేగాదు సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవల నోయిడాలో ఒక మహిళ గేట్ ఆలస్యంగా తీసినందుకు సెక్యూరిటీ గార్డును దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించి జైలు పాలైన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. (చదవండి: ఆస్ట్రిచ్ పక్షిలా దుస్తులు ధరించి... జూలో హల్చల్! ఎందుకలా చేశాడంటే...) -
నన్ను అసభ్యంగా తాకి వేధించాడు: టాప్ హీరో
ముంబయి: లైంగిక వేధింపులు మహిళలకే కాదు.. పురుషులకు కూడా ఉంటాయనే విషయం కొన్ని సంఘటనల ద్వారా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే, నేరం బయటకు వస్తే తప్ప పురుషులకు సంబంధించిన అలాంటి సంఘటలు వెలుగుచూడటం చాలా అరుదు. బయటకు చెప్పేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడం కూడా ఇందుకు కారణం. కానీ, ఇలాంటి విషయాలను చెప్పడంలో తాను ఎప్పుడూ ముందుటానని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి ముంబయిలో జరిగిన ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాలుడిగా ఉన్న సమయంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను నిర్మొహమాటంగా బయటకు చెప్పేశారు. ’నేను మీతో ఒక విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను బాలుడిగా ఉన్న సమయంలో మేం ఉంటున్న చోట లిఫ్ట్ ఆపరేట్ చేసి వ్యక్తి నన్ను అనుచితంగా తాకేవాడు. లైంగికంగా ఇబ్బంది పెట్టేవాడు. అయితే, మా తల్లిదండ్రులతో నాకున్న స్వేచ్ఛాయుత సంబంధాల కారణంగా వారికి ఈ విషయం తెలియజేశాను. ఆ తర్వాత ఆ లిఫ్ట్ వ్యక్తి ఇలాంటివి ఎన్నో చేశాడని తెలిసింది. మనపై జరిగిన లైంగిక వేధింపులు చెప్పుకోవడంలో ఎలాంటి ఇబ్బంది పడొద్దు. ఇలా చేయడం ద్వారా నిరోదక చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది’ అని అక్షయ్ చెప్పారు.